హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Attack on Volunteers: గ్రామ వాలంటీర్లపై పొలిటికల్ కత్తి... మాటవినకుంటే దెబ్బలు తినాల్సిందే.. ఎక్కడంటే..!

Attack on Volunteers: గ్రామ వాలంటీర్లపై పొలిటికల్ కత్తి... మాటవినకుంటే దెబ్బలు తినాల్సిందే.. ఎక్కడంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రభుత్వ పథకాలను (Government Schemes) నేరుగా వారి ఇళ్లవద్దకే వెళ్లి అదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వాలంటీర్ల వ్యవస్థను (Grama Volunteers) ప్రవేశపెట్టింది. ఐతే కొన్నిచోట్ల వాలంటీర్లపై దాడులు జరుగుతున్నాయి.

ఇంకా చదవండి ...

  P.Bhanu Prasad, Vizianagaram, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రవేశపెట్టిన సచివాలయ వ్వవస్ధ (Village Secretariats)  ద్వారా.. ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేయడం, అవినీతి, అక్రమాలు లేని పరిపాలన అందించేందుకు వాలంటీర్ల వ్యవస్ధను (Village Volunteers) ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ పధకాలను చేరవేస్తున్నారు. కాగా.. వాలంటీర్లు కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకుల దాడులకు గురవుతున్నారు. తమ వారికి న్యాయం చేయలేదన్న కారణంతో .. తమకే అడ్డొస్తారా అంటూ భౌతిక దాడులకు దిగడం, వారిని తొలగించడం, మరోచోటకు బదిలీ చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కాగితాపల్లిలో వైసీపీ మద్దతుదారులు వలంటీర్‌పై దాష్టీకానికి పాల్పడ్డారు.

  చెప్పిన మాట వినడం లేదని... అన్నింటా అడ్డుగా నిలుస్తున్నాడనే కారణంతో వాలంటీర్‌పై దాడి చేశారు. రచ్చబండ వద్ద విద్యుత్‌ స్తంభానికి ఆయనను కట్టేశారు. దీనిపై ప్రశ్నించినందుకు వాలంటీర్‌ బంధువులపైనా దాడికి పాల్పడ్డారు. గురువారం ఈ సంఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాగితాపల్లి గ్రామ వాలంటీరు కిమిడి గౌరునాయుడుపై వైసీపీ మద్దతుదారులు కొందరు దాడికి పాల్పడ్డారు. వాలంటీరు భవానీ దీక్షలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  ఇది చదవండి: అందుకు సిద్ధంగా ఉండండి...! విద్యుత్ సంక్షోభంపై సజ్జల సంచలన వ్యాఖ్యలు..


  గురువారం మధ్యాహ్నం భవానీ దీక్ష పూజ కోసం గౌరునాయుడు పాలకొండ మండలం మంగళాపురం వెళ్లి తిరిగొస్తున్నాడు. ఆ సమయంలో అతడిని కొందరు వైసీపీ మద్దతుదారులు బలవంతంగా కారులో ఎక్కించారు. స్వగ్రామంలో రచ్చబండ వద్ద స్తంభానికి కట్టి దాడి చేశారు. వెంటనే ఈ ఘటనపై బాధిత వాలంటీర్‌ ఎస్పీకి వాట్సాప్‌లో ఫిర్యాదు చేశాడు. అదేరోజు పాలకొండ డీఎస్పీ, సీఐతో పాటు రేగిడి పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. చెప్పిన మాట వినడం లేదనే కారణంగా తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయమై ప్రశ్నించిన తన బంధువులపైనా దాడికి పాల్పడ్డారని వివరించాడు.

  ఇది చదవండి: పోసాని నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకు జనసేన కార్యకర్త కంప్లైంట్..  రెండేళ్ల కిందట కూడా నాణ్యమైన బియ్యం పంపిణీ విషయమై.. ఇదే వ్యక్తులు తనపై దాడి చేయగా అప్పట్లో కేసు నమోదైందని తెలిపాడు. తనకు ప్రాణభయం ఉందని, అందుకే గ్రామానికి దూరంగా తల దాచుకుంటున్నానని.. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. కాగా, కేసు పెట్టి రెండు రోజులైనా అధికార పార్టీ నాయకులు కావడంతో.. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. దీంతో ఈ దాడి విషయం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. విషయం రానురానూ.. పెద్దది కావడంతో.. ఈ ఘటనపై రాజీ కుదిర్చేందుకు కొందరు నేతలు ప్రయత్నించారు. కానీ.. వాలంటీరు గౌరునాయుడు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.

  ఇది చదవండి: ఆ అమ్మాయిని ప్రేమించడమే ఈ కుర్రాడు చేసిన తప్పు... మరీ అంత కిరాతకమా..?  ఈ క్రమంలో కేసు నమోదులో జాప్యం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, స్ధానిక పోలీసులను విచారణ అధికారులుగా నియమించామని, పోలీసు అధికారులు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాలంటీర్‌ గౌరునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు .. ఇప్పటివరకూ ఆరుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీసీ ఫుటేజ్‌ సేకరించి.. సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. స్తంభానికి కట్టి దాడి చేసినట్టు రుజువైతే.. ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. వాలంటీర్‌కు కూడా రక్షణ కల్పిస్తామని తెలిపారు.

  ప్రస్తుతం బయట ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం అవకాశం కల్పించిన వాలంటీర్ల వ్యవస్ధలో పనిచేస్తున్నామని, కానీ వైసీపీ నేతలు తమపైనే దాడులకు దిగడమేంటంటూ.. వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా.. నిబద్దతతో గ్రామీణ, పట్టణ సచివాలయాల్లో వాలంటీర్లుగా ప్రజలకు చేరవేస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఈ దాడుల విషయంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమకు సహకరించాలని వాలంటీర్లు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Gram volunteer, Srikakulam

  ఉత్తమ కథలు