హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tiger and Bear: ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయం భయం.. నిద్ర పోవాలంటే వణికిపోతున్న ఉత్తరాంధ్ర ప్రజలు

Tiger and Bear: ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయం భయం.. నిద్ర పోవాలంటే వణికిపోతున్న ఉత్తరాంధ్ర ప్రజలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Tiger and Bear: ఉత్రరాంధ్ర ప్రజలను మరో భయం ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. అరణ్యాల్లో ఉండాల్సిన వన్య మృగాలు వణికిస్తున్నాయి. జనావాసాల్లో కనిపించి అలజడి సృష్టిస్తున్నాయి. ఉత్తరాంధ్ర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

P Anand Mohan, Visakhapatnam, News18

Tiger and Bear:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను  వన్యమృగాలు వణికిస్తున్నాయి.. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పెద్ద పులి.. కాకినాడ (Kakinada), అనకాపల్లి జిల్లా (Anakapalli District) ల్లో అలజడి సృష్టిస్తోంది. తరువాత ప్రకాశం జిల్లా (Prakasham District) లో పులి దాడులు కొనసాగుతున్నాయి. ఇలా ఎక్కడో ఒక చోట  పశువులపై దాడి చేస్తోంది. అక్కడక్కడ మనుషులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో  పులి పేరు చెబితనే జనం భయపడాల్సి వస్తోంది. ఆ భయం వీడక ముందే.. ఇప్పుడు ఎలుగు జనాల్ని పరుగులు పెట్టించేలా చేస్తోంది. ఈ మధ్య కాలంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎలుగుబంటి దాడులు నిత్యం జరుగుతుండడంతో కలవర పెడుతోంది.

అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లో కనిపించి అలజడి సృష్టిస్తున్నాయి. ఉత్తరాంధ్ర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదేపదే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఏజెన్సీలో ఎలుగుబంట్లు, పులులు, చిరుత సంచారం కలకలం రేపుతుంది. వరుసగా వన్యప్రాణులు.. ఇటు పశువులపైనా.. అటు మనుషఉలపై దాడులు చేస్తుండడంతో ఉత్తరాంధ్రవాసులు హడలిపోతున్నారు.

విజయనగరం జిల్లాలో పెద్దపులి టెన్షన్ కొనసాగుతోంది. నెలరోజుల క్రితం కంగారు పెట్టిన టైగర్‌.. మరోసారి పంజా విసిరింది. మెంటాడ మండలం బిరసారడవలస సమీపంలో గొర్రెల మందపై బెబ్బులి దాడి చేసింది. ఈ దాడిలో ఒక గొర్రె మృతి చెందగా, మరో మూడు గొర్రెలకు గాయాలయ్యాయి. దీంతో మరో రెండు గొర్రెలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో ఫారెస్టు సిబ్బంది.. టైగర్‌ కోసం సెర్చింగ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి : సమస్యల్లో ఉన్నారా? ఒక్కసారి సంపత్ వినాయకుడ్ని దర్శించుకోండి..? ఎక్కడో తెలుసా?

అటు శ్రీకాకుళంజిల్లాలో ఎలుగుబంట్లు ఏకంగా గ్రామల్లోనే తిష్టవేస్తున్నాయి. రెండు రోజుల క్రితం వజ్రపుకొత్తూరు మండలం చినవ౦కలో ఓ తల్లి ఎలుగుబంటి.. రెండు పిల్లలతో స్వైరవిహార౦ చేసింది. దాంతో గ్రామస్తులు హడలిపోయారు. నెలరోజుల క్రితం ఇదే మండలంలో ఎలుగుబంటి దాడిలో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన మరువకముందే మళ్లీ భల్లూకాల సంచరిస్తుండంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: పవన్ తో మాజీ మంత్రి టచ్ లో ఉన్నారా? జనసేనల చేరాలి అనుకుంటున్నారా? ఆయనేమన్నారంటే?

కేవలం పులులు.. ఎలుగు బంట్లే కాదు.. ఏనుగులు సైతం నిత్యం మూడు జిల్లాల వారిని భయపెడుతూనే ఉన్నాయి. ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఈ గజరాజుల హల్ చల్ ఎక్కువగా ఉంటుంది. అదికూడా బాగా పంటలు వచ్చాయి అని.. అన్నదాతలు సంబరాల్లో ఉన్నసమయంలో ఒక్కసారిగా గజాల మంద దాడి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో భామిని మండలంలో ఏనుగుల సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘనసర, కొసలి, తాలాడ గ్రామాల్లో ఏనుగులు తీష్ట వేశాయి. ఎప్పుడు జనంపైకి దూసుకు వస్తాయోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అటవీ శాఖ అదికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి ఏడాది వీటి బెడద పలు ప్రాంతాల ప్రజలకు తప్పడం లేదు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Srikakulam, Tiger Attack, Vizag, Vizianagaram

ఉత్తమ కథలు