హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఏడాదిగా రైతును వేధిస్తున్న అధికారి.. ఒళ్లు మండిన రైతు ఏం చేశాడంటే..!

Vizag: ఏడాదిగా రైతును వేధిస్తున్న అధికారి.. ఒళ్లు మండిన రైతు ఏం చేశాడంటే..!

ఏసీబీ వలలో వీఆర్వో

ఏసీబీ వలలో వీఆర్వో

అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో ఏసీబీ వల (ACB Trap) లో మరో అవినీతి చేప చిక్కింది. పొలం పాసు పుస్తకాలు మంజూరు చేయడానికి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ వీఆర్వో అడ్డంగా దొరికాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Anakapalle, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో ఏసీబీ వల (ACB Trap) లో మరో అవినీతి చేప చిక్కింది. పొలం పాసు పుస్తకాలు మంజూరు చేయడానికి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ వీఆర్వో అడ్డంగా దొరికాడు. ఒకే కుటుంబంలో ఉమ్మడి భూమి పంపకం కారణంగా మ్యుటేషన్ కోసం స్థానిక రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎం. బెన్నవరం వీఆర్వో జి.సూర్యనారాయణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు ప్రకారం బెన్నవరంకి చెందిన స్థానిక రైతు జి.శ్రీనివాసరెడ్డి సర్వే నంబరు 119లోని భూమిని తమ కుటుంబ సభ్యులకు పంచి పాసు పుస్తకాలు ఇవ్వడానికి ఏడాదిగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాడు.

  దీనికి వీఆర్వో రూ.25 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన రైతు శ్రీనివాస రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రైతుకు ఏసీబీ అధికారులు రూ.20 వేలు ఇచ్చి వీఆర్వో దగ్గరికి పంపారు. ఆ సొమ్మును పక్కన ములగపూడి సచివాలయం ఆవరణలో రైతు నుంచి వీఆర్వో తీసుకుంటున్న సమయంలో ఏ.సి.బి అధికారులు పట్టుకున్నారు.

  ఇది చదవండి: ఊరంతా జాతర సందడిలో ఉంది..! ఒక్కసారిగా యువకుడి కేకలు.. వెళ్లి చూసేసరికి..!

  ఇదంతా అదనపు ఎస్పీ షకీలాబాను ఆధ్వర్యంలో ఆపరేషన్ నడిపి పట్టుకునట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌లు రమేష్, ప్రేమకుమార్, విజయకుమార్, సతీష్ కుమార్, శ్రీనివాస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఒక్క నాతవరం మండలంలోనే ఇతర శాఖలతో పోల్చితే రెవెన్యూ శాఖలోనే అవినీతి ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. నాతవరంలో చూసుకుంటే గత 15 ఏళ్లుగా నలుగురు వీఆర్వోలు, ఒక తహసీల్దార్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. ఈ పరిధిలో రెవెన్యూ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు లంచాలు లేనిదే ఫైలు కదపరని పలువురు రైతులు కూడా ఆరోపిస్తున్నారు.

  ఇది చదవండి: వీళ్లు మారరు..! ఎన్ని ఫైన్‌లు వేసినా వీళ్లు ఇంతే..! కళ్లు కనిపించడం లేదా..?

  ఏడాదిగా తనను చాలా ఇబ్బందులకు గురిచేశారని రైతు శ్రీనివాస్ తెలిపారు. రూ.25 వేలు డిమాండ్ చేసి, ఆ మొత్తం డబ్బు ఇచ్చే వరకు పని చేయనంటూ చెప్పడంతో ఆర్థిక స్థోమత లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించానని శ్రీనివాస రెడ్డి తెలిపారు.

  తమ విధులు తాము చేయకుండా అమాయక ప్రజలను లంచాల కోసం కొంత మంది అధికారులు రాబందుల్లా పీక్కుతింటున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏ పని చేయాలన్నా ఒక రేటు… చేయి తడవనిదే ఆ పని ప్రారంభించడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ ప్రభుత్వ శాఖల అధికారులు లంచాలు వసూలు చేస్తున్నారు. ఇలా అయితే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా పనులు చేయించుకోవాలంటూ లబోదిబోమంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: ACB, Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు