హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tribes Tradition: వరుణుడి కోసం వినూత్న పూజలు.. గిరిజనుల వింత ఆచారం..

Tribes Tradition: వరుణుడి కోసం వినూత్న పూజలు.. గిరిజనుల వింత ఆచారం..

విజయనగరంలో గిరిజనుల వినూత్న పూజలు

విజయనగరంలో గిరిజనుల వినూత్న పూజలు

Andhra Pradesh: వరుణుడు కరుణించాలని.. విస్తారంగా వర్షాలు కురవాలని వరుణ యాగాలు చెయ్యటం చూసాం. వరుణ జపాలు గురించీ విన్నాం. అధునాతన పద్దతుల్లో మేఘాలను మదించటం కూడా అందరికీ తెలిసిందే. కానీ అక్కడ గిరిజనులు..

P.భాను ప్రసాద్, విజయనగరం ప్రతినిధి, న్యూస్18

వరుణుడు కరుణించాలని.. విస్తారంగా వర్షాలు కురవాలని వరుణ యాగాలు చెయ్యటం చూసాం. వరుణ జపాలు గురించీ విన్నాం. అధునాతన పద్దతుల్లో మేఘాలను మదించటం కూడా అందరికీ తెలిసిందే. కానీ అక్కడ గిరిజనులు వినూత్నంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా వానదేవుడి కరుణ కోసం ఎక్కడలేని సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇంతకీ ఏంటా పూజ.. ఎక్కడ ఎలాంటి సాంప్రదాయం అమల్లో ఉంది తెలుసుకోవాలంటే... విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలోని ఓ గిరిజన గ్రామానికి వెళ్లాల్సిందే. ఏజెన్సీలో వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ,ఓ వింత ఆచారాన్ని పాటించారు. వర్షాకాలం మొదలై చాలా రోజులు గడుస్తున్నా వర్షాలు సరిగా కురవకపోవడంతో నిరాశతో ఎదురు చూస్తున్న రైతులు వానదేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నంచారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. తమ ఆచారం ప్రకారం వినూత్నంగా పూజలు చేసారు. కూర్మరాజు పేటకు ఆనుకొని 5 కిలో మీటర్ల ఉన్న జాకరమ్మ కొండపై ఆరిలోవ నీళ్లసర్రి వద్ద కొండభైరవుడు, జాకరమ్మలకు పూజలు నిర్వహించారు. జాకరమ్మ, భైరవుడు లను పూజిస్తే వరుణుడు కరుణిస్తాడని గ్రామస్తుల నమ్మకం.

కూర్మరాజు పేట పంచాయితీలో ప్రతీ ఏటా వందల ఎకరాల్లో అక్కడి రైతులు వరి పంట సాగు చేస్తుంటారు. వర్షాకాలం మొదలవ్వడంతోనే నారు సిద్దం చేసిన రైతులు, సరైన వర్షాలు లేకపోవడంతో ఉబాలు జరిపించడం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో నారు కాస్త ముదిరిపోతోంది. తరచూ పడుతున్న చిన్నచిన్న వర్షాలు .. నారుమళ్లు ఎండిపోకుండా కాపాడుతున్నాయే తప్ప వరి నాట్లకు సహకరించడం లేదు. దీంతో ఆందోళనలో ఉన్న ఆ గ్రామ రైతులు .. ఈ సారి జాకరమ్మ, భైరవుడులకు పూజలు చేయాలని నిర్ణయించారు. అనుకున్న ప్రకారమే డప్పు వాయిద్యాల మధ్య గ్రామానికి చెందిన కొంత మంది రైతులు, గ్రామపెద్దలు, జన్ని కుటింబీకులు సమావేశం నిర్వహించుకొని ఈ పూజలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ముహూర్తం ప్రకారం జాకరమ్మ కొండకు డప్పు వాయిద్యాల మధ్య బయల్దేరి వెళ్లారు.


ఇది చదవండి: కరోనా ఎఫెక్ట్... ఏపీలో స్కూళ్లకు సెలవు..? ఎక్కడంటే..!

అంతకు ముందు గ్రామస్తుల నుండి సేకరించిన బియ్యం, బెల్లం, పూజా సామాగ్రిని తమ వెంటబెట్టుకొని వెళ్లారు. అక్కడే స్నానాలు ఆచరించిన జన్ని కుటుంబీకులు, సాంప్రదాయ వంటలు తయారు చేసారు. తమతో తెచ్చిన బియ్యం, బెల్లంలతో పాయసం వండారు. అనంతరం పూజలు నిర్వహించి, మొదట పాయసాన్ని జాకరమ్మ, భైరవుడులకు నైవేద్యం పెట్టారు. తమతో తెచ్చి కోడి, గొర్రెపోతులను అమ్మవారికి బలిచ్చి మొక్కుబడి చెల్లించారు. జాకరమ్మ, భైరవుడులకు అర్పించిన ప్రసాదాన్ని అనంతరం కొండ రాయిపై వంతుల్లా వేసి, మోకాళ్లపై కూర్చొని.. ఒక్కొక్కరు ఆ పరమాన్నాన్ని నాలుకతో నాకి తిన్నారు. ఇలా నిష్టతో పూజలు చేస్తే మంచి వర్షాలు కురుస్తాయని కూర్మరాజుపేట గ్రామస్తుల నమ్మకం.

ఇది చదవండి: వైసీపీలో కాల్ రికార్డ్స్ కలకలం.. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిన వ్యవహారం


సుమారు 60 సంవత్సరాల నుండి ఇలాంటి పూజలు నిర్వహిస్తున్నామని, ఎప్పుడు వర్షాలు కురవకపోయినా ఇలాంటి ఆచారాన్ని పాటించి పూజలు చేస్తే.. ప్రతీసారి మంచి వర్షాలు కురిశాయని.., ఈ సారి కూడా వర్షాలు మంచి వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు అంటున్నారు. మొత్తానికి వరుణ దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించడం, అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటించడం ద్వారా కూర్మరాజుపేట వాసులు చేస్తున్న ప్రయత్నం మాత్రం అభినందనీయం.

First published:

Tags: Andhra Pradesh, Tribes, Vizianagaram