హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Central Govt Scheme: యువతకు కేంద్రం గుడ్ న్యూస్.. సబ్సిడీతో రూ.20లక్షల లోన్.. వివరాలివే..

Central Govt Scheme: యువతకు కేంద్రం గుడ్ న్యూస్.. సబ్సిడీతో రూ.20లక్షల లోన్.. వివరాలివే..

యువతకు కేంద్రం గుడ్ న్యూస్

యువతకు కేంద్రం గుడ్ న్యూస్

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తూ వారు సొంత పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తూ వారు సొంత పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి పద్మ అన్నారు. స్థానిక ఎంపీడీవో అనకాపల్లి (Anakapalli) కార్యాలయంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పధకం, ఖాదీ బోర్డు వారు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఈ పధకాన్ని ఈ ప్రాంత నిరుద్యోగ యువత ముందుకు వచ్చి చిన్న తరహా పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోని ఉపాధి అవకాశాలు పొందాలని ఆమె సూచించారు.

ఈ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందారని గ్రామీణ ప్రాంతంలో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటే మైదాన ప్రాంతానికి దీటుగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి పొందడం ఖాయమన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది అన్నారు.

ఇది చదవండి: చదివింది ఏడో తరగతి.. అయినా లక్షల్లో బిజినెస్

చిన్న పరిశ్రమల ప్రాజెక్టులు ఏర్పాటుకు నిరుద్యోగ యువత గరిష్టం గా సుమారు ఉత్పత్తి రంగ పరిశ్రమలు 50 లక్షల ప్రాజెక్టు వ్యయం వరకు, సేవారంగం పరిశ్రమలకు 20 లక్షల వరకు స్థాపించుకోవచ్చు అన్నారు. 35 శాతం సబ్సిడీ వస్తుంది అన్నారు... బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ లోన్ తీసుకొని యువకులు పదిమందికి ఉపాధి కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వారు ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే మంచి పథకం ఇది. ఈ కార్యక్రమం లో లోన్ మంజూరు అయిన సబ్సిడీ పొందిన వారికి తగు ఆర్డర్ కాపీ అందజేశారు. ఈ కార్యక్రమం లో డిపి డిఆర్డీఏ లక్ష్మి పతి, అనకాపల్లి లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ, ఖాదీ బోర్డ్ ఇన్స్పెక్టర్ సురేష్, బ్యాంకు ఆఫ్ బరోడా మేనేజర్ కిషోర్, కెనరా బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్, ఏడి జోగినాధం తదితరులు ఇందులో పాల్గొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Central Government, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు