హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తిమింగలం మ్యూజియం ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడండి..! ఆసక్తికర విశేషాలివే..!

తిమింగలం మ్యూజియం ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడండి..! ఆసక్తికర విశేషాలివే..!

విశాఖలో

విశాఖలో ఆకట్టుకుంటున్న తిమింగలం మ్యూజియం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో విశాఖపట్నం (Visakhapatnam) ముందుంటుంది. దేశంలోనే బెస్ట్ టూరిజం స్పాట్లలో విశాఖ ఒకటి. ఇక్కడి సముద్రతీరంతో పాటు షిప్ యార్డ్, నేవీ డాక్ యార్డ్, షిఫింగ్ హార్బర్ వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో విశాఖపట్నం (Visakhapatnam) ముందుంటుంది. దేశంలోనే బెస్ట్ టూరిజం స్పాట్లలో విశాఖ ఒకటి. ఇక్కడి సముద్రతీరంతో పాటు షిప్ యార్డ్, నేవీ డాక్ యార్డ్, షిఫింగ్ హార్బర్ వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకే వైజాగ్ సిటీ (Vizag City) ని సందర్శించేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తిచూపుతుంటారు. ఐతే విశాఖలో బీచ్, ఫిషింగ్ హార్బర్, పోర్ట్ వంటివే కాకుండా ఇంకా ఆసక్తికరమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అబ్బురపరిచే మ్యూజియంలు ఎంతో విద్యార్థులకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నారు. విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీలో తిమింగలం మ్యూజియం ఆకట్టుకుంటోంది. ఎన్నో పరిశోధనలకు ఏయూ కేంద్రబిందువుగా మారుతోంది. ఎంతో మంది విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ఈ మ్యూజియాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

  పక్కటెముకల ఆహ్వానం

  ఏయూలోని జంతుశాస్త్ర విభాగంలో తిమింగలాల అస్థిపంజారులు ఉన్నాయి. ఈ మ్యూజియం ఎంట్రన్సే డిఫరెంట్‌గా ఉంది. తిమింగలాల పక్కటెముకలను ఆర్చ్‌లా ఏర్పాటు చేసి సందర్శకులకు వెల్‌కమ్‌ చెబుతున్నారు. ఈ మ్యూజియంలో బాలిన్‌ జాతి తిమింగలాన్ని, బేబి తిమింగలాన్ని చూడవచ్చు.

  ఇది చదవండి: హాట్ సమ్మర్లో ఇక్కడికి వెళ్తే కూల్ అవుతారు.. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు  బాలిన్‌ జాతి తిమింగలం

  1949లో బాపట్ల తీరానికి 80 అడుగుల బాలిన్ జాతి తిమగలం కొట్టుకొచ్చింది. అప్పట్లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకి అది కనిపించింది. వెంటనే వాళ్లు అధికారులకు చెప్పడం తో అక్కడికి వెళ్లిన అధికారులు దానిని పరిశీలించారు. ఈ రకం బాలిన్ జాతి తిమగలం నీలి రంగులో ఉండి 100 అడుగులు వరకు పొడవు ఉంటుంది. 100 నుండి 150 టన్నుల వరకు బరువు వుంటుంది. దీనిని ఏయూకి తలిస్తే విద్యార్థులు పరిశోధనలకు ఉపయోగపడుతుంది అని అప్పటిలో అధికారులు ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చారు. తలభాగం, పక్కటెముకులు , వెన్నుముఖ మాత్రమే తీసుకురాగలిగారు.

  ఇది చదవండి: మీరు వైజాగ్ వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..! అధికారుల కీలక నిర్ణయం


  బేబి తిమింగలం

  మరో చిన్న తిమింగలం 1960లో కాకినాడ తీరానికి కొట్టుకువచ్చింది. 27 అడుగులు ఉన్న ఈ తిమింగలాన్ని టాక్సీ డర్మీ (Taxidermy) చేసి... తల నుండి తోక వరకు తీసుకొచ్చి ఏయూలో భద్రపరిచారు. ఈ రెండు తిమింగలాల అస్థిపంజరాలను మ్యూజియంలా ఆంధ్ర యూనివర్సిటీ లోని జువాలజీ డిపార్మెంట్‌ లో ఏర్పాటు చేశారు. ఈ రెండు తిమింగలాల అస్థిపంజరాలు అప్పటి నుండి నేటి వరకు పాడవకుండా అధికారులు చూసుకుంటూ వస్తున్నారు. విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. అస్థిపంజరాలు పక్కటెముకలు డిపార్మమెంట్‌ అర్చ్‌లా పెట్టడం..ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  ఇది చదవండి: రూపాయికి పది రూపాయల లాభం.. బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ ఐడియా అదిరిపోలా..!


  ఎవరైనా వెళ్లొచ్చు

  ఏయూ జంతుశాస్త్ర విభాగంలో ఉన్న ఈ తిమింగలాల అస్థిపంజరాలను చూడాలనుకుంటే ఎవ్వరైనా వెళ్లొచ్చు. కేవలం స్టూడెంట్స్ అనే కాదు.. ఫారెన్‌ నుంచి కూడా వైజాగ్‌ చూడటానికి వచ్చే టూరిస్టులు అక్కడకు వెళ్తున్నారు. ఇది అందరూ ఉచితంగా చూడవొచ్చు.. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.

  ఇది చదవండి: అల్లూరిని కాల్చిచంపిన రూథర్‌ఫర్డ్‌ బంగ్లా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!


  టైమింగ్స్‌: సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంది. ఆదివారం మాత్రం సెలవు.

  Andhra University

  అడ్రస్ : డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జువాలజి, ఆంధ్ర యూనివర్సిటీ సౌత్‌ కాంపస్‌, ఆంధ్రాయూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ -530003

  ఎలా వెళ్లాలి?

  ఈ మ్యూజియం చూడాలి అనుకుంటే విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ ఉంటుంది. ఆటో, బస్ సౌకర్యం కూడా ఉంది. అక్కడ నుండి లోపలకి ప్రవేశించి కొద్ది దూరంలో జువాలజీ డిపార్ట్మెంట్లో ఈ మ్యూజియం ఉంటుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra university, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు