VISAKHAPATNAM WIFE CAUGHT HER HUSBAND WITH LOVER AND ATTACKED THEM IN VIZIANAGARAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VZM
Extramarital Affair: ప్రియురాలితో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..
విజయనగరం జిల్లాలో భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళను చితకబాదిన భార్య
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram District) సాలూరు పట్టణం చిన్న హరిజన పేట లో నివాసం ఉండే సింగారపు తౌడు అనే వ్యక్తి విద్యా శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితం జయంతితో పెళ్లైంది వారికి పిల్లలు కూడా ఉన్నారు. కానీ తౌడు వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు.
అతడో ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లైంది. భార్య, పిల్లలు మంచి కుటుంబం ఉంది. కుటుంబానికి, కట్టుకున్నదానికి విలువఇవ్వాల్సిన వాడు దారితప్పాడు. ప్రియురాలి మోజులో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. అతడి ఆగడాలను చాలా రోజుల పాటు భరించిన భార్య.. ఇక తట్టుకోలేకపోయింది. ప్రియురాలితో రాసలీలల్లో మునిగితేలుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అక్కడితో ఆగలేదు. భర్తను వలలో వేసుకున్న మహిళను జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లి మరి చితకబాదింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram District) సాలూరు పట్టణం చిన్న హరిజన పేట లో నివాసం ఉండే సింగారపు తౌడు అనే వ్యక్తి విద్యా శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితం జయంతితో పెళ్లైంది వారికి పిల్లలు కూడా ఉన్నారు.
గత కొంత కాలంగా ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న తౌడు. అవకాశం దొరికితే చాలు.. ఆమెతో సరసాల్లో మునిగి తేలుతున్నాడు. పూర్తిగా ప్రియురాలి మోజులో పడిపోయిన తౌడు.. తన భార్య, పిల్లలు సహా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. భర్త చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక పోయిన భార్య జయంతి.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకోవాలని డిసైడ్ అయింది.
తన బంధువులతో కలిసి భర్తపై నిఘా ఉంచిన జయంతి.. పాచిపెంట సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో.. తన ప్రియురాలితో సరసాలాడుతున్నట్లు తెలుసుకుంది. ముందుగానే సాలూరు వన్ టౌన్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. పోలీసులు, బంధువులను వెంటబెట్టుకొని భర్త తన ప్రియురాలితో ఉన్న స్పాట్ కు వెళ్లింది. అప్పటికే వారి రాకను గమనించిన తౌడు.. అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ అతడితో ఎఫైర్ పెట్టుకున్న మహిళ మాత్రం దొరికిపోయింది. ఆమెను చూడగానే కోపంతో ఊగిపోయిన జయంతి.. జుట్టుపట్టుకొని దేహశుద్ధి చేసింది. తన కాపురాన్నిఎ ఎందుకు నాశనం చేస్తున్నావంటూచితకబాదింది. ఆ తర్వాత భర్తతో పాటు అతడి ప్రియురాలిని స్థాని సచివాలయం వద్దకు తీసుకెళ్లి పంచాయతీ పెట్టింది. స్థానిక పెద్దలు తౌడికి నచ్చజెప్పి హెచ్చరించి పంపేశారు. ఐతే పోలీసులు మాత్రం కేసు నమోదుచేశారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ.. ఓ ఎస్సైతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త డ్యూటీకి వెళ్లిన వెంటనే అతడితో రాసలీలల్లో మునిగితేలుస్తోంది. అనుమానం వచ్చిన మహిళ భర్త.. క్యాంపుకు వెళ్తున్నట్లు అబద్ధం చెప్పి సమీపంలోని ఇంట్లో మకాం వేశాడు. ఎస్సై తన ఇంట్లోకి వెళ్లిన తర్వాత బంధువులతో కలిసి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అనంతరం ఎస్సైకి, తన భార్యకు దేహశుద్ధి చేశాడు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సదరు ఎస్సైని సస్పెండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.