Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM YOUR HOUSES ARE NOT SAFE WHEN YOU ARE LOCKED UP THEFT CASES INCREASE IN VISAKAPATNAM VSJ NJ ABH

Vizag: మీ ఇంటికి తాళం వేశారా అంతే సంగతులు... మీరొచ్చేసరికి ఇళ్లంతా దోచేస్తారు..! జర జాగ్రత్త..!

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌..!

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌..!

విశాఖలో ఈ మధ్య యువకులు తప్పుదోవ పట్టి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలై యువకులు దారి తప్పుతున్నారు. చెడు అలవాట్లకులోనై సరిపడా డబ్బు లేకపోవడంతో క్షణికావేశంలో ఎంతటికైనా తెగిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (Setti Jagadesh, News 18, Vizag)

    విశాఖలో ఈ మధ్య యువకులు తప్పుదోవ పట్టి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలై యువకులు దారి తప్పుతున్నారు. చెడు అలవాట్లకులోనై సరిపడా డబ్బు లేకపోవడంతో క్షణికావేశంలో ఎంతటికైనా తెగిస్తున్నారు.

    విశాఖలో అనేక మంది యువకులు (youth) యుక్త వయస్సులో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కన్న కలలను కల్లలు చేస్తున్నారు. జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలై యువకులు దారి తప్పుతున్నారు. చెడు అలవాట్లకులోనై సరిపడా డబ్బు లేకపోవడంతో క్షణికావేశంలో ఎంతటికైనా తెగిస్తున్నారు. తెలిసీతెలియని వయస్సులోనే నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. ఫలితంగా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.



    విశాఖలో ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే చాలు.. దాన్ని చాకచక్యంగా పగలగొట్టి దొంగతనానికి పాల్పడతారు. ఇలాంటి ఇద్దరు దొంగలను విశాఖ పోలీసులు పట్టుకొన్నారు. చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగాపురంకాలనీ దగ్గర నివాసముంటున్న షేక్ పర్వీన్ అనే మహిళ.. ఈ నెల 3న తన ఇంటికి తాళం వేసి పి.ఎం.పాలెంలోని అమ్మగారింటికి వెళ్లారు. ఈ నెల 6న పర్వీన్ నివాసంలో అద్దెకు ఉంటున్న రామారావు ఫోన్‌చేసి…ఇంటి తాళాలు తీసి ఉన్నాయని.. లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే పర్వీన్‌ వచ్చిచూడగా.. ఇంట్లో ఉన్న 14 తులాల బంగారు ఆభరణాలు, 250 తులాల వెండి వస్తువులు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లుగా గుర్తించి ఎంవీపీ కాలనీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

    విశాఖ ఎంవీపీ పోలీసులు పాత నేరస్తుల వివరాల ద్వారా విచారణ మొదలుపెట్టారు. ఈ నెల 8న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జేఆర్. నగర్ రోడ్డులో పాత నేరస్తులైన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా పర్వీన్‌ ఇంట్లో దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. నిందితులు దొంగకొమ్మాదికి చెందిన మరడ సాయి(24), వేపగుంటకు చెందిన షణ్ముఖరావు (19).

    మరడ సాయి జల్సాలకు అలవాటుపడి డబ్బులకోసం రాత్రుళ్లు తిరుగుతూ.. ఇళ్లకు తాళాలు వేసి ఉంటే చాలు దొంగతనానికి పాల్పడుండేవాడు. రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా తన బుద్ది మార్చుకోలేదు. షణ్ముఖరావు అనే యువకుడితో కలిసి మళ్లీ దొంగతనాలకు ప్లాన్ చేశాడు. వీరిద్దరు కలిసి ఈ నెల 5న అర్ధరాత్రి ఈ దొంగతనానికి పాల్పడట్టు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

    Read this; Vizag: డ్రగ్స్ దందాకు అడ్డాగా డార్క్ వెబ్.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Local News, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు