Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
Snake Tension: జిల్లా వాసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి పాములు (Snakes).. సాధారణంగా వర్షాకాలం వ్యాధుల కాలమే కాదు.. విష సర్పాలు, తేళ్లు, పురుగులు కూడా జనవాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇటీవల కాలంలో చెరువులు, కాలువలు మూసేసి ఇళ్లు కట్టేస్తున్నారు. పొలలాలను సైతం రియల్ ఎస్టేట్ వెంచర్లు (Real Estate Wenutures)గా మార్చేస్తున్నారు. అడ్డుగా ఉంటున్నాయని చెట్లు నరికేస్తున్నారు. దీంతో పాములు జనవాసాల్లోకి తరచూ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram) రెండు జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాల్లో.. చాలా గ్రామాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది.
ఒటీవల ఆగస్టు 4న సీతంపేట మండలం గులుమూరు పంచాయతీ ఆడలి గ్రామానికి చెందిన కె.మల్లేసు పొడు వ్యవసాయ పనులకు వెళ్లి పాము కాటుకు గురయ్యాడు. హుటాహుటిన ఆయన్ని సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఆ మరచుటి రోజే అంటే ఆగస్టు 5న ఇదే మండలం అంటికొండ గ్రామానికి చెందిన అన్నాజీరావు, సుగుణ పొలం పనులకు వెళ్లి పాము కాటుకు గురయ్యారు. వీరిని కూడా ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
తాజాగా గరుగుబిల్లి మండలంలోని ఉద్దవోలుకి చెందిన 36 ఏళ్ల రైతు కమటాన చిరంజీవి పాము కాటుకు గురై మృతి చెందాడు. బుధవారం గ్రామ శివారులోని పొలానికి మందు వేయడానికి వెళ్లిన ఆయన కాలిపై పాము కాటు వేసింది. దీంతో ఐదు నిమిషాల్లోనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
ఇదీ చదవండి : అమ్మవారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ.. ఘనంగా అనంత పద్మనాభ వ్రతం
ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే పాము కాటు నుంచి కాపాడుకోవాలి అంటే ఈ జగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. రైతులు, పొలం పనులకు వెళ్లే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి : ఈ సమయంలో తప్పక చూడాల్సిన బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇదే..? ఎలా వెళ్లాలి.. ప్రత్యేకత ఏంటి?
పాము కాటేయగానే భయపడకూడదు. కాటు వేసిన చోట నుంచి నడవకూడదు. అలా చేస్తే విషం త్వరగా తలకు చేరుకుంటుంది. కదలకుండా ఉండడం శ్రేయస్కరం. ముందుగా ఏ పాము కాటేసిందో గమనించాలి. కాటేసిన ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి, విషం పైకి పోకుండా కట్టువేయాలి. రక్తపింజరి కాటు వేసిన సందర్భాల్లో చిగుళ్లు, మూత్రపిండాల నుంచి రక్తస్రావం ఉంటుంది. నాగు పాము కాటువేస్తే కళ్లు మూతలు పడడం, వాపు రావడంవంటివి ప్రధాన లక్షణాలు.
ఇదీ చదవండి : ఈ సమయంలో తప్పక చూడాల్సిన బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇదే..? ఎలా వెళ్లాలి.. ప్రత్యేకత ఏంటి?
పాము కాటు వేసి సమయం నుంచి గంట వ్యవధిలో వైద్యసేవలు పొందాలి. లేదంటే కష్టమని వైద్యులు తెలియజేస్తున్నారు. ‘పాము కాటు వేయగానే నాటు వైద్యం పేరుతో జాప్యం చేయడం మంచిది కాదు.. నోటితో విషాన్ని పీల్చరాదు’ అని వారు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Snake bite, Snakes