హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Trending: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

Trending: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

ఉద్యోగానికంటే

ఉద్యోగానికంటే కులవృత్తికే ఓటేస్తున్న యువకులు

Vizag: తమ కులంలో అబ్బాయిలకు పెళ్లి కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా కూడా సొంత సెలూన్ ఉండాలి.. అలాంటి వాళ్లకే సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుందట..! అంతేకాదు త్వరగా పెళ్లిళ్లు అవుతాయట.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  ఇటీవల ఓ మాట్రీమోనీ యాడ్‌ (Matrimony Add) విపరీతంగా పాపులర్‌ అయ్యింది. అందులో వరుడు కావాలంటూ.., అయితే సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు మాత్రం అస్సలు కాంటాక్ట్‌ అవద్దు అంటూ నిర్మొహమాటంగా చెప్పిన విధానం ఇప్పుడు ట్రెండ్‌ అయ్యింది. గతంలో సాఫ్ట్‌ వేర్‌ వాళ్లకు తప్ప మరెవ్వరికీ అమ్మాయిలను ఇచ్చేందుకు ఇష్టపడని పేరెంట్స్‌ ఇప్పుడు వాళ్లకు ఇవ్వాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ జాబ్‌ చేసేవాళ్ల కన్నా కూడా చిన్న బిజినెస్‌ ఉన్న వాళ్లకే ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు. అంతలా బిజినెస్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో విశాఖపట్నం (Visakhapatnam) లో స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ బాగా డెవలప్‌ అయ్యాయి. ముఖ్యంగా యువత తమ కాళ్లమీద తాము నిలబడేందుకు సొంతంగా బిజినెస్‌ వైపు అడుగులు వేస్తున్నారు.

  కొందరు తమ ఆలోచనలతో సరికొత్త బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తుంటే మరికొందరు కులవృత్తిని కొనసాగిస్తూ బిజినెస్‌ చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరే సెలూన్ నిర్వాహకులు రాంబాబు. అయితే ఈ షాపు పెట్టడం వెనక రాంబాబు చెప్పే రీజన్‌ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..! యువత ఎక్కువగా బార్బర్ షాప్ నిర్వహణ వైపు వెళ్లడానికి ఒక సీక్రెట్ ఉందంట. పూర్వం తాతలు, తండ్రి నుండి వస్తున్న ఆచారాన్ని ప్రస్తుత యువత కూడా పాటిస్తూ బార్బర్ షాప్ నిర్వహణలో ఉంటున్నారని అయితే దాని వెనక కూడా ఓ కారణం ఉందని రాంబాబు తెలిపాడు.

  ఇది చదవండి: ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

  తమ కులంలో అబ్బాయిలకు పెళ్లి కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా కూడా సొంత సెలూన్ ఉండాలి.. అలాంటి వాళ్లకే సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుందట..! అంతేకాదు త్వరగా పెళ్లిళ్లు అవుతాయట. ఆర్థిక పరిస్థితులు బాగోలేక సొంత షాప్ పెట్టుకొలేని యువకులు మరొకరి షాపులో పనిచేసుకుంటూ సొంత షాపు పెట్టుకునే డబ్బులు కూడబెట్టుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం కన్నా కుల వృత్తి మిన్న అంటున్నాడు.

  ఇది చదవండి: గోదావరి అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం.. ఒక్కసారి వెళ్తే మైమరచిపోతారు..!

  ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువుకోలేని యువత కూడా బార్బర్ షాప్ నిర్వహణలో పాల్గొని లక్షల్లో సంపాదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో సంపాదించే కన్నా ఈ షాపులోనే ఎక్కువ సంపాదిస్తున్నారు. బార్బర్ షాప్‌లు నిర్వహిస్తున్న యువకులు పెళ్లి చేసుకునేందుకు సంబంధాలకు వెళితే మంచి ఆదరణ లభిస్తుందని రాంబాబు చెబుతున్నారు. తమ కుల వృత్తిలో సొంత షాప్ పెట్టుకుంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువ గౌరవిస్తున్నారని యువకులు చెబుతున్న మాట. శని, ఆదివారాల్లోనే కాకుండా ఎప్పుడు రద్దీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇందులోనే సంపాదించవచ్చు అని పెద్దలు నమ్మకం.

  ఇది చదవండి: విశాఖలో ఈ ఫాస్ట్‌ ఫుడ్‌కు యమ క్రేజ్‌...! తినేందుకు క్యూ కడుతున్న నగరవాసులు..!

  పెళ్లి చేసుకునేందుకు పెద్దల వద్దకు వెళ్లినా సొంత బార్బర్ షాప్ ఉంటే పెళ్లి సంబంధం కలుపుకోవడానికి కూడా ఎక్కువగా ముందుకు వస్తున్నారు. బార్బర్ షాప్ నిర్వహణ అనేది ఎల్లప్పుడూ రద్దీగా ఉండే పని. నెల జీతం కోసం ఎదురుచూసే పని ఉండదు. ఎప్పుడూ చేతిలో కాస్తో కూస్తో డబ్బులు ఉంటాయని..తమ ఆడపిల్లను ఇస్తే సుఖపడుతుందనే భావనలో తల్లిదండ్రులు ఉంటున్నారు.

  ఇది చదవండి: ఈ కోటను చూస్తే మైమరచిపోవాల్సిందే...! అంతటి అద్భుత నిర్మాణం ఎలా సాధ్యమైందంటే..!

  పూర్వం పెద్దలు కూడా ఈ వృత్తి మీద ఆధారపడి ఉండేవారు. పిల్లలను పోషించుకుంటూ వారి జీవనానికి సరిపోయేది. కానీ రాను రాను గ్రామాల్లో ఆదాయం లేకుండా పోయింది. దీంతో వలసలు వచ్చి పెద్ద పెద్ద నగరాల్లో బార్బర్ సాప్ నిర్వహణ చేసుకుంటూ ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు.

  ఒకప్పుడు మన గ్రామాల్లో కులవృత్తులు మూడు పనులు, ఆరు కాసులుగా వుండేవి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, స్వర్ణకార ఇతర కుల వృత్తులు లేని ఊరంటూ ఎక్కడ ఉండేది కాదు. కానీ నాగరిత ముదిరి కులవృత్తులకు ఆదరణ బాగా తగ్గిపోయింది. కుమ్మరి వారు చేసే మట్టికుండల స్థానంలో స్టీలు, ప్లాస్టిక్ బిందెలు వచ్చేసాయి. మట్టి కుండల్లోని చల్లని నీళ్ళ త్రాగే మనకు ఫ్రిజ్ నీళ్ళు కి అలవాటు పడిపోయాము. నాగళ్ళు పోయి ట్రాక్టర్లు వచ్చాయి. చాకలికి, మంగలికి కూడా ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. సెలూను, బ్యూటీపార్లర్లు వచ్చాక గ్రామాల్లో కులవృత్తి చేసే నాయీ బ్రాహ్మణులకు పని లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఇప్పుడు వాళ్లకు మంచి కాలం వచ్చింది. చదువుకున్న కుర్రాళ్లు కూడా ఉద్యోగాలవైపు కాకుండా తమ కులవృత్తిని కొనసాగిస్తూ బార్బర్‌ షాపు నిర్వహించేందుకు ముందుకొస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు