VISAKHAPATNAM YOUNG BOYS CREATED HISTORY BY CLIMBING MOUNT EVEREST AND LADDAKH WITHIN FOUR MONTHS FULL DETAILS HERE PRN VSP
Vizag Boys: సాహసమే వారి ఊపిరి.. లక్ష్యం ముందు ఎవరెస్ట్ చిన్నబోయింది.. విశాఖ కుర్రాళ్లా మజాకా..!
పర్వాతారోహణలో విశాఖ కుర్రాళ్ల రికార్డు
Mountaineering: ప్రపంచంలో ఎత్తైన శిఖరాలను అధిరోహించాలంటే పెద్ద సాహసమే చేయాలి. ప్రాణాలు పణంగా పెట్టాలి. అలాంటి సాహసాన్ని కేవలం నాలుగే నెలలు వ్యవధిలో ఇద్దరు యువకులు సాధించి చూపించారు.
పర్వాతారోహణ (Mountaineering). చాలా కష్టమైన పని. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలను అధిరోహించాలంటే పెద్ద సాహసమే చేయాలి. ప్రాణాలు పణంగా పెట్టాలి. అలాంటి సాహసాన్ని కేవలం నాలుగే నెలలు వ్యవధిలో ఇద్దరు యువకులు సాధించి చూపించారు. ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. మువ్వన్నెల పతాకాన్ని పర్వతాగ్రాన రెపరెపలాడించారు. ఇద్దరూ వేర్వేరు పర్వతాలనే ఎంచుకున్నా.. గమ్యం మాత్రం ఒకే విధంగా కష్టించి మరీ చేరుకున్నారు ఆంధ్రా కుర్రాళ్లు. ఈ ఏడాది జూన్ లో అన్మీష్ వర్మ.. ఇప్పుడు జతిన్ అతి కష్టమైన పర్వతారోహణ చేసి విశాఖపట్నం (Visakhapatnam) ఖ్యాతిని పెంచారు. విశాఖలోని సీతమ్మధారకు చెందిన ఆ యువకుడు లడాఖ్ పర్వతాన్ని అధిరోహించి ఖ్యాతిగడించాడు. ఈ ఏడాది జూన్ లో పీఎం పాలెం ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మీష్‌వర్మ తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని(Mount Everest) అధిరోహించి రికార్డు కెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత కష్టమైన పర్వాతారోహణ
ఎనిమిది వేల మీటర్ల పైబడి ట్రెక్కింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జతిన్ షా మొత్తానికి సక్సెస్ అయ్యాడు. విశాఖ నగరంలోని సీతమ్మధారకు చెందిన యువ పర్వతారోహకుడు జతిన్ షా. ఇప్పటివరకు తను చేసిన పర్వతారోహణ విశేషాలను తెలిపారు. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏడు జాతీయ స్థాయి హిమాలయన్ ట్రెక్కింగ్ పూర్తి చేశారు. జవహర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే ప్రాథమిక పర్వతారోహణ కోర్సు (బీఎంసీ), బేసిక్ స్కేయింగ్ కోర్సు (బీఎస్సీ)లను 2019లో పూర్తి చేశారు.
2019లో డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్(హెచ్ఎమ్ఐ) నిర్వహించే అడ్వాన్స్ మౌంటెనీరింగ్ కోర్సులో బీసీ రాయ్ శిఖరం వరకు దాదాపు 5,548 మీటర్ల ట్రెక్కింగ్ చేశారు. తాజాగా గత నెలలో లడఖ్ ప్రాంతంలోని హిమాలయాల్లోని అత్యంత ప్రమాదకరమైన మార్ఖాలోయ చివరిలో ఉన్న కాంగ్ యాట్సే (6280 మీటర్లు), జోంగో శిఖరం (6200మీటర్లు) ఒక్కసారే పూర్తి చేశారు జతిన్. తన ఆసక్తిని గమనించి యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తనకు పూర్తిగా సహకరించిందని జతిన్ అన్నారు.
ఇక ఇదే ఏడాది జూన్ ఒకటో తేదీన ఎవరెస్ట్ శిఖరంపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించి హిమాలయాల దిగువకు సురక్షితంగా చేరుకున్నారు అన్మీష్ వర్మ. నగరానికి చెందిన భూపతిరాజు అన్మీష్ వర్మ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుని, శిక్షణ కోసం 2018లో కడపలోని గండికోట స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. డార్జిలింగ్ వెళ్లి ప్రాథమిక పర్వతారోహణ కోర్సు కూడా పూర్తిచేశారు. ఆపై కశ్మీర్‌లోని లడక్ ప్రాంతానికి వెళ్లి తీవ్రమైన చలి పరిస్థితులను తట్టుకునే మెలకువలను నేర్చుకున్నారు. ఇదే అంశంపై అక్కడే కోర్సును నేర్చుకున్నారు. అన్నీ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి తన సామర్థ్యాన్ని తెలుసుకుని, 2018లో రాష్ట్రప్రభుత్వ యువజన సేవల విభాగం అధికారులు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు ఐదుగురిని ఎంపిక చేయగా.. వీరిలో ఒకరుగా అన్మీష్ నిలిచారు.
అదే సంవత్సరం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి వెళ్లారు. తీవ్రమైన చలిపరిస్థితులు తత్తి అన్మీష్ బృందంలోని ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆ బృందం మొత్తం వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నా కూడా.. తన కలల్ని సాకారం చేసుకోవడానికి అన్మీష్ ముందడుగు వేశారు. ఏప్రిల్ 19వ తేదీన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి పర్వతారోహణ ప్రారంభించారు. ఇద్దరు యువకులు విశాఖ వారే కావడం.. అందులోనూ నాలుగు నెలల్లోనే ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. యాదృచ్ఛికం కూడా. ఇలాంటి విజయాలు మరిన్ని వీరు సాధించాలన్నది విశాఖ యూత్ కోరిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.