హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime Time: ఆ మూడు గంటలు ఏం జరుగుతోంది..? పోలీసులనూ వెంటాడుతున్న భయం

Crime Time: ఆ మూడు గంటలు ఏం జరుగుతోంది..? పోలీసులనూ వెంటాడుతున్న భయం

 ఆ సమయంలోనే వరుస రోడ్డు ప్రమాదాలు

ఆ సమయంలోనే వరుస రోడ్డు ప్రమాదాలు

Crime Time: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అయితే అక్కడ మాత్రం రోజు ఆ మూడు గంటల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులోనూ పోలీసులు సైతం ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు.. అసలు ఈ నగరంలో ఏం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రహదారులు రక్తమోడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇటీవల రోడ్డు ప్రమాదాల (Road Accidents) సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా విశాఖ మహానగరం (visakhapatnam) నరకానికి కేరాఫ్ గా భయపెుతోంది. అయితే ఇక్కడే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. మహా నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య జరుగుతున్నట్టు పోలీసుల అధ్యయనంలో తేలింది. ఆ మూడు గంటల పాటు ప్రమాదాలు ఎక్కువ అవుతుండడానికి కారణం ఏంటి..? ప్రతి నెల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గమనిస్తే.. ఆ సమయంలోనే ఎక్కువగా ప్రమదాల బారిన పడుతున్నవారు ఉన్నారు అంటున్నారు పోలీసులు. అయితే వీటికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే..?
  సిగ్నల్‌ జంప్‌..                                                                                                 జంక్షన్ లో రెడ్‌సిగ్నల్‌ పడిన తరువాత కూడా పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండం ఒకటని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలకు పలు కారణాలను గుర్తించిన నగర పోలీస్‌ శాఖ.. ప్రమాదాల నియంత్రణ చర్యలపై దృష్టిసారించింది. నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏటా 1,700కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో దాదాపు 400 మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు.


  వాహనాల సంఖ్య పెరుగుతుండడం, అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ఏటేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు మరింత పెరిగాయి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూలై 31 నాటికి సుమారు 881 వరకూ రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
  ఇదీ చదవండి : లోన్ యాప్ లపై సీఎం సీరియస్.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
  అందులో ప్రాణ నష్టం సంభవించినవి 208 కాగా...వీటిల్లో 220 మంది మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 673 రోడ్డు ప్రమాదాల్లో 837 మంది గాయపడ్డారు. ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది సామాజిక, ఆర్థిక సమస్యలకు దారితీస్తోంది.
  ఇదీ చదవండి : కింగ్ నాగార్జున విజయవాడ ఎంపీగా పోటీచేస్తున్నారా..? ఇదిగో క్లారిటీ..
  ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం వుందని గుర్తించిన నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ అందుకు గల కారణాలను గుర్తించడంతోపాటు నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. వారంతా తమ తమ స్టేషన్‌ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలను ఒక్కొక్కటిగా తీసుకుని సంఘటనా స్థలాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు.
  ఇదీ చదవండి: సీతాఫలాలతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భయపెడుతున్న ధరలు
  వాహనాల వారీగానూ, సమయాల వారీగా విశ్లేషించారు. నగర పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య జరుగుతున్నట్టు గుర్తించారు. ఆ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా వుండడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంటుంది. అటువంటప్పుడు వాహన చోదకులు త్వరగా వెళ్లాలనే ఆత్రుతలో సిగ్నల్‌ జంప్‌ చేయడం, రెడ్‌సిగ్నల్‌ పడిన తర్వాత కూడా పాదచారులు జంక్షన్లలో రోడ్డు దాటుతుండడం ప్రమాదాలకు కారణమవుతున్నట్టు తేల్చారు.
  ఇదీ చదవండి: మహిళలకు శుభవార్త.. ఈనెల 22న వారి ఖాతాల్లో రూ.18,750 జమ.. అర్హులు ఎవరు..? ఎలా అప్లై చేసుకోవాలి.. రేపే ఫైనల్ లిస్ట్
  ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై 31 వరకూ నగరంలో ప్రాణనష్టం జరిగిన రోడ్డు ప్రమాదాలు 208 జరగ్గా...వాటిలో 46 సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య జరిగాయి. వీటిలో పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తొమ్మిది, పీఎంపాలెం స్టేషన్‌ పరిధిలో ఐదు, గాజువాక, స్టీల్‌ప్లాంట్‌, ఆరిలోవ స్టేషన్‌ల పరిధిలో నాలుగేసి జరిగాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Road accidents, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు