Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM WHY THESE MPS ARE NOT SEEN IN PUBLIC AS THE PERMITTED TO THEIR OWN BUSINESS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

AP Politics: నాలుగు జిల్లాలు.. ఎనిమిది మంది ఎంపీలు.. కానీ ఇద్దరే యాక్టివ్.. మిగతా ఎంపీలెక్కడ..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పార్లమెంట్ సభ్యులంటే ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు.. అంటే దాదాపు 15లక్షల మంది ప్రజలకు ప్రజాప్రతినిథులు. కేంద్రం నుంచి నియోజకవర్గానికి నిధులు రాబట్టే నాయకులు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నాలుగు ఓ నాలుగు జిల్లాలకు చెందిన ఎంపీలు మాత్రం.. పదవల్లో ఉన్నారంటే ఉన్నారనే అభిప్రాయమే ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఇంకా చదవండి ...
  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఎంపీలంటే ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు.. అంటే దాదాపు 15లక్షల మంది ప్రజలకు ప్రజాప్రతినిథులు. కేంద్రం నుంచి నియోజకవర్గానికి నిధులు రాబట్టే నాయకులు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నాలుగు ఓ నాలుగు జిల్లాలకు చెందిన ఎంపీలు మాత్రం.. పదవల్లో ఉన్నారంటే ఉన్నారనే అభిప్రాయమే ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాజధాని ఉద్యమం ఊసేలేదు. స్టీల్ ప్రైవేటీకరణ పై పెదవి విప్పలేదు. రైల్వే జోన్ పై గట్టి పట్టూ పట్టడం లేదు. అసలు ఉత్తరాంధ్ర సమస్యపై ఏనాడూ వాదించిందీ లేదు. అయినా.. ఆ ఎంపీలు.. ఎంపీలుగానే ఉన్నారు. కేవలం ఎంపీలుగానే ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఆ పార్లమెంట్ స్థానానికి ఎంపీ ఎవరంటే ఆయనే అంటూ గూగుల్ చెప్పాలి తప్ప.. ప్రజలకు తెలియకుండా పోయింది. జనాల సమస్యలపై కాకుండా సొంత వ్యవహారాలకే పరిమితమయ్యారు ఆ ఎంపీలు. ఇటు రాజమండ్రి (Rajahmundry) నుంచీ అటు శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) వరకూ అయిదు జిల్లాల్లోని ఎనిమిది మంది ఎంపీల్లో ఇద్దరు మాత్రమే మేమున్నామని ఉనికి చాటుకుంటున్నారు.

  మొదట తూర్పు గోదావరి పార్లమెంటు సభ్యుల విషయానికి వస్తే ఒక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తప్ప.. మిగతా ఎంపీలు ఉన్నారా.. అన్న డౌట్ కచ్చితంగా వస్తుంది. కాకినాడ ఎంపీ వంగా గీత సంక్రాంతి సంబరాల్లో, రెండు మూడు ప్రభుత్వ సంక్షేమ పథకాల సభల్లో తప్ప ఎక్కడా కనిపించలేదు. ఫలానా ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని ఇలా ఉపయోగిస్తున్నామని కూడా చేసిందీ లేదు. పోనీ పార్లమెంటులో కాకినాడ సమస్యలు ఏవైనా ప్రస్తావిస్తారా అంటే ఆ అవకాశం రాలేదు.. వచ్చినా ఆమె వినియోగించుకోగలరా అన్న డౌటనుమానం. ఇక తూర్పులోని మరో ఎమ్మెల్యే చింతా అనురాధ. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ చుట్టూపక్కల అమలాపురం ఎంపీ ఎవరంటే ఠక్కున చెప్పే హర్షకుమార్ అనే. అయితే ఆయన ఇప్పుడు ఎంపీ కాకపోయినా.. మాజీ ఎంపీయే అయినా.. ఇప్పటికీ ఆయన్నే జనం ఎంపీ అనుకుంటున్నారంటే ఇక పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అంటే ఇప్పటి ఎంపీ అనురాధ ఇంకా జనాల్లోకి ఆ స్థాయిలో వెళ్లలేదనే అంటున్నారు.

  ఇది చదవండి: చంద్రబాబును చెప్పుతో కొట్టిన ఎన్టీఆర్.. సోముకి పిచ్చిపట్టింది.. కొడాలి నాని ఫైర్..


  ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే.. ఇక్కడ అరకు, అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే ఈ మూడు పార్లమెంటు స్థానాలకు ఎంపీలు ఎవరంటే చెప్పడం జనాలకు దాదాపు కష్టమే. అందుకు కారణం ఈ ఎంపీలు అంతగా జనాల్లోకి రాకపోవడమే. పోనీ విశాఖలో ఏవైనా సమస్యలు లేవా అంటే అబ్బో చాంతాడంత లిస్టు ఉంటుంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణనే తీసుకుంటే ఆయన సినిమా, రియల్ ఎస్టేట్ అంటూ చాలా బిజీ. సినిమా డైరెక్టర్ కో.. భూ వ్యాపారాల్లో ఉన్నవారికే ఆయన అపాయింట్ మెంట్ ఈజీగా దొరుకుతుంది. ఇక మిగతావారికి అంత ఛాన్స్ లేదు. ఎంపీ ఆఫీస్ ఉన్నా.. అది రియల్ వ్యాపారాలకే. రైల్వేజోన్, విశాఖ రాజధాని, స్టీల్ ప్లాంట్ వంటి పెద్ద పెద్ద అంశాలు ఉన్నా.. వాటిలో ఆయన వేలు పెట్టరు.

  ఇది చదవండి: ఆ విషయంలో జగన్ సర్కార్ కు షాక్ తప్పదా..? కేంద్రం నిర్ణయం ఇదేనా..?


  ఇక మరో ఎంపీ అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు వెంకట సత్యవతి. డాక్టర్ గా పెద్ద పేరు ఉన్న సత్యవతి రాజకీయాల్లో పార్ట్ టైం మాత్రమే అంటారు ఆ నియోజకవర్గం జనం. ఇప్పటివరకూ ఆమె పుట్టినరోజు.. రెండు మూడు పెద్ద సభలో తప్ప.. అట్టే జనాలకు కనిపించలేదు. సీఎం వచ్చినప్పుడు, విజయసాయిరెడ్డి వచ్చినప్పుడు అలా అలా కనిపించి మాయమైపోతారు. అనకాపల్లి మొత్తం కూడా రూరల్ ఛాయలు ఉన్న ప్రాంతం. ఎన్నో సమస్యలు ఏళ్లతరబడి పట్టి పీడిస్తున్నాయి. అయినా ఆమె ఏనాడూ ఈ ప్రాంతం గురించి పార్లమెంటులో గళం విప్పలేదు. ఛాన్స్ కూడా రాలేదు. ఇకపై వస్తుందో రాదో తెలియదు.

  ఇది చదవండి: వీళ్లను ఢీ కొట్టే నేతలు టీడీపీలో లేరా..? బాబు మేల్కోకుంటే ఆశలు వదులుకోవాల్సిందే..!


  మరో ఎంపీ అరకుకి ప్రాతినిధ్యం వహిస్తు గొడ్డేటి మాధవి. జగన్ వేవ్ లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీగా అప్పట్లో పేరు. కానీ.. రెండున్నరేళ్లలో ఆమె ఎలుగెత్తి ఏనాడూ ఏ సమస్యను చెప్పాలేదు. స్వతంత్ర భారతావనిలో గిరిజనుల అగచాట్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. అందులోనూ పెద్ద గిరిజన ప్రాంతాలు ఉన్న ఎంపీ నియోజకవర్గం కూడా ఇదే. కానీ.. ఆమె ఏరోజూ పార్లమెంట్లో గిరిజన సమస్యల్ని ప్రతిబింబించేలా మాట్లాడలేదు. తమకు సమస్య వస్తే.. అటో ఇటో పరుగెట్టే గిరిజనులు.. గట్టిగా మాట్లాడితే ఐటిడిఏ, ఎమ్మెల్యేల వరకూ ప్రశ్నిస్తుంటారు. కానీ.. తమ ఎంపీతో మాట్లాడాలనే.. ఆమె తమ సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేయాలనే విషయమే అక్కడ మరిచిపోయారు. దీనికి కారణాలు ఏవైనా.. ఇకనైనా ఆమె మాట్లాడతారేమోనని లక్షల మంది ఎదురుచూస్తున్నారు.

  ఇది చదవండి: పార్టీపై దృష్టిపెట్టిన సీఎం జగన్..? మూడు నెలల యాక్షన్ ప్లాన్ రెడీ..!


  ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒక్కరే ఇందులో ఎంపీ అని చాలా మందికి తెలుసు. రాష్ట్రం మొత్తం కూడా ఆయనంటే అభిమానం చూపిస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమారుడుగా.. మంచి వాగ్థాటి, విషయం ఉన్న అప్ కమింగ్ లీడర్ అని కూడా అంటారు. పార్లమెంటు పెద్దలు కూడా రామ్మోహన్ నాయుడ్ని బాగానే గుర్తిస్తారు. అన్నింటికీ మించి ఆయన తమ ప్రాంత సమస్యల్ని ఏకరవు పెట్టిన సందర్భాలు అనేకం. సరే ఆయనెటూ ప్రతిపక్షంలో ఉన్నారూ.. ఆయన ప్రస్తావన పక్కన పెడితే.. విజయనగరం ఎంపీ ఎవరంటూ చాలా మంది ప్రశ్న. ఎలక్షన్లలో మాత్రం ఆయన పేరు బెల్లాన చంద్రశేఖర్ అని అందరికీ పరిచయం అయ్యారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచీ పోటీ చేద్దామని భావించిన ఆయనకు బొత్స విషయంలో చుక్కెదురై.. ఇటు అటు తిరిగి.. చివరికి ఎంపీ టిక్కెట్ తో ఎంపీ అయ్యారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన ఎంపీ అనే విషయాన్ని చాలా తక్కువ మంది గుర్తిస్తారు. నియోజవర్గంలోని ఏడు మండలాల్లోనే చాలావరకూ ఆయన ఒకరున్నారనే విషయం మరిచిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

  ఇది చదవండి: వైసీపీలో ఆ లక్కీఛాన్స్ దక్కించుకునే నేతలెవరు..? సీఎం జగన్ మనసులో ఉన్నది వాళ్లేనా..?


  ఇలా అయిదు కీలక జిల్లాల్లో ఎంపీల్లో ఇద్దరు తప్ప.. అందరూ చాలా ఇన్ యాక్టివ్ గా ఉన్నారన్నది పెద్ద విషయం. దీనంతికీ వీళ్లందరూ చెప్పే ఓ కంటితుడుపు మాట.. విజయసాయిరెడ్డి పెత్తనం. ఆయన ఉత్తరాంధ్రలో ఉండబట్టే తమ ప్రభావం ఉండటం లేదని వాదించేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఒక్క విజయసాయిరెడ్డి ఆపినంత మాత్రాన ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో వీరి పాత్ర ఆగిపోతుందా అనే ప్రశ్న కూడా చాలా మందికే ఉంది. ఏదేమైనా తమ ఎంపీలు ఇప్పటికైనా తమ కోసం పెదవి విప్పాలని.. బయటకు రావాలని అంతటా ఉంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, TDP, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు