Big Alert: ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వానలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెగని వర్షం, వరదలతో చాలా ప్రాంతాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం (Anantapuram), కడప జిల్లా (Kadap Distirct)లతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా వణకుతున్నాయి. ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాన్ రూపంలో (Cyclone Effect) మరింత వరద బీభత్సం ఉండే అవకాశం ఉందని అలర్ట్ గా ఉండాలని సూచిస్తోంది. అయితే వానాకాలం దాటినా.. వర్షాలు మాత్రం తగ్గకపోవడంతో భయం వెంటాడుతోంది. ఇప్పటికీ భారీ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న భారీవర్షాలకు ఏపీలోని పలు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, వంతెనలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో నడవడానికి కూడా వీళ్లేని పరస్థితులు నెలకొన్నాయి. ఇలా పలు ప్రాంతాల్లో వరద బీభత్సం భయం ఇంకా వీడలేదు. తాజాగా విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. తుఫాన్ రూపంలో మరో మూడ్రోజులపాటు భారీవర్షాలు తప్పవన్న హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఇప్పటికే ఈ తుఫానుకు 'సిత్రాంగ్'గా నామకరణం చేశారు. ఈ తుపాను ముప్పు ఏపీకి తప్పకపోవచ్చు అంటున్నారు. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది క్రమేపీ బలపడి 20వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని విశాఖ వ వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి ఆంధ్రప్రదేశ్ దిశగా పయనించనున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అది తుపానుగా, పెను తుపానుగా మారే అవకాశాలు ఎక్కువున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం తుపానుగా మారితే దీన్ని ‘సిత్రాంగ్’ అని పిలుస్తారని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఇది సూపర్ సైక్లోన్ గా మారితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ , తెలంగాణ రాష్ట్రాలపై కూడా అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు,వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Big Alert || Super Cyclone for Andhra Pradesh || ఏపీకి భారీ తుఫాను ఎఫెక్... https://t.co/FDM9knmD0U via @YouTube #cyclones #CycloneSZN #rain #RAINCODE #rainbow6siege #rainbowfriendsfanart #rainbowfriendsAu #rainbow6siege
— nagesh paina (@PainaNagesh) October 15, 2022
ఈ‘సిత్రాంగ్’అనే పేరును థాయ్ లాండ్ సూచించింది. థాయ్ భాషలో ‘సిత్రాంగ్’ అంటే ‘వదలనిది’ అని అర్థమంటున్నారు. అయితే ఈ సిత్రాంగ్ తుపానుపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తుఫాను ఏపీని తాకితే.. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, రాయలసీమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Visakhapatnam, Weather report