Setti Jagadeesh, News18, Visakhapatnam
Vizag Government School: కార్పొరేట్ స్కూళ్లకు (Corporate Schools) సవాల్ విసురుతోంది ఈ ప్రభుత్వ స్కూల్. అది పక్కా ప్రభుత్వ పాఠశాలే (Government School).. అయితే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూంలు అయితే చెప్పే పనే లేదు.. కానీ ఇప్పుడు పరిస్థితితులు పూర్తిగా మారిపోయాయి. ఇది నర్సీపట్నం (Narsipatnam) లోని నీలంపేట (Neelampeta)లో ఉన్న ప్రభుత్వ పాఠశాల. కార్పోరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వసతులు ఏర్పాటుచేశారు. ప్రైవేటు స్కూల్స్ కి తగ్గట్టుగా, విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో కూడా వర్చ్యువల్ క్లాసు రూమ్స్ అనే విప్లవం వచ్చింది. అంగన్ వాడీ కేంద్రాలు ప్రీ స్కూళ్లుగా మారుతున్నాయి. విద్యార్ధుల నుంచి బయోమెట్రిక్ హాజరు వంటివి వచ్చాయి. ఈ క్రమంలో పాఠశాలల్లో వసతులు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి తమ పాఠశాలకి వచ్చి చూడండి అంటూ నర్సీపట్నంలోని నీలంపేట ప్రభుత్వ స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణ కోరుతున్నారు.
ఈ స్కూల్ లో ఉన్న వాష్ రూమ్‌లు ఏ స్టార్ హోటల్‌లో లేక మల్టీప్లెక్స్ థియేటర్ లోదో కాదు, మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్స్. టాయిలెట్స్ తో పాటు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా.. విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్.. స్కూళ్లకు పెద్ద, చిన్న మరమ్మతులు వంటివి కల్పించి విద్యార్థులను ఆకట్టుకునే విధంగా రూపొందించారు.
చుట్టు చెట్లు.. ఓపెన్ ప్లేస్.. మధ్యాహ్న భోజనం.. పిల్లలు చదువుకోవడానికి ఆహ్లాదంగా ఆడుకోవడానికి మంచి వాతావరణం. ముఖ్యంగా వాల్ పెయింటింగ్స్…స్కూల్ గోడల మీద రంగురంగుల బొమ్మలు చిన్నపిల్లలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కార్పోరేట్ స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీకి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు సరికదా ప్రభుత్వమే అమ్మ ఒడి పథకం కింద తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తుందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. తమకు పిల్లలను అప్పగిస్తే… మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుతామంటున్నారు. విద్యా కానుక ద్వారా బ్యాగ్ పుస్తకాలు, జగనన్న గోరుముద్దులో భాగంగా మంచి భోజనం, మంచి వసతులు కల్పిస్తామని అంటున్నారు.
పాఠశాలలో చేరేందుకు కావలసినవి:
తల్లి , తండ్రి , విద్యార్థి ఆధార్ కార్డ్ లు, విద్యార్థి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, తల్లి బ్యాంక్ ఎకౌంట్, విద్యార్థి రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు. పైన తెలిపిన విధంగా…అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్‌లు తీసుకొచ్చి అప్లికేషన్ నింపితే జాయిన్ చేసుకుంటారు. ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యను అందించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ న్యూస్18తో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag