Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM YSRCP LEADERS PALAVALASA VIKRANTH GETS MLA QUOTA MLC BERTH AS HIS FAMILY LOYAL TO CM YS JAGAN FULL DETAILS HERE PRN VZM

AP MLC Elections: ఆ కుటుంబంలో అందరికీ పదవులే.., సీఎం జగన్ మెచ్చడానికి కారణం ఇదేనా..!

పాలవలస విక్రాంత్, సీఎం జగన్ (ఫైల్)

పాలవలస విక్రాంత్, సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హడావిడి నడుస్తోంది. పదవుల కోసం చాలా మంది పైరవీలు చేసినా వైఎస్ఆర్సీపీ( YSRCP) అధిష్టానం మాత్రం అన్ని సమీకరణాలను బేరీజు వేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసింది.

    P.Bhanu Prasad, Vizianagaram, News18

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హడావిడి నడుస్తోంది. పదవుల కోసం చాలా మంది పైరవీలు చేసినా వైఎస్ఆర్సీపీ( YSRCP) అధిష్టానం మాత్రం అన్ని సమీకరణాలను బేరీజు వేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాకుళంకు చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లాకు చెందిన ఇసాక్ బాషా, కడప జిల్లాకు చెందిన గోవింద రెడ్డిని సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. వీరిలో ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం డీసీసీబీ మాజీ చైర్మన్‌, కాపు నేత పాలవలస విక్రాంత్‌కు వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. గత మూడు తరాలుగా రాజకీయాలలో ఉంటూ .. మొదట కాంగ్రెస్ పార్టీ, తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాలవలస కుటుంబానికి తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కింది.

    ఉత్తరాంధ్రలో సామాజిక సమీకరణల్లో భాగంగా తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కీలకమైన నేతగా ఉన్న పాలవలస విక్రాంత్‌కు అధిష్ఠానం ఎమ్మెల్సీని ఖరారు చేసింది. ఆయన సోదరి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా పాలవలస కుటుంబానికి చెందిన మహిళ కావడం విశేషం. శ్రీ‌కాకుళం జిల్లా రాజ‌కీయాల్లోనూ ఇంకా చెప్పాలంటే ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లోనూ కాపు సామాజిక‌వ‌ర్గం స్థానం గురించి.. ప్ర‌త్యేకంగా చెప్పనక్కర లేదు. ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కాపు, తూర్పు కాపు సామాజిక వర్గాలది కీలకమైన స్ధానం. ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేతలు కీలక పదవులలో రాణిస్తున్నారు.

    ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల.. జిల్లాల వారీగా ఎంపికైన నేతలు వీళ్లే..!



    విజయనగరం జిల్లాలో బొత్స స‌త్య‌నారాయ‌ణ కుటుంబానికి చెందిన నేతలు.. జిల్లాలో అంతా తామే అయి వ్యవహరిస్తుంటారు. జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బొత్స కుటుంబం ప్రాబ‌ల్యం, ప్రాధాన్యం గురించి చెప్పనక్కరలేదు. ఇక శ్రీ‌కాకుళం జిల్లాలోనూ ఎచ్చెర్ల‌, రాజాం, పాత‌ప‌ట్నం, పాల‌కొండ నియోజ‌క‌వర్గాల్లో ఈ సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువగా ఉంది. అదే విధంగా విశాఖ‌ జిల్లాలో గతంలో గంటా శ్రీనివాసరావు, తాజాగా అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్ నాధ్ లాంటి నేతలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇక ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ ఈ సామాజిక‌వ‌ర్గం బాగా విస్త‌రించి ఉంది.

    ఇది చదవండి: బీజేపీపై జగన్-కేసీఆర్ యుద్ధానికి కారణం ఇదేనా..? అసలు వ్యూహం వేరే ఉందా..? డైరెక్షన్ ఆయనదేనా..?


    ఇక శ్రీకాకుళం జిల్లాలో 2014లో టీడీపీ హవా ఎక్కువగా ఉన్న సమయంలో కూడా పాలకొండ డివిజన్‌లోని పాలకొండ, పాతపట్నం, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయఢంకా మోగించడంలో పాలవలస కుటుంబం కీలకపాత్ర పోషించారు. ఇక ఈ ఏడాదిలో జరిగిన స్థానిక సంస్ధల ఎన్నికలలో కూడా పార్టీ అభ్యర్ధులను గెలిపించడంలో విక్రాంత్ కుటుంబం విశేష కృషి చేసింది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మాత్రం ఇంకా దక్కలేదు. వారి కుటుంబం ప్రాబల్యం ఉన్న పాలకొండ ఎస్టీ నియోజకవర్గం కాగా, రాజాం ఎస్సీ నియోజకవర్గంగా ఉంటూ వస్తోంది. జిల్లాలో టీడీపీ నుండి బలంగా ఉన్న మాజీ మంత్రులు కిమిడి కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు కుటుంబాలకు చెక్ పెట్టేందుకు ఇక్కడ కాపులకు పెద్దపీట వేయడం జగన్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన క్ళష్ణదాస్ .. పాలవలస విక్రాంత్ కు ఇవ్వాలని పట్టుబట్టినట్టు కూడా సమాచారం.

    ఇది చదవండి: వాళ్లిద్దరి విషయంలో మాట నిలబెట్టుకున్న జగన్... మిగిలిన వారి ఆశ కూడా అదే..!



    కుటుంబంలో అందరికీ పదవులు..
    గ‌తంలో ఈయ‌న‌కే నామినేటెడ్ పోస్ట్ అయిన డీసీసీబీ చైర్మన్ ప‌ద‌విని కూడా ఇచ్చారు సీఎం జగన్. ఈ ప‌ద‌వి నుంచి దిగిన వెంట‌నే ఈయ‌న‌కు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి గౌర‌వం అందించారు. ఇక ఆయన సోదరి పాల‌వ‌ల‌స విక్రాంత్ సోద‌రి రెడ్డి శాంతి ప్రస్తుతం పాత‌ప‌ట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న త‌ల్లి పాల‌వ‌ల‌స ఇందుమ‌తి రేగిడి జెడ్పీటీసీ. ఇక భార్య గౌరీ పార్వ‌తి పాల‌కొండ జెడ్పీటీసీగా ఉన్నారు. వాస్తవానికి మొన్న‌టి జెడ్పీ ఎన్నిక‌ల అనంత‌రం జెడ్సీ చైర్ ప‌ర్సన్ ప‌ద‌వి కూడా ఈ కుటుంబానికే ద‌క్కుతుంద‌ని ఆశించినా చివ‌రి నిమిషంలో అది చేజారింది. దీంతో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ కు బ‌దులు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి జ‌గ‌న్ త‌న మాట నిల‌బెట్టుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap mlc elections, Srikakulam, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు