హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

WPL 2023 : 16 ఏళ్లకే క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తోన్న వైజాగ్ చిన్నది.. భవిష్యత్తు ఎంతో ఉంది

WPL 2023 : 16 ఏళ్లకే క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తోన్న వైజాగ్ చిన్నది.. భవిష్యత్తు ఎంతో ఉంది

విన్నీ సుజన్

విన్నీ సుజన్

WPL 2023 : 16 ఏళ్ల విన్నీ సుజన్ ప్రస్తుతం అమ్మాయిల క్రికెట్ లో ఒక సెన్సేషన్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) వేలానికి సెలెక్ట్ అయింది. అయితే వేలంలో మాత్రమే ఆమెకు నిరాశే ఎదురైంది. కేవలం 90 స్థానాలు మాత్రమే ఉండటంతో విన్నీ సుజన్ లాంటి యువ ప్లేయర్ ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

 (DURGA ANAND MOHAN RAO PUDIPEDDI, News 18, Visakhapatnam)

WPL 2023 : విశాఖపట్నం (Visakhapatnam) అమ్మాయిల క్రికెట్ కు కేరాఫ్ అడ్రస్ గాా మారిపోయింది. స్నేహ దీప్తి (Sneha Deepthi), షబ్నం షకీల్ (Shabnam Shakeel), మహంతి శ్రీ (Mahanthi Sri) ఇలా ఎందరో క్రికెటర్లు క్రికెట్ లో అదరగొడుతున్నారు. తాజాగా వీరి జాబితాలో విన్నీ సుజన్ కూడా చేరింది. 16 ఏళ్ల విన్నీ సుజన్ ప్రస్తుతం అమ్మాయిల క్రికెట్ లో ఒక సెన్సేషన్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) వేలానికి సెలెక్ట్ అయింది. అయితే వేలంలో మాత్రమే ఆమెకు నిరాశే ఎదురైంది. కేవలం 90 స్థానాలు మాత్రమే ఉండటంతో విన్నీ సుజన్ లాంటి యువ ప్లేయర్ ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా తన క్రికెట్ కెరీర్ పై ఫోకస్ చేస్తే వచ్చే భవిష్యత్తులో విన్నీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తో పాటు టీమిండియా కు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.

రక్తంలోనే క్రికెట్

క్రికెట్ లో మునిగితేలిన కుటుంబం నుంచీ వచ్చింది. స్వతహాగా క్రికెట్ తన రక్తంలోనే ఉంది. తండ్రి ప్రోత్సాహం కూడా అంతే ఉంది. ఇంకేముంది. చిన్న వయసులోనే అద్భుతాలు సాధిస్తోంది. ఆడిన అన్ని మ్యాచ్ లలో బౌలర్ గా వికెట్లను తీసేస్తోంది. విశాఖకి చెందిన విన్నీ సుజన్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. రానున్న ఐపిఎల్ ఆక్షన్ తో తన పేరు కూడా ఉంది. ఆ స్థాయిలో తన ప్రతిభను కనపరుస్తోంది. బ్యాట్స్ ఉమెన్య కి చెమలు పట్టించే బౌలింగ్ ఈ క్రీడాకారిణి సొంతం. అవతలి వ్యక్తి బ్యాట్ పట్టుకుంటే ఇక ఎదురులేని ఇన్నింగ్స్ చూపిస్తుందని చెబుతారు కోచ్ లు.

విన్నీ సుజన్. అండర్ 19 క్రికెట్ లో తానేంటో నిరూపించుకుంది. 2007లో పుట్టిన ఈ యువ క్రికెటర్ అన్ని ఫార్మాట్లలోనూ టాప్ గా నిలుస్తోంది. మంచి బౌలర్ గా తన టేలెంట్ ను సెలక్టర్లకు ఇప్పటికే చూపించింది. జయకుమార్, సుభాషిణి తల్లిదండ్రులు. తండ్రి జయకుమార్ విశాఖ పోర్ట్ ట్రస్టులో ఉద్యోగి. అలాగే క్రికెటర్ కూడా. ఆల్ ఇండియా యూనివర్శిటీకి విజ్జి ట్రోఫికి ఆడారు. ఇక విన్ని సుజన్ సోదరుడు కూడా నిత్చల్ ఆనంద్. ఇలా క్రికెట్ కుటుంబం నుంచీ ఈ యువ క్రీడాకారిణి గ్రౌండ్ లో అడుగుపెట్టింది.

పదకొండేళ్లకే గ్రౌండ్ లో అడుగుడిన సుజన్.. మెల్లగా ప్రాక్టీస్ చేసింది. తనకి బౌలింగ్ పైనే మక్కువ ఎక్కువ. ఇది గమనించిన తండ్రి విశాఖలోని పలు కోచింగ్ సెంటర్లలో బౌలింగ్ లో ట్రైనింగ్ బాగా ఇప్పించి క్రికెట్ ఆడించారు. విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఎన్నో అంతర్ జిల్లాల మ్యాచ్ లు ఆడింది. తర్వాత ఫస్ట్ స్టేట్ టోర్నమెంట్ ఆడింది సుజన్. 2019లో పుదుచ్చెరీలో జరిగిన అండర్ 19 క్రికెట్ లో ఆడానని అదే తన మొదటి అద్భుత ఇన్నింగ్స్ అని చెబుతోంది.  తర్వాత సెకండ్ సీజన్ లో జరిగిన అండర్ 16 ఫార్మాట్ లో" ప్లేయర్ ఆఫ్ ద టార్నమెంట్" గా పేరు పొందింది. అది గొప్ప అచీవ్ మెంట్ అంటోంది సుజన్.

ఇక తర్వాత 2019- 20 అండర్ 19 తర్వాత ట్రోపీ ఆడింది. ఇందులో ఇండియా డీ టీం తరఫున ఆడింది. తర్వాత అక్కడ నుంచీ ఎన్సీఏ క్యాంప్ కర్నాటకలో జరిగింది. 2021లో మూడో మ్యాచ్ తనకి మంచి ఇన్నింగ్స్ అంటారు సుజన్. అండర్ 19 లో ఏడు మ్యాచ్లలో పన్నెండు వికెట్లు తీసి భేష్ అనిపించుకున్నారు. హైఎస్ట్ వికెట్ టేకర్ గా పదో స్థానంలో నిలిచారు. తర్వాత ఛాలెంజెర్స్ ట్రోపీ ఆడలేకపోయినా.. తన పట్టు ఏ మాత్రం విడువలేదు. ఇప్పుడు రేపటి ఆక్షన్ లో పేరు దక్కించుకున్నారు.

మొదటి నుంచీ ఇంట్లో వాళ్ల సపోర్ట్ తనకు ఉందని అంటారు సుజన్. అందులో చిన్న వయసైనా మంచి క్రికెట్ ఆడుతున్నానని చెబుతారు. అలాగే ఐపిఎల్ లో మంచి ప్రతిభ చూపించాలని ఉందని ఆమె అంటున్నారు. ఆమె కోరిక నెరవేరాని న్యూస్ 18 తెలుగు ఆకాంక్షిస్తోంది.

First published:

Tags: Smriti Mandhana, Visakhapatnam, Vizag, WPL 2023

ఉత్తమ కథలు