VISAKHAPATNAM YSRCP LEADERS TESTING THEIR LUCK IN ACTING AS MLAS AND MP ACTED IN MOVIES AND SHORT FILMS FULL DETAILS HERE PRN VSP
YCP Leaders: కొత్త దారిలో వైసీపీ నేతలు.. మేకప్ వేస్తే లక్ కలిసొస్తుందా..?
నటనలో ఆసక్తి చూపిస్తున్న వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలకు, సినిమాలకు (Movies) చాలా దగ్గర సంబంధముంది. సినిమాల్లో స్టార్లుగా వెలుగొందిన వారు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణం. అలా వచ్చిన కొందరు సక్సెస్ అయ్యారు. మరికొందరు ఫెయిల్ అయ్యారు. కానీ రాజకీయాల నుంచి సినిమాల్లోకి వెళ్లడం చాలా అరుదు. ఏపీలో మాత్రం అధికార వైసీపీ నాయకులు ప్రజాసేవతో పాటు మేకప్ వేసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలకు, సినిమాలకు (Movies) చాలా దగ్గర సంబంధముంది. సినిమాల్లో స్టార్లుగా వెలుగొందిన వారు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణం. అలా వచ్చిన కొందరు సక్సెస్ అయ్యారు. మరికొందరు ఫెయిల్ అయ్యారు. కానీ రాజకీయాల నుంచి సినిమాల్లోకి వెళ్లడం చాలా అరుదు. ఏపీలో మాత్రం అధికార వైసీపీ నాయకులు ప్రజాసేవతో పాటు మేకప్ వేసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న చోడవరం ఎమ్మెల్యే, నిన్న విశాఖ ఎంపీ, ఇప్పుడు అరకు ఎమ్మెల్యే. విశాఖలో ఇప్పుడు వీరంతా సినిమాల్లో నటించడంలో బాగా బిజీగా ఉంటున్నారు. చేతిలో బోలెడు సినిమా ఆఫర్లతో బిజీగా కూడా ఉన్నారట. ఇప్పటికే విశాఖలో వీరు నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రజా సేవలో తరలించాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా.. సినిమాలు తీసుకునేంత కాళీగా ఉన్నారా.. అంటే అంతే మరి. సినిమా కూడా ఓ రకంగా ప్రజా సేవే అంటున్నారీ నేతలు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరి టాలెంట్ గుర్తించారో ఏమో.. వీలైనన్ని సినిమాల్లో "వేషాలు" ఇచ్చేస్తున్నారు.
ఇక విశాఖ విషయంలో సినిమా పరిశ్రమకు ఎంత మక్కువ ఉందో.. అంతే ఇష్టం ఇక్కడి రాజకీయ నేతలకీ ఉంది. అయితే కొందరు రాజకీయ నేతలకి ఆ సినిమా "ఇది" చాలా ఎక్కువే ఉందని ఈ మధ్య జరిగిన షూటింగ్ లే చెబుతున్నాయి. ఏడాది క్రితం చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఓ సినిమాలో నటించారు. అందులో ఓ స్వామీజీ గెటప్ లో ఆయన కనిపించారు. ఈ షూటింగ్ కూడా చాలావరకూ విశాఖ ఏజెన్సీలోనే జరిగింది. బడ్జెట్ చిన్నది కావడం.. ఇతరత్రా కారణాలతో సినిమా ఆశించినంత స్థాయి విజయాన్ని సాధించలేదు. అయితే ఇందులో చోడవరం ఎమ్మెల్యే నటించడంతో ఆ ప్రాంతం వాళ్లంతా ఇంట్రస్ట్ గా సినిమా చూడటానికి వెళ్లారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా సినిమా ప్రియులే. అందుకే ఈయన అడపాదడపా సినిమాల్లో నటిస్తుంటారు. ఎంపీ కాక ముందు ఆయన సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. అలాగే ఆయన సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇటీవల.. గల్లీ రౌడీ అనే సినిమాలో కూడా ఆయన నటించారు. విలన్ కి బాగా దగ్గరైన పెద్దాయన క్యారెక్టర్ లో ఆయన నటించి ఓ నిమిషం పాటు సందడి చేశారు. ఈ సినిమాతో పాటు కొన్ని సినిమాల్లో కూడా ఎంవీవీ నటించారట. అయితే కరోనా కారణం కొన్ని విడుదల కాలేదనుకోండి. ఒక పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా.. ఇటు ఎంపీగా కూడా సేవలందిస్తున్న ఆయన.. ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ అవుతున్నారు. మరి ప్రజా సేవ "ఓకేనా".. అంటే.. జగన్ మోహన్ రెడ్డి సర్కారులో దానికి కొదవేముంది. అంతా సీఎం అయినప్పుడు.. వీళ్లకి పనేముందని సెటైర్లు వేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
ఇక ఈ మధ్యే అరకు ఎమ్మెల్యే కూడా ఓ లఘు చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారట. జగన్ మోహన్ రెడ్డి "అమ్మ ఒడి" పథకాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమం ఇది. ఈ షార్ట్ ఫిల్మ్ లో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ "ప్రిన్సిపాల్" పాత్ర పోషించారు. ఇప్పటికే ఎమ్మెల్యే పాత్రలో జనాలకు సేవలందిస్తున్న ఫాల్గుణ ఇప్పుడు ప్రిన్సిపాల్ పాత్రలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఇలా విశాఖలో ఎమ్మెల్యేలు, ఎంపీలు సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. అయితే ఈ "వేషాల్లో" పడి ప్రజా సేవ మాత్రం మరిచిపోకండి అంటున్నాయి విపక్షల పార్టీలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.