Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM WILD ANIMALS TENSION IN UTTARANDHRA LOST SIX MONTHS NO SLEEP IN THREE DISTRICTS NGS VSP

Wild Animals: ఆ జిల్లాలను భయపెడుతున్న జంతువులు.. బయ టకు వెళ్లాలంటే గజ గజ వణుకే.. ఎందుకు?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Wild Animal: ఆ ఉమ్మడి జిల్లాల ప్రజలు ప్రాణాల అరచేత పట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటునుంచి ఏ జంతువు వస్తుందో తెలియక భయం భయంగా గడుపుతున్నారు. దీంతో ఆ జిల్లాల్లో స్థానికులు చీకటి పడ్డాక బయటకు వెళ్లాలి అంటే టెన్షన్ పడుతున్నారు. ఒకటి రెండు రోజులు కాదు.. కొన్నేళ్ల నుంచి జంతువుల భయం వెంటాడుతూనే ఉంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18. Wild Animal: ఉత్తరాంధ్ర జిల్లా (Uttarandhra Districts) ల ప్రజలను మరో భయం వెంటాడుతోంది. మొదట ఏనుగుల గుంపు భయపెట్టేవి.  గత నెల రోజుల నుంచి పులి (Tiger) సంచరిస్తూ ప్రజలను నిద్ర పోనివ్వడం లేదు. వీటికి తోడు ఎలుగు (Bears) సైతం టెర్రర్ పెట్టేలా చేస్తోంది. విజయనగరం జిల్లా దాటి ఉమ్మడి జిల్లాగా కొనసాగిన పార్వతీపురం (Parvatipuram) మన్యం వైపు వెళ్లింది. అయితే మన్యం జిల్లా వాసులు ఇంతవరకు ఏనుగుల బెడదతోనే సతమతమయ్యేవారు. గిరిజన గ్రామంలో రెండు ఆవులను పులి హత మార్చడంతో సాలూరు, మక్కువ ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. దీంతో ఇప్పుడు పులి భయం మొదలైంది. తాజాగా బొబ్బిలి మండలం మెట్టవలస క్వారీ దగ్గర పులి సంచరిస్తుండగా స్వయంగా చూశామని తాజాగా అక్కడి కార్మికులే చెప్పడంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ కేంద్రానికి కూతవేటు దూరంలోకి పులి వచ్చినట్లయింది. కొత్తవలస, ఎస్‌.కోట, మెంటాడ, దత్తిరాజేరు, మెరకముడిదాం మండలం పులుగుమ్మి, తెర్లాం లింగాపురం, బలిజిపేట మండలం వంతరాం, బొండపల్లి మండలాల సమీపాల్లో పులుల సంచారం ఇప్పటికే కొనసాగింది. వివిధ ప్రాంతాల్లో పులి తిరిగినట్లు ఆనవాళ్లు కన్పిస్తున్న కారణంగా అది ఒక పులి కాదని రెండు పులులుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ ఘటనలతో ఏ క్షణంలో ఎక్కడ పులి ఎదురుపడుతుందో అన్న టెన్షన్‌లో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఇంతవరకు మనుషులకు ప్రాణాపాయం కలగలేదు. ఆవులు, గొర్రెలపై దాడులు చేస్తూ నష్టాన్ని కలిగిస్తోంది. ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రుల శొభ.. ఏ రోజు ఏ అవతారం.. అమ్మవారికి ఇష్టమైన రంగులు ఇవే.. ఫలితాలు ఏంటి? ముఖ్యంగా పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలూ ఫలించడం లేదు. పగలంతా ఎక్కడ తిరుగుతుందో తెలియదు.. కానీ రాత్రికి రాత్రి 50 కిలోమీటర్లు పైబడి ప్రయాణిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. అందుకే అటవీ శాఖ అధికారులు మాటు వేసినా ఫలితం ఉండటం లేదు. ఏదైనా పశువును చంపి రెండు మూడు రోజుల పాటు ఆహారంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించి మాటు వేస్తున్నారు. ఇందులో భాగంగా బొండపల్లి మండలంలో ఇటీవల బోను కూడా సిద్ధం చేశారు. అది వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో నిరాశే మిగిలింది. గొర్రెలు, ఆవులపై దాడి చేస్తున్న సందర్భాల్లో ఒక్కోసారి పులి మనుషుల కంటపడుతున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి : సీఎం జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకు ఆహ్వానం..! ఆపరేషన్ 175కి రేపు తొలి అడుగు ఉమ్మడి జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరుతో పాటు కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన పాలకొండ నియోజకవర్గాల్లో ఏనుగులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టాం మండలాలతో పాటు జియ్యమ్మవలస, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పార్వతీపురం మండలాల్లో ఏనుగులు దశాబ్దాన్నర కాలంగా స్వైరవిహారం చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటున్నారా..? 5 వేలు నుంచి మొదలు.. ఆ నెంబర్ మాత్రం 2 లక్షలు పొలానికి వెళితే ఏ క్షణాన ఏనుగులు దాడి చేస్తాయో అన్న భయం గిరిజనులకు పట్టుకుంది. ఆరు ఏనుగుల గుంపు రోజుకో మండలంలో దర్శనమిస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడే సంతానోత్పత్తి కూడా చేస్తున్నాయి. కొమరాడ మండలం దుగ్గి సమీపంలో ఏడాది క్రితం ఏనుగు ప్రసవించింది. ఇదీ చదవండి: కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ .. మరి మాజీ మంత్రి స్పందిస్తారా..? కేవలం పులి, ఏనుగే కాదు.. ఉత్తరాంధ్ర జిల్లాల వాసులను ఎలుగులు కూడా భయపెడుతున్నాయి. ఇటీవల ఎలుగు దాడిలో మనుషులు కూడా గాయపడుతుండడం కలవర పెడుతోంది. ఇలా ఒకే టైంలో ఇటు పులి, అటు ఏనుగుల గుంపు.. మరోవైపు ఎలుగు సంచరిస్తున్నాయి. దీంతో ఏ జంతువు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియక అందోళన చెందుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizianagaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు