S jagadesh, visakhaptnam, News 18
Wonder Kid: పిట్ట కొంచెం... కూత ఘనం సామెతకు సరిగ్గా సరిపోతాడు ఈ బాలుడు.. ఈ రోజుల్లో పిల్లలంతా కేవలం చదువుపైనే కాక.. ఇతర విషయాల్లోనూ అద్బుతాలు చేస్తుంటారు.. వండర్ కిడ్స్ (Wonder Kids) అనిపించుకునేవారు ఎందరో ఉన్నారు. ఏమీ తెలియని వయసులోనూ సెలబ్రిటీలు (Celebrities)గా మారిపోతున్న చాలామంది చిన్నారులను చూస్తున్నాం.. అయితే ఇలా పిల్లలు (Kids) చాలామందిలో ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ (Talented Kids) ఉంటుంది. అతి చిన్న వయసులోనూ అద్భుతాలు చేసేస్తుంటారు. ఒకరు లెక్కల్లో తొక్క తీస్తారు. మరికొందరు పరీక్షల్లో వాట్ ఏ టాలెంట్ అనిపించేలా చేస్తారు. మరికొందరు ఆటల్లో అదరగొడతారు. ఇంకొందరైతే పాటలు, డ్యాన్సులు ఇరగదీస్తారు. ఇలా ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. అలాంటి పిల్లలను చూస్తే అబ్బా ఏం టాలెంట్ అని అనుకుండా ఉండలేం.. ఆ పిల్లలందరికీ ఇతడు చాలా భిన్నం.. ఇంత చిన్న వయసులోనే అత్యంత సహాసం చేస్తున్నాడు. ఔరా అనిపించుకుంటున్నాడు. స్కూల్ కు వెళ్లి.. పెన్ను, పుస్తకం పట్టుకోక ముందే.. గుర్రపు నాడా పట్టుకున్నాడు. కేవలం పట్టుకుని ఫోజులు ఇవ్వడమే కాదు.. ఛల్ ఛల్ అంటూ గుర్రాన్ని పరుగులు పెట్టేస్తున్నాడు. ఆ గుర్రం స్పీడ్ ను అతడు కూడా అందుకుంటూ.. స్వారీ తో సూపర్ అనిపించుకుంటున్నాడు.
ఉమ్మడి విశాఖ (Visakha) నుంచి కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా (Anakapalli District) ఎస్.రాయవరం (S Rayavaram) మండలం తిమ్మాపురం (Timmapuram) గ్రామానానికి చెందిన చెవ్వేటీ నాగేంద్ర (Nagendra), సాయి తేజస్వనీ (Sai Tejswani) ల కొడుకే చెవ్వేటి జోషిత్ (Josith) ఛత్రపతి. నాగేంద్ర విద్యార్ధులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, తదితర వాటిలోతర్ఫీదు ఇచ్చే శ్రీవేదడిఫెన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ను నడుపుతున్నారు. అయితే చిన్నప్పటి నుంచి జోషిత్ కు మగధీర సినిమా పెడితే తప్ప అన్నం తినేవాడుకాదు. నిద్రపోతున్నా, ఆడుకుంటున్నా, తింటున్నా.. ఎప్పుడైనాసరే మగధీర సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ప్లే కావాల్సిందే.
ఇదీ చదవండి : ఈయన గోల్డ్ హే.. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న బాబు బంగారం.. అమ్మ మాటే ఇలా మార్చేసిందా?
ఒకరోజు తల్లి దండ్రులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ గుర్రం చూసి ఆసక్తితో దానిపైకి ఎక్కాడు. అప్పటి నుంచి ఎప్పుడు బీచ్ కు వెళ్లినా.. గుర్రం ఎక్కుతానని మారాం చేస్తూ.. తరువాత వారిని ఒప్పించి గుర్రపు స్వారీ చేసేవాడు. కొడుకు ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు.. రోజూ బీచ్ కు తీసుకెళ్లి .. గుర్రంపై స్వారీ చేయించేవారు. సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నా.. గుర్రపు స్వారీ అన్నా తనకు ఎంతో ఇష్టం అంటున్నాడు జోషిత్. మగధీర సినిమాలో రామచరణ్ గుర్రపు స్వారీ చూసే తనకు నేర్చుకోవాలని అనిపించిందంటున్నాడు.
జోషిత్ ఆసక్తితో ఏడాది నుంచి రోజు తర్ఫీదు ఇప్పిస్తున్నారు. తనకున్నఇంటరెస్ట్, పట్టుదలతో కేవలం సంవత్సరంలోనే స్వారీలో చిన్నారి ఆరితేరాడు. ఇంతచిన్నవయసులోనే తను అనుకున్నది సాధించేందుకు శ్రమిస్తున్నాడు. జోషిత్ అతిచిన్నవయస్సులోనే గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో హార్స్ రైడింగ్ చేస్తూ.. అందరి చూపు తనపై పడేలా చేస్తున్నాడు.
ఇదీ చదవండి : చంద్రబాబుకు సిక్కోలు సెంటిమెంట్.. రేపటి నుంచి జనం బాట.. జిల్లాల పర్యటన వ్యూహం అదేనా?
జోషిత్ రైడింగ్ చేసటప్పుడు రెండు కళ్లు సరిపోవట్లేదంటున్నారు చూసేవాళ్లు. రైడింగ్ చేసేటప్పుడు భయపడకుండా ఉండడం అతని ధైర్యానికి నిదర్శనం. ప్రస్తుతం శ్రీ ఆదర్శ స్కూల్లో ఎల్.కె.జి. చదువుతున్నాడు ఈ బుడతడు. జోషిత్ ప్రతిభపై తల్లిదండ్రులు చాలా ఆనందంవ్యక్తం చేస్తున్నారు. ఇంతచిన్నతనంలో చక్కగా గుర్రపు స్వారీ చేస్తుంటే మురిసిపోతున్నారు. జోషిత్ ఉన్నత స్థాయికి వెళ్ళేవిధంగా ప్రోత్సాహం అందిస్తామని చిన్నారి తల్లిదండ్రులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Horse, Mega power star ram charan, Star kids, Vizag