Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM WORLDS YOUNGEST SCUBA DIVER EMERGED IN VISAKHAPATNAM AS 10 YEARS OLD GIRL CREATE HISTORY FULL DETAILS HERE PRN VSP

Vizag News: ప్రపంచంలోనే యంగెస్ట్ స్కూబా డైవర్..? పదేళ్లకే సాగరంలో అద్భుతాలు..?

స్కూబా డైవింగ్ లో విశాఖ చిన్నారి రికార్డ్

స్కూబా డైవింగ్ లో విశాఖ చిన్నారి రికార్డ్

ప్రపంచంలోనే చిన్న వయసు స్కూబా డైవర్ (Scuba Diver) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉన్నారు. అదీ విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోనే.

    P Anand Mohan, News18, Visakhapatnam

    ప్రపంచంలోనే చిన్న వయసు స్కూబా డైవర్ (Scuba Diver) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉన్నారు. అదీ విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోనే. ఒడిశాకి చెందిన ఆ స్కూబా డైవర్ విశాఖకి చెందిన స్కూబా డైవింగ్ ట్రైనర్ బలరాం నాయుడు దగ్గర శిక్షణ పొందింది. చిన్న పిల్లే అయినా.. నలభై మీటర్ల లోతున డైవింగ్ చేయగలదు. అంటే సరాసరి ముప్పై అడుగుల లోతు వరకూ వెళ్లగలదు. అంతకు మించి కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయంట. విశాఖ కేంద్రంగా ఇటు తూర్పు గోదావరి (East Godavari), అటు శ్రీకాకుళం (Srikakulam) వరకూ ఉన్న బంగాళాఖాతం (Bay of Bengal) లో ఆమె విన్యాసాలు చేశారు. అలాగే సముద్ర జీవనాన్ని.. జీవుల్ని పలకరించింది.

    సాగరతీరం అందాలకే కాదు. అంతులేని అగాధాలకు నెలవు. అనంతమైన సాగరంలో ఎన్నో విశేషాలు ఉంటాయి. ఆ విశేషాలు ఒక్కరోజులో తెలిసేవికావు. వాటిని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగమే స్కూబా డైవింగ్. ఈ ప్రక్రియ ద్వారా సముద్రంలో ఉండే అనంతమైన జీవరాశుల్ని గుర్తించి.. వాటి మనుగడపై పరిశోధనల్ని కూడా చేస్తున్నారు. విశాఖకు చెందిన పి. బలరామ్ నాయుడు స్కూబా డైవింగ్ చేయడంతో పాటు.. చిన్నారులకు.. ఔత్సాహికులకు స్కూబా డైవింగ్ నేర్పిస్తారు. సముద్రంలోకి డైవ్ చేయడానికి మంచి శిక్షణ ఇస్తారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఇక ఆ కోవలోకే ఈ చిన్నారి డెబాప్రియ సహా కూడా చెందుతుంది.

    ఇది చదవండి: ఏపీలో ఫోర్త్ వేవ్ వచ్చేసిందా..? ఆ జిల్లాలో పదులకొద్దీ కేసులు..! కారణం ఇదేనా..?


    డెబా ప్రియ సహాకి ఇప్పుడు సరిగ్గా పదేళ్లు. రెండేళ్ల క్రితం ఆమె స్కూబా డైవింగ్ శిక్షణ తీసుకుంది. మెరైన్ లైఫ్ ను చూడటానికి ఉన్న ఆసక్తితో ఈ చిన్నారి ఇందులో శిక్షణ పొందింది. తండ్రి రిటైర్ట్ నేవీ అధికారి కావడంతో ఆమె ఆసక్తికి మరింత ప్రోత్సాహం లభించింది. దీంతో సముద్రంలో డైవ్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంది. ఏడాది పాటు తాను ఈ ట్రైనింగ్ తీసుకున్నానని డెబా ప్రియ న్యూస్ 18తో చెప్పింది. తనకు సముద్రమంటే చాలా ఇష్టమని అంటోంది.



    ఇప్పటికే వందలసార్లు సముద్రపు అడుగుకు వెళ్లానని అంటోంది. సాగరం ఎంతో అద్భుతంగా ఉంటుంది.. వెళ్లే కొద్దీ ఎన్నో అందాలు పలకరిస్తాయని చిన్ని చిన్న మాటల్తో చెబుతోంది. జూన్ 30న తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్న డెబా ప్రియ స్కూబాలో మరింత లోతున డైవ్ చేయాలని ఆసక్తి చూపిస్తోంది. నలభై మీటర్ల లోతు వరకూ డెబా ప్రియ మరింత లోతు డైవింగ్ చేయడానికి అనుమతులు లేవు. పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనల ప్రకారం శ్వాసకోశాల పనితీరు ఆధారంగా డైవింగ్ కి అనుమతిస్తారు. వైద్యుల పర్యవేక్షణలో పదేళ్ల వయసు తర్వాత స్కూబాకి అనుమతి తీసుకుంటామని ట్రైనర్ బలరామ్ నాయుడు అన్నారు. అలాగే చిన్నారి డైవింగ్ చేయడానికి ప్రస్తుతం ఉన్నపరిస్ధితిలు అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. అలాగే మరికొద్ది రోజుల తర్వాత చిన్నారి పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. విశాఖ జిల్లా కలెక్టర్ ను కూడా ఇదే విషయమై కలిసి.. డెబా ప్రియ సాధించిన విజయాల గురించి వివరించారు. కలెక్టర్ ఆమెను ప్రశంసించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు