Setti Jagadeesh, News 18, Visakhapatnam
శీతాకాలం (Winter) లో వచ్చిందంటే విశాఖపట్నం (Visakhapatnam) మన్యంలో పొగ మంచు అధిక శాతం ఉంటుంది. దీంతో గిరిజనులు ఇతర వ్యాపారస్తులు స్థానికంగా మన్యంలో కొన్ని ప్రదేశాలలో కూరగాయలు పండించి విక్రయిస్తూ ఉంటారు. ఒక శీతాకాలం మూడు నెలల్లోనే కూరగాయలు పండించి అధిక శాతం లాభాలు పొందుతూ ఉంటారు. మంచు తెరలు ఎక్కువగా ఉండటంతో అధిక శాతం కూరగాయలు ఎక్కువగా పంటలు పండుతాయి. శీతాకాలంలో సాగు చేసే పంటల్లో క్యాబేజి ఒకటి. క్యాబేజీ చల్లని , తేమగా ఉన్న వాతావరణాలలో ఈ పంటలు పండిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఈ క్యాబేజీ పంటలో మంచి పద్ధతులు అనుసరించి పండిస్తే మంచి లాభాలు అర్జించవచ్చు అంటున్నాడు రైతు మహేష్.
పాడేరు నగరంలో రైతు మహేష్ రెండు ఎకరాలు స్థానంలో పంటలు పండిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. దీనిలో భాగంగానే క్యాబేజీ పంట వేసి ఆదాయం పొందుతున్నాడు. స్థానికంగా పాడేరులో పది రూపాయలకే క్యాబేజీని విక్రయిస్తున్నారు. అధిక శాతం బయట నుండి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తూ ఉంటారని అంటున్నారు. తన వద్ద బుట్ట పది రూపాయలు కానీ బహిరంగ మార్కెట్లో 20-30 రూపాయల వరకు కూడా ఉందని అంటున్నారు.
క్యాబేజీ పంట ఎలా పండించాలి:
ఈ క్యాబేజీ పంటకు అధిక శాతం ఎక్కడపడితే అక్కడ పండవు.. ఈ పంటకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు అనువైనవి అని చెప్పవచ్చు. క్యాబేజీ పంట వెయ్యడానికి ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో ఆ నేలను 2 నుండి 3 సార్లు నేల వదులు అయ్యేలా బాగా దున్నుకోవాలి. బాగా మెత్తగా అయిన తర్వాత చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు వేసుకొని చివరి దుక్కిని బాగా దున్నుకోవాలి. ఈ క్యాబేజీ పంట ఒక్క ఎకరానికి దేశవాళి రకం విత్తనాలు అయితే 300 గ్రాముల విత్తనాలు అవసరం పడుతాయి.
ఈ క్యాబేజీ విత్తనాలు వేసిన తర్వాత కొంచెం నీరు అందించి దానిపై వరిగడ్డి వేసుకోవాలి. ప్రతి రోజు నీటిని తక్కువగా తడుపుకోవడం చేయాలి. నేలపై నారు పెంచేవారు మడిలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Organic Farming, Visakhapatnam