Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM YOUNG MAN BOOKED FOR SENDING PRIVATE PHOTOS TO LOVERS FATHER IN VIZIANAGARAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VZM

Love Cheating: ప్రేమించానంటే హద్దులు దాటింది.. కానీ తండ్రికే అలాంటి ఫోటోలు పంపాడు..!

నిందితుడు సీరెడ్డి నవీన్

నిందితుడు సీరెడ్డి నవీన్

Lovers: వాళ్లిద్దరూ ఒకే గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు. ఆఫీస్ లో ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ప్రేమ ఇంకా ముదిరి హద్దులు దాటేవరకు వెళ్లింది. పెద్దలు పెళ్లి కుదిర్చినా అతగాడి కట్నదాహంతో రద్దైంది. కానీ అతడి దుర్మార్గపు ఆలోచనను యువతి అర్ధం చేసుకోలేకపోయింది.

ఇంకా చదవండి ...
    P Bhanu Prasad, News18, Vizianagaram

    వాళ్లిద్దరూ ఒకే గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు. ఆఫీస్ లో ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ప్రేమ ఇంకా ముదిరి హద్దులు దాటేవరకు వెళ్లింది. పెద్దలు పెళ్లి కుదిర్చినా అతగాడి కట్నదాహంతో రద్దైంది. కానీ అతడి దుర్మార్గపు ఆలోచనను యువతి అర్ధం చేసుకోలేకపోయింది. చివరకి లవ్ స్టోరీ కాస్తా... బ్లాక్ మెయిలింగ్ వరకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram) ఎస్.కోటలో మండలం ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో సీరెడ్డి నవీన్ అనే యువకుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అదే సచివాలయంలో ఓ యువతి మహిళా పోలీస్ గా విధులు నిర్వర్తిస్తోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పది నెలల క్రితం వివాహం కూడా నిశ్చయించారు. ఈ లోగా ఇద్దరూ పలుసార్లు శారీరకంగా కలిశారు.

    అయితే సీరెడ్డి నవీన్ కుటుంబం పెళ్లి చేయడం కోసం రూ.50 లక్షలు కట్నం కావాలని అడగడంతో, ఇరువురి కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆ క్రమంలో అమ్మాయి తల్లితండ్రులు పెళ్లి చేయలేమని చెప్పడం సంబంధం రద్దు చేసుకున్నారు దీంతో నవీన్ కు యువతికి మధ్య విభేదాలొచ్చాయి. దీంతో అమ్మాయి కుటుంబంపై కక్ష పెంచుకున్న నవీన్.. తన ప్రియురాలి నగ్న ఫోటోలను ఆమె తండ్రికి వాట్సాప్ లో పంపించాడు.

    ఇది చదవండి: తేజస్విని విషయంలో వీడని మిస్టరీ.. ప్రియుడే చేశాడా..? ఆ రాత్రి ఏం జరిగింది..?


    దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న బాధితురాలు ఎస్.కోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన ప్రియుడుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎస్.కోట పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు సీరెడ్డి నవీన్ ను అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో నవీన్ తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

    ఇది చదవండి: పెళ్లై 24ఏళ్లైనా ఈ మహాతల్లి పక్కచూపులు మానలేదు.. ఎంతదారుణానికి ఒడిగట్టిందో చూడండి..


    గతంలో విజయవాడలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున విద్యార్థిని.. తన క్లాస్ మేట్ ప్రేమ పేరుతో నమ్మించాడు. పలుసార్లు శారీరకంగా కలిశాడు. ఏకాంతంగా కలిసిన సమయంలో నగ్న ఫోటోలను తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు వీళ్ల వ్యవహారం సాఫీగానే సాగింది. ఐతే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అమ్మాయి బ్రేకప్ చెప్పింది. దీంతో కక్ష పెంచుకున్న ప్రియుడు ఆమె ప్రైవేట్ ఫోటోలను ఇన్ గ్రామ్ లో షేర్ చేశాడు. విషయం తెలుకున్న బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకుడిని, అతడి స్నేహితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Nude videos blackmails, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు