• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM VIZIANAGARAM DISRTICT PACHIPENTA VILLAGE SI OVERREACTION HE BEATING SC MAN NGS VZM

Andhra Pradesh: ఓ ఎస్ఐ భార్య భర్తల మధ్య గొడవలో తలదూర్చాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా?

Andhra Pradesh: ఓ ఎస్ఐ భార్య భర్తల మధ్య గొడవలో తలదూర్చాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా?

భార్యభర్తల మధ్య గొడవలో దూరి సస్పెండ్ అయిన ఎస్ఐ

నెత్తిన టోపీ, చేతిలో లాఠి ఉంది కదా అని అధికారం ప్రదర్శిస్తుంటారు కొదరు ఖాకీలు. అలాగే ఓ ఎస్ఐ భార్యభర్తల మధ్య జరిగిన వివాదంలో తల దూర్చి కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు తెలుస్తోంది. విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో ఎస్ఐ పై చర్యలు ప్రారంభించారు డీఎస్పీ

  • Share this:
    భార్య భర్తల గొడవలు ఈ మధ్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నవి చాలానే ఉన్నాయి. అయితే కౌన్సిలింగ్ ఇచ్చో.. లేదో కోర్టులో తేల్చుకోవాలనో చెప్పి పోలీసులు పంపించేస్తారు. ఇద్దర్ని కూర్చొబెట్టి  సర్ధి చెప్పే ప్రయత్నం చేసి మందలిస్తారు. కేసు తీవ్రంగా ఉంటే తప్ప భార్య భర్తల మధ్య తగాదాల్లో పోలీసులు పెద్దగా తలదూర్చరు. కానీ ఓ ఎస్ఐ తన చేతిలో పవర్ ఉంది కదా అని.. భార్య భర్తల మధ్య తగవులో తలదూర్చి.. కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. దీంతో గ్రామస్థులంతా తిరగబడి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. విజయనగరంలో చోటు చేసుకుంది ఈ ఘటన.

    భార్య భర్తల వివాదాన్ని తాను తీరుస్తానని చెప్పిన ఎస్ఐ రమన.. పాచిపెంటకు చెందిన దంపతుల వివాదం మధ్య దూరారు. అక్కడితో ఆగకుండా  భార్య ఫిర్యాదుతో ఆ భర్త డొల రాజుని చితకొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించి తల్లి మేరమ్మను కూడా ఎస్ఐ గాయపరిచారు. దీంతో ఎస్ఐ తీరుపై పాచిపెంట ఎస్సీ కాలనీ వాసులు మండిపడ్డారు. విజయనగరం జిల్లా సాలూరు సర్కిల్ ఆఫీస్ దగ్గరకు వెళ్లి బైఠాయించారు. విచక్షణా రహితంగా దాడి చేసిన ఎస్ఐ రమణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. సస్పెండ్ చేయాలని దళితులు ధర్నా చేపట్టారు.

    దళితుల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. విచక్షణా రహితంగా చేయి చేసుకున్న పాచిపెంట ఎస్సై పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సాలూరు వచ్చి పరిస్థితిని విచారించిన పార్వతీపురం డీఎస్పీ సుభాష్. ఎస్సై రమణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. CI అప్పలనాయుడు ఎదో చెప్పి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా, డిఎస్పీ వినిపించుకోలేదు. ఎస్సై రమణను వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించారు.

    గతంలో జరిగిన కురుపాం రోడ్డు పై వివాదం, పాచిపెంట విలేఖరి వివాదాలను ప్రస్తావించిన డిఎస్పీ. ఎస్సై మానసిక పరిస్థితిని ఉద్దేశించి చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ నిజంగా తప్పు చేసినా.. ఒక వ్యక్తిని ఇలా విచక్షణా రహితంగా కొట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు అంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆఫీసుకి రిపోర్ట్ అవ్వాలని ఆదేశించారు. దెబ్బలు తిన్న వ్యక్తిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఎస్ఐ రమణపై పలు కేసులు నమోదు అయ్యాయి. చాలాసార్లు ఇలా ఇతరులపై చేయి చేసుకున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు