హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కన్నీరు పెట్టిస్తున్న భార్యాభర్తల సెల్ఫీ వీడియో..

కన్నీరు పెట్టిస్తున్న భార్యాభర్తల సెల్ఫీ వీడియో..

X
విశాఖలో

విశాఖలో భార్యాభర్తల ఆత్మహత్య

జీవితం అన్నాక ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. కొన్ని సమస్యలు త్వరగానే పరిష్కారం అవుతాయి. కాని మరికొన్ని సమస్యలు మనిషిని కుంగదీస్తాయి. అలాంటి సమస్యలను అధిగమించలేక పలువురు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి భార్యాభర్తల కథే ఇది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

జీవితం అన్నాక ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. కొన్ని సమస్యలు త్వరగానే పరిష్కారం అవుతాయి. కాని మరికొన్ని సమస్యలు మనిషిని కుంగదీస్తాయి. అలాంటి సమస్యలను అధిగమించలేక పలువురు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి భార్యాభర్తల కథే ఇది. కలిసి ఏడడుగులు వేసిన భార్యాభర్తలు.. కాటికి సైతం కలిసే అడుగులు వేశారు. ఐతే వెళ్లిపోయే ముందు తమ బాధను సెల్ఫీ వీడియో రూపంలో చెప్పుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా గాజువాక లో వడ్లపూడి తిరుమల నగర్ కి చెందిన బార్యభర్తలు చిత్రాడ వరప్రసాద్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, భార్య మీరా ఇంటి దగ్గరే ఉంటుంది. వారికి ఒ కుమారుడు కృష్ణ సాయి తేజ ఉన్నారు.

ఐతే తాము ఆత్మహత్య చేసుకుంటన్నట్లు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపారు. ఆ తర్వాత బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న వారి కుమారుడు సాయి తేజ వెంటనే దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా దంపతుల కోసం గాలింపు ప్రారంభించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు దంపతులు సెల్ఫీ వీడియోలో చెప్పుకున్నారు.

ఇది చదవండి: ఏపీలోకి కర్ణాటక సరుకు.. ఆ కేటుగాళ్లు వీళ్లే..! ఎస్సై కారులోనే స్మగ్లింగ్

పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు