(అన్నా రఘు Sr.కరస్పాండెంట్ న్యూస్ 18, అమరావతి)
WPL Auction 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంట్రీతో క్రికెట్ ముఖ చిత్రమే మారిపోయింది. ఐపీఎల్ లో ఆడితే చాలు డబ్బుకు డబ్బు పేరుకు పేరు రావడం ఖాయం. ఐపీఎల్ హిట్ కావడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కూడా సిద్దమైపోయింది. ఐదు జట్లతో జరిగే ఈ లీగ్ కు సంబంధించిన వేలాన్ని ముంబై వేదికగా ఆదివారం నిర్వహించారు. వేలంలో స్టార్ ప్లేయర్లు రికార్డు ధర కూడా పలికారు. ఇక ఇందులో తెలుగు ప్లేయర్లు కూడా తమ లక్ ను పరీక్షించుకున్నారు. ఇందులో విశాఖ పట్నానికి చెందిన ఏడువాక హేమ రోషిని కూడా ఉన్నారు. అయితే ఆమెకు నిరాశే ఎదురైంది. ఐదు జట్లలో ఒక్క జట్టు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో అన్ సోల్డ్ గా మిగిలిపోయింది.
అలా అర్హత సాధించిన వారి లో విశాఖ పట్నానికి చెందిన ఏడువాక హేమ రోషిని ఒకరు చిన్న ముశిలివాడ పెందుర్తి కి చెందిన రోషిణి తాను తన క్రికెట్ అంటే ఇష్టం పెరగటానికి కారణాలు న్యూస్ 18 వివరిస్తూ తాను NAD లో ని క్రికెట్ అకాడమీ లో తన తండ్రి తమ్ముడిని చేర్పిస్తే తాను తమ్ముడి అట చూడటానికి వెళ్లి క్రికెట్ పై మక్కువ పెచుకున్నానని NAD క్రికెట్ అకాడమీ లో ని కోచ్ నాగరాజు ప్రారంభ దశ లో తనకు క్రికెట్ లోని మెళుకువలు నేర్పారని నాగరాజు వద్ద కోచింగ్ లో తాను వికెట్ కీపర్ గా నైపుణ్యం సాధించి ఆంధ్ర తరుపున అండర్ 16 సెలెక్ట్ అయ్యానని తరువాత అండర్ 19 ఆడానని తనకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోని కోచ్ లు అందరు ఫిజికల్ గా మెంటల్ గా క్రిజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో మెళుకువలు నేర్పారని అందువల్లే తాను చాలెంజర్స్ ట్రాఫ్య్ కి కూడా సెలెక్ట్ అయ్యి ఆ టోర్నమెంట్ లో కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచానని తెలిపింది .
తన తండ్రి త్రినాధ్ రావు మరియు తల్లి విజయ తమ్ముడు ప్రవీణ్ తనకు ఎంతో సహకరించేవారని తాను అండర్ 19 ఖ్వాటర్ ఫైనల్ మ్యాచ్ లో లాస్ట్ వికెట్ తాను తీయటం వాళ్ళ మా టీం సెమి ఫైనల్స్ కి అర్హత సాధించిందని ఆ మ్యాచ్ తనకు ఎంతో ప్రత్యేకం అని తాను ఎప్పటికీనా ఇండియా మెయిన్ టీం లో ఆడాలన్నదే తన కల అని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Vishakaptnam, WPL 2023