VISAKHAPATNAM WHAT A TALENT MIMICRY ARTIST NIKHIL IS FAMOUS AS JUNIOR JAGAN IN VIZAG NGS VNL NJ
Vizag: నేను విన్నాను నేను ఉన్నాను అంటున్న ఏయూ స్టూడెంట్.. అచ్చం జగన్ ను దింపేస్తున్నాడుగా.. మీరే చూడండి
సీఎం జగన్ ను దింపేస్తున్న ఏయూ స్టూడెంట్
Junior Jagan: ఆ అబ్బాయి మాట్లాడుతుంటే అచ్చం జగన్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అతడి వాకింగ్.. టాకింగ్ అంతా సేమ్ టు సేమ్ సీఎం ను తలపిస్తుంది. నమస్కారం పెడుతున్నా.. జగనే గుర్తుకు వస్తారు.. ఆఖరికి డ్రెస్సింగ్ స్టైల్ కూడా యాజ్ టీజ్ దింపేస్తున్నాడు..? జగన్ అంటే అభిమానమా..? వేరే కారణం ఏదైనా ఉందా..?
Junior Jagan in Vizianagaram: సాధారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి కోట్లలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ విద్యార్థి చాలా ప్రత్యేకం.. జగన్ ను అభిమానించడం కాదు.. ఏకం సీఎం ను సేమ్ టు సేమ్ దింపేస్తున్నాడు. అసలు అతడి మాట్లాడుతుంటే.. చూడకుండా ఎవరైనా వింటే అక్కడ జగన్ ఉన్నాడనుకునికి షాక్ అవుతారు. కేవలం టాకింగ్ .. వాకింగ్ మాత్రమే కాదు.. అతడి స్టైల్ మొత్తం సీఎంను యాజ్ టీజ్ దింపేస్తున్నాడు. అతనే వైజాగ్ (Vizag) కు చెందిన మంగళంపల్లి నిఖిల్ (Mangalampalli Nikhil). తనకు ఉన్న అద్భుతమైన టాలెంట్ తో ప్రేక్షకుల్ని అలా నిలబెట్టేస్తాడు. ఎలాంటి డైలాగ్ నైనా అలవోకగా చెప్పేస్తాడు. ఇప్పుడందరూ అతడిని జూనియర్ జగన్ (Junior Jagan) అని ముద్దుగా పిలుచుకుటారు. అతడు ఏం మాట్లాడినా.. ఏం చెప్పినా.. ఆయన హవభావాలన్నీ.. జగన్ మాదిరిగానే ఉంటాయి. సీఎం జగన్ ఎలా చేస్తారో.. సేమ్ టు సేమ్ ఆయన కూడా అలానే ఇమిటేట్చేస్తారు. ఒక్కసారి ఆయన జగన్‌ని ఇమిటేట్ చేయడం మొదలుపెడితే.. ఇక చూసేవాళ్లు.. వినేవాళ్లు.. ఒక్క క్షణం అలా జగన్ వచ్చారేమో అనుకోవాల్సిందే.
ప్రతిరోజు కాళ్లకు చక్రాలు కట్టుకుని ఉరుకులు పరుగులు పెట్టే జనాలకు.. అప్పుడప్పుడు కాస్తంత ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే. అందుకే కొన్ని కళలకి ఇప్పటికీ ప్రాధాన్యత ఉంది. సోషల్ మీడియా వచ్చాక సహజసిద్దమైన టాలెంట్లతో ప్రజల్ని అలరించే వాళ్లు కోకొల్లలు. అయితే అందులో కొందరు మాత్రం జనాలకు బాగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నిఖిల్ ప్రసాద్ ఒకరు.
తొమ్మిదేళ్ల వయసు నుంచే మిమిక్రీ
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంగళంపల్లి నిఖిల్ ప్రసాద్… పువ్వు పుట్టగానే పరిమళించిందనే నానుడి నిఖిల్ కి సరిపోతుంది. తొమ్మిదేళ్ల వయసు నుంచే మిమిక్రీ చేసేవాడు. తనలో ఈ మిమిక్రీ టాలెంట్ ఉందని గుర్తించి బయట ప్రదర్శనలు ఇవ్వాలని ఉవ్విళ్లూరేవాడు. అలా సినిమాలు, రాజకీయ వార్తలు చూడడం అందులో ప్రముఖ వ్యక్తుల వాయిస్‌ను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు.
కాలేజ్ ఈవెంట్లలో ప్రదర్శనలు
ఇదివరకు స్టుడెంట్ యూనియన్, కాలేజ్ ఈవెంట్లలో ఆయన తన ప్రతిభ చూపారు. తర్వాత 2019లో మున్సిపల్ ఎన్నికలు, ఇతర క్యాంపెయిన్లలో పాల్గొన్నారు. 2019 కి ముందు అనేక స్టేజ్ ప్రోగ్రామ్ లు చేశారు. ఎక్కడకి వెళ్ళినా ఆయన ప్రతిభకు చప్పట్లు.. విజిల్లే. చిన్నప్పటి నుంచీ యాక్టింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ పై అమితమైన ఇష్టంతో…ఎంత భిన్నమైన మానరిజాల్ని కూడా పట్టేసి చేయగలరు.
త్వరలో యాక్టర్‌గా ప్రేక్షకుల ముందుకు శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన నిఖిల్ ప్రస్తుతం వైజాగ్‌లో ఆంధ్రాయూనివర్సిటీలో చదువుతున్నారు. ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో నాలుగో సంవత్సరం చదువుతున్న నిఖిల్ ప్రసాద్…. మిమిక్రీ ఆర్టిస్ట్ గానే కాకుండా కొన్ని చిన్న సినిమాల్లో విల్లన్గా సైడ్ రోల్స్ యాక్ట్ చేశారు. త్వరలో ఓ పెద్ద బ్యానర్లో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.