హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Woman: ఈమె పేరు మృదుల.. పేరులో ఉన్నంత సాఫ్ట్ కాదు..! ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా..

Vizag Woman: ఈమె పేరు మృదుల.. పేరులో ఉన్నంత సాఫ్ట్ కాదు..! ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా..

భర్త మురళీతో మృదుల (ఫైల్)

భర్త మురళీతో మృదుల (ఫైల్)

Vizag News: ఈ రోజుల్లో తాళికట్టిన బంధం కంటే.. తాత్కాలిక సుఖాలనిచ్చే బంధాల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. భర్తకు మంచి ఉద్యోగం, సంపాదన, అందమైన జీవితం ఉన్న ఓ మహిళ.. పక్కదారి పట్టింది. చక్కగా చూసుకునే భర్త వద్దని ప్రియుడుతోనే ఉండాలని భావించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam

P Anand Mohan, News18,Visakhapatnam

ఈ రోజుల్లో తాళికట్టిన బంధం కంటే.. తాత్కాలిక సుఖాలనిచ్చే బంధాల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. భర్తకు మంచి ఉద్యోగం, సంపాదన, అందమైన జీవితం ఉన్న ఓ మహిళ.. పక్కదారి పట్టింది. చక్కగా చూసుకునే భర్త వద్దని ప్రియుడుతోనే ఉండాలని భావించింది. అతడితో కలిసి ఏడడుగులు వేసిన వాడిని తిరిగిరాని లోకాలకు పంపేసింది. తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ డ్రామా అడి అడ్డంగా బుక్కైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విశాఖపపట్నం (Visakhapatnam) మధురవాడ పోలీస్ స్టేషన్ లో బడమూరు మృదుల అనే మహిళ తన భర్త మురళీ కనిపించడం లేదంటూ ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు.

ఈ క్రమంలో మారిక వలస హైవే వద్ద బ్రిడ్జి కింద కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. దీంతో ఇటీవల మిస్సింగ్ కేసులను ఆరా తీయగా.. మురళీ మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. భర్త కనిపించడం లేదంటూ కేసు పెట్టిన భార్యే అతడ్ని ప్రియుడితో కలిసి అంతమొందిచినట్లు నిర్ధారించారు.

ఇది చదవండి: ప్రియుడుతో కలిసి భర్త హత్య.., కొడుకుతో కలిసి స్కెచ్.. చివరికి అడ్డంగా దొరికిపోయింది..


విశాఖలోని మధురవాడ రిక్షాకాలనీకి చెందిన బుడుమూరు మురళి (43), మృదుల (29) భార్యాభర్తలు. మురళీ ఈస్ట్ ఆఫ్రికాలోని ఇరిట్రియా ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గత ఎనిమిది ఏళ్లుగా ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 9న బుడుమూరు మురళి ఆఫ్రికా నుండి విశాఖ చేరుకుని రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. 11వ తేదీన శ్రీకాకుళం జిల్లా పిల్లలవలసలోని తన తల్లిని కలవడానికి బయలుదేరాడు. దీంతో తాను మృదుల అతడ్ని కొమ్మాదిలో ఎస్.టి.బి.ఎల్. థియేటర్ దగ్గర దింపింది. కొద్దిసేపటి తర్వాత తన భర్త స్నేహితులు రాగా వారితో వెళ్లినట్లు వివరించింది.

ఇది చదవండి: ప్రియుడు పోలీస్ అని భర్తకు విడాకులిచ్చింది.. కట్ చేస్తే కథ అడ్డం తిరిగింది


ఐతే పోలీసుల దర్యాప్తులో మాత్రం మృదులకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మృదుల.. బైక్ పైనే మృతదేహాన్ని తీసుకెళ్లి మారికవలస బ్రిడ్జి కింద పడేసింది. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ను కూడా సేకరించారు. కేసులో మృదులతో పాటు ఆమె ప్రియుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించి ఇద్దరూ కలిసి మురళిని హత్య చేసినట్లు నిర్ధారించారు.

ఇటీవల విజయనగరం జిల్లా గంట్యాడలో ఇలాంటి ఘటనే జరిగింది. తులసి అనే మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. ఆ విషయం తెలుసుకున్న భర్త రాముని ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేయగా పోలీసులు హత్య కేసుగా తేల్చారు.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Visakhapatnam

ఉత్తమ కథలు