Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM YOU WILL HAVE UNIQUE EXPERIENCE IF SEE VIZAG CITY FORM DOLPHIN NOSE LIGHT HOUSE FULL DETAILS HERE PRN VNL NJ

Vizag News: అక్కడ నుంచి చూస్తే వైజాగ్‌ సిటీ మొత్తం కనిపిస్తుంది...! ఆ ఎక్స్ పీరియన్స్ వేరే లెవల్..!

విశాఖలో

విశాఖలో డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్

Beauty of Vizag: మైండ్‌ బ్లోయింగ్‌.. అమేజింగ్‌..లవ్‌ లీ.. డాల్ఫిన్‌ నోస్‌ లైట్‌ హౌస్‌ను చూసినప్పుడు పర్యాటకులకు కలిగే ఫీలింగ్ ఇది. ఈ అందమైన డాల్ఫిన్‌ నోస్‌ లైట్‌ హౌస్‌ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

  Neelima Eaty, News18 Visakhapatnam

  మైండ్‌ బ్లోయింగ్‌.. అమేజింగ్‌..లవ్‌ లీ.. డాల్ఫిన్‌ నోస్‌ లైట్‌ హౌస్‌ను చూసినప్పుడు పర్యాటకులకు కలిగే ఫీలింగ్ ఇది. ఈ అందమైన డాల్ఫిన్‌ నోస్‌ లైట్‌ హౌస్‌ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) సహజ ఓడరేవుగా ఉండటానికి కారణం ఈ డాల్ఫిన్‌ నోస్ కొండే. ఈ కొండ అచ్చం డాల్ఫిన్‌ ముక్కును పోలి ఉంటుంది. అందుకే ఈ కొండకు ఆ పేరు వచ్చింది. ఇక్కడి అందాలకు టూరిస్టులు ముగ్ధులైపోవాల్సిందే..! విశాఖపట్నంలోని యారాడ, గంగవరం పోర్టు మధ్యలో ఈ డాల్ఫిన్‌ నోస్‌ కొండ (Dolphin nose Hill) నెలకొని ఉంది. వైజాగ్‌లోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలలో ఈ సహజ అద్భుత కొండ ఒకటి. వైజాగ్‌ (Vizag)పర్యటనకు వచ్చిన వాళ్లు తప్పకుండా ఇక్కడికి వెళ్తారు. ఈ కొండ మీద నుంచి చూస్తే 360డిగ్రీల్లో వైజాగ్‌ సిటీ మొత్తం కనిపిస్తుంది.

  చరిత్రకు సాక్షాత్కారంగా డాల్ఫిన్‌ నోస్‌ కొండ మన కళ్లముందు కనిపిస్తున్నా..దాని గురించి కొన్ని విషయాలు అందరికీ తెలియవు. అంతే కాదు ఒక ప్రసిద్ధ నౌకా యుద్ధానికి ఈ కొండ నిలువెత్తు సాక్ష్యం. 1804 సంవత్సరంలో ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్య ఈ ప్రాంతంలోనే నౌకా యుద్ధం జరిగింది. ఈ కొండపై ఉన్న లైట్‌హౌస్.., సముద్రంలోని ఓడలు.., విశాఖపట్నం ఓడరేవులోకి ప్రవేశించడానికి దారి చూపిస్తుంది. సముద్ర మట్టానికి 384 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ లైట్‌ హౌస్‌ ద్వారా సముద్రంలోని దాదాపు 64 కిలోమీటర్ల వరకు జాలరులకు దారిచూపుతుంది. డాల్ఫిన్ నోస్ కొండపై భాగంలోనే ఈ లైట్‌ హౌస్‌ ఉంది.

  ఇది చదవండి: గోరింటాకుతో ఇన్ని లాభాలున్నాయా..? ఆషాఢంలో ఆడపిల్లల సాంప్రదాయం..!


  ఈ కొండపై ఉన్న లైట్‌ హౌస్‌ ను 1960లో నిర్మించగా.., శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించారు. ఇప్పడు మనం చూస్తున్న లైట్ హౌస్‌.., డాల్ఫిన్ నోస్ హిల్ టాప్ నుండి తుఫానులను ట్రాక్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. కొంతమంది స్థానికులు ఈ ప్రాంతంలోని బీచ్‌ దగ్గరకు కొన్ని డాల్ఫిన్‌లు వస్తుంటాయని చెబుతుంటారు. అయితే అది నిజమో కాదో ఎవ్వరూ నిర్థారించలేకపోయారు. సురక్షితమైన నావికా మార్గాన్ని రక్షించే బహుళ మత పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక లైట్‌హౌస్‌ ప్రాంతం ఇదేనంటారు స్థానికులు. డాల్ఫిన్స్ నోస్ పైన ఉన్న సాగర మాత ఆలయంతో పాటు అక్కడ 700 ఏళ్ల నాటి ఇషాక్ మదీనా దర్గా కూడా ఉంది. నావికులు మరియు నౌకాదళ సభ్యులు నౌకాశ్రయంలోకి వెళ్లేటప్పుడు ఇక్కడ ఆశీర్వాదం తీసుకుని వెళ్తుంటారట.

  ఇది చదవండి: వీళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు..! దూరమైన వాళ్లను దగ్గర చేస్తారు..!


  లైట్‌హౌస్‌ వ్యూ అదిరిపోతుంది..!
  లైట్‌ హౌస్‌ మీదకు సులభంగా వెళ్లేందుకు అక్కడ మెట్ల నిర్మాణం ఉంది..లైట్‌ హౌస్‌ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి కనిపించే దృశ్యాలు చూస్తే ఎవ్వరైనా వావ్‌ అనాల్సిందే.. అత్యంత సుందరమైన ప్రకృతి మనకు అంత ఎత్తు నుంచి కనిపిస్తుంది. వైజాగ్‌ సిటీ, బీచ్‌లు, పోర్టుతో సహా అన్ని కనిపిస్తాయి. ఈ లైట్ హౌస్ పరిసర ప్రాంతంమంతా ఎప్పుడూ క్లీన్‌గా మరియు అందంగా నిర్వహిస్తారని పర్యాటకులు కితాబునిస్తారు. వీకెండ్స్‌, హాలిడేస్‌ సమయంలో ఈ డాల్ఫిన్‌నోస్‌ కొండ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్‌, కపుల్స్‌ ఎక్కువగా ఈ ప్లేస్‌లో ఎంజాయ్‌ చేస్తుంటారు. డాల్ఫిన్స్ నోస్‌కి ‘యారాడ కొండ’ అనే పేరు కూడా ఉంది. అదే పేరుతో దగ్గరలో ఉన్న మత్స్యకార గ్రామాన్ని తప్పకుండా చూడాల్సిందే..!

  ఇది చదవండి: ప్రపంచంలోనే యంగెస్ట్ స్కూబా డైవర్..? పదేళ్లకే సాగరంలో అద్భుతాలు..?


  భద్రతా తనిఖీలు తప్పనిసరి..!
  ప్రతి సంవత్సరం ఆగస్టు 7ని జాతీయ లైట్‌హౌస్ దినోత్సవంగా జరుపుకుంటారు. డాల్ఫిన్స్ నోస్ ఇండియన్ నేవీ బేస్ కిందకు వస్తుంది. కొండపై నిషేధిత ప్రాంతాలు ఉన్నాయి కానీ పౌరులకు చాలా అందమైన ప్రదేశాలకు అనుమతి ఉంది. ఇది నేవీ డిపార్ట్‌మెంట్‌ కింద ఉండటంతో.., అక్కడకు వెళ్లాలంటే కొన్ని భద్రతా తనిఖీలు తప్పనిసరి. మీ ఐడికార్డు(ఆధార్‌, వోటర్‌ ఐడీలాంటివి) ను తప్పనిసరిగా చూపించాకే మిమ్మల్ని లోపలికి వెళ్లనిస్తారు.

  ఇది చదవండి: ఏపీ తీరంలో టైటానిక్.. వందేళ్లుగా సముద్రంలోనే..ఆసక్తిని రేకెత్తిస్తున్న షిప్ హిస్టరీ..!


  విశాఖపట్నంలోని డాల్ఫిన్స్ నోస్ లైట్‌ హౌస్‌ను సందర్శించడానికి ప్రవేశ రుసుము భారతీయులకు రూ.10, విదేశీయులకు రూ.25. మూడేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు వారికి రూ.3 వసూలు చేస్తారు. మీతో పాటు కెమెరా తీసుకెళ్లాలంటే రూ.20, వీడియో కెమెరాకు రూ. 25 రూపాయలు. అన్ని వయస్సుల వారు ఇక్కడ సందర్శించవచ్చు, ఇది యారాడ బీచ్‌కి వెళ్లే మార్గంలో ఉంది మరియు ఇది నేవీ క్వాటర్స్ మరియు అత్యంత సురక్షితమైన ప్రదేశం చుట్టూ ఈ కొండ ఉంది. పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, మంచి వ్యూ పాయింట్‌లు కోరుకునే వాళ్లు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.


  టైమింగ్స్‌: ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పర్యాటకులకు ఎంట్రీ ఉంటుంది. వారంలో ఏడు రోజులు తెరిచే ఉంటుంది.
  అడ్రస్‌ : డాల్ఫిన్‌ హిల్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530005

  Dolphin nose light House in Vizag MAP

  ఎలా వెళ్లాలి..?
  ఆర్టీసీ నుండి సింధియా జంక్షన్ వరకు బస్సులో వెళ్లొచ్చు.. స్టేషన్ బస్సు నంబర్ 99, 400, 400 సిరీస్ నుండి సింధియా జంక్షన్‌కు అందుబాటులో ఉన్నాయి. ఆ బస్సులు ప్రతి పదినిమిషాలకు ఒకటి ఉంటుంది. సింధియా వద్ద దిగి, బస్సు నంబర్ 16 ఎక్కితే… ఆ బస్సు నేరుగా యారాడ బీచ్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి డాల్ఫిన్‌ నోస్‌ కొండకు వెళ్లొచ్చు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  తదుపరి వార్తలు