Bay of Bengal: ఎక్కడైనా సాధారణంగా సముద్రాలు నీలి రంగులోనే (Sea Water in Blue Color) ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు.. కానీ మన దగ్గర ఉండే.. ఒక్క బంగాళా ఖాతం (Bay of Bengal) మాత్రం అందుకు భిన్నం.. ఎందుకంటే బంగాళాఖాతం.. మన దగ్గర ఉండే బావులు, చెరువులు, నదుల రంగులో ఉంటుంది. అయితే ఉన్నట్టుండి.. మన సముద్రం ఒక్కసారిగా నీలిరంగులోకి మారింది. దీంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య సముద్ర తీరం మొత్తం నల్లగా (Vizag Beach in Black Color ) మారింది. ఎందుకు ఇలా మారింది అన్నదానిపై పూర్తి అవగాహన రాకముందే.. ఇప్పుడు ఇలా ఓ చోట సముద్రం నీలి రంగులా మారింది..? మరి ఈ నీలం రుంగు మార్పు వెనక కారణాలేమై ఉన్నాయా..? తరుచూ ఇలా సముద్రం రంగులు ఎందుకు మారుస్తోంది. విశాఖ తీరం (Vizag Beach) లో జోరుగా వినిపిస్తోన్న ప్రశ్న. ఎందుకంటే మహా సముద్రాలు నీలిరంగులో ఉండటానికి ప్రధాన కారణం.. ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి అన్న సిద్ధాంతం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆకాశపు రంగు నీటిపై ప్రతిబింబించడం వల్లే ఇలా జరుగుతుందన్న మాట వింటూనే ఉంటాం. కానీ ఇదొక్కటే కారణం కాదంటారు శాస్త్రజ్జులు. నీటి అణువులు కాంతి కిరణాలను గ్రహించి వెదజల్లడం వల్లే సముద్రం నీలి రంగులో కనిపిస్తుందన్న విశ్లేషణలున్నాయి.
చెరువులు, బావులు, నదులలోని నీటిని చూస్తే సాధారణంగానే కనిపిస్తాయి. అదే సముద్రం నీళ్లు మాత్రం నీలంగా ఉంటాయి కదా..! మరి అవి అలా ఎందుకు ఉంటున్నాయో మీకెప్పుడయినా సందేహం వచ్చిందా...?! సముద్రం నీరు ఎప్పుడూ నీలం రంగులోనే ఉండేందుకు గల కారణం.. ఆకాశం రంగు నీటిపై ప్రతిబింబిచడం వల్లనే అని అనుకుంటున్నారా..? అలా అనుకోవటం తప్పు. అయితే మన బంగాళాఖాతంలో రంగు సాధారణంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు నీలిరంగుగా మారడానికి కారణం ఏంటంటే..?
Why Sea Water is Blue in Color|| విశాఖలో సముద్రం ఎందుకు రంగులు మారుస్తోం... https://t.co/ep7RoDgEaz via @YouTube #BeachTits #beachlife #beachday #BEACHBOYS #beachvibes #Visakhapatnam
— nagesh paina (@PainaNagesh) September 4, 2022
నీటి అణువులు కాంతి కిరణాలను గ్రహించి వెదజల్లటం వల్లనే సముద్రం నీలిరంగులో కనిపిస్తుంటుంది. అంటే.. సూర్యుడి కాంతి భిన్న తరంగ దైర్ఘ్యాలు కలిగిన కాంతి తరంగాలతో నిర్మాణమై ఉంటుంది. ఈ తరంగాలు ఒక్కో తరంగ దైర్ఘ్యం వద్ద ఒక్కో రంగును సూచిస్తుంటాయి. నీలం రంగు తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని, ఎరుపురంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి.
సాధారణంగా దూరం నుంచి చూసినప్పుడు ఏ సముద్రమైన నీలి రంగులోనే కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే ఆ రంగులో ఉండదు. దీనికి కారణం కూడా సూర్య కిరణాలే అంటున్నారు శాస్త్రజ్ఞులు. పగటి పూట సూర్యకిరణాలు నీటిపై పడ్డప్పుడు.. నీరు కాంతి నుంచి వెలువడే ఇతర రంగుల కిరణాలను గ్రహిస్తుంది. అవి నీలి కిరణాలుగా ప్రతిఫలిస్తాయి. ఈ కారణంగా సముద్రం నీలం రంగులో కనిపిస్తుంది అంతేనంటున్నారు నిపుణులు.
ఇదీ చదవండి : వేలు పెట్టుబడి పెడితే.. లక్షల్లో ఆదాయం.. ఈ దిశలో నాటితే.. ఎవరికైనా డబ్బే డబ్బు
వాతావారణంలో వాయు, ద్రవ, ఘన స్థితులలో ఉండే వివిధ పదార్థాలు భూమిని చేరే సూర్యుడి కాంతిని గ్రహిస్తాయి. ఈ పదార్థాలన్నీ చాలా చిన్న పరిమాణంలో రేణువులుగా ఉండటంవల్ల తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని అంటే నీలం రంగు కాంతిని గ్రహించి వెదజల్లుతాయి. కాబట్టే ఆకాశం మనకు నీలంగా కనిపిస్తుంటుంది. నీలం–ఆకుపచ్చ, ఆకుపచ్చ లేదా పసుపు నుంచి గోధుమ రంగులోనూ కనిపిస్తూ ఉంటుంది. సముద్రం రంగు నీలంలో ఉండటానికి కారణాలు అనేకం ఉన్నాయి అంటున్నారు. నీరు ఎరుపు కాంతిని తక్కువగా గ్రహిస్తుంది. ఎరుపు రంగు 164 అడుగుల లోతుకు మాత్రమే చేరుకుంటుంది. అదే నీలం 655 అడుగుల వరకూ చొచ్చుకుపోతుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.
సాధారణంగా వాతావరణంలో చిన్న చిన్న ధూళి కణాలు, మట్టి కణాలు ఉంటాయి. సూర్య కణాలు వీటిపై పడ్డప్పుడు అవి ఏడు రంగులుగా విడిపోతాయి. ఏడు రంగుల్లో వైలెట్ ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉంటాయి. నీలి రంగు అతి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. అదే సమయంలో ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. సూర్యుడి కాంతి సముద్రాన్ని తాకగానే చిన్నగా ఉన్న సముద్రజల రేణువులు కూడా అతి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలం రంగునే గ్రహించి వెదజల్లుతాయి. కాబట్టి సముద్రం నీలంగానే కనిపిస్తుంటుంది. అంతేగానీ ఆకాశం రంగు నీటిపై ప్రతిఫలించి మాత్రం కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag