హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

హాట్ సమ్మర్లో ఇక్కడికి వెళ్తే కూల్ అవుతారు.. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు

హాట్ సమ్మర్లో ఇక్కడికి వెళ్తే కూల్ అవుతారు.. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు

వైజాగ్

వైజాగ్ వాటర్ వరల్డ్

హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండే ప్రదేశాలకు వెళ్లాలి. ఊటీ, కాశ్మీర్, లఢఖ్ వంటి ప్రాంతాలకు వెళ్లలేకపోయినా లోకల్ గానే అలాంటి అనుభూతిని కల్పించే ప్రదేశాలు చాలానే ఉంన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టూరిజానికి కేరాఫ్ అడ్రస్ అయిన విశాఖపట్నం (Visakhapatnam) లో ఇలాంటి స్పెషల్ ప్లేస్ ఒకటుంది.

ఇంకా చదవండి ...

  Neelima Eaty, News18 Visakhapatnam

  సమ్మర్ హాలిడేస్ (Summer Holidays) వస్తే చాలు పిల్లలకు ఏదొక స్పెషల్ టూర్ ఉండాలి. ఐతే హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండే ప్రదేశాలకు వెళ్లాలి. ఊటీ, కాశ్మీర్, లఢఖ్ వంటి ప్రాంతాలకు వెళ్లలేకపోయినా లోకల్ గానే అలాంటి అనుభూతిని కల్పించే ప్రదేశాలు చాలానే ఉంన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టూరిజానికి కేరాఫ్ అడ్రస్ అయిన విశాఖపట్నం (Visakhapatnam) లో ఇలాంటి స్పెషల్ ప్లేస్ ఒకటుంది. వైజాగ్‌లో ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో వాటర్‌ వరల్డ్ ఒకటి. దీన్నే అమరావతి వాటర్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ అన్ని వయసుల వారికి రైడ్‌లు ఉన్నందున మీరు, మీఫ్యామిలీతో కలిసి రోజంతా ఇక్కడ ఎంజాయ్‌ చేయోచ్చు. ఇక్కడ స్విమ్మింగ్‌పూల్‌ లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తారు. సందర్శకులను సురక్షితంగా ఉంచడానికి పార్క్ అన్ని శానిటైజేషన్ చర్యలను తీసుకుంటుంది. ఈ పార్క్‌లో పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఆనందించ గలిగే అత్యంత ఉత్తేజకరమైన వాటర్ రైడ్‌లు ఉన్నాయి.

  పెద్దల కోసం వైజాగ్‌ వాటర్‌ వరల్డ్‌ అడల్ట్స్‌ (Vizag Water World), చిన్న పిల్లల కోసం వైజాగ్‌ వాటర్‌ వరల్డ్‌ కిడ్స్‌ (Vizag Water World Kids), స్విమ్మింగ్‌ పూల్స్‌ కూడా పిల్లలకు, పెద్దలకు వేరువేరుగా ఉన్నాయి.

  ఇది చదవండి: మీరు వైజాగ్ వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..! అధికారుల కీలక నిర్ణయం


  వాటర్ వరల్డ్ స్పెషాలిటీస్ ఇవే..!

  బూమరాంగ్ స్లయిడ్, స్పైరల్ ఓపెన్ ఫ్లోట్ స్లయిడ్, ఎఫ్ స్పైరల్ ఓపెన్ బాడీ స్లయిడ్, ఉచిత ఫాల్ స్లయిడ్, ఒక బహుళ లైన్ స్లయిడ్, టోబో లోగో స్లయిడ్‌, కిడ్స్ ప్లే స్టేషన్, వేవ్ పూల్, జంగిల్ రైన్ డ్యాన్స్, ఎ డిజె ఆర్, ఈత కొలను…ఇలా ఎన్నో ఉన్నాయి ఈ వాటర్‌ వరల్డ్‌లో మీ కోసం. ఇందులోకి ప్రవేశించాలి అంటే మీ భద్రత, పరిశుభ్రతను నిర్ధారించే దుస్తులను మాత్రమే వేసుకోని వెళ్లాలి. వందశాతం నైలాన్, సింథటిక్ మెటీరియల్‌తో తయారు చేసిన దుస్తులును మాత్రమే అనుమతిస్తారు.

  ఇది చదవండి: రూపాయికి పది రూపాయల లాభం.. బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ ఐడియా అదిరిపోలా..!


  ప్రత్యేకమైన డ్రెస్‌ కోడ్‌

  ఈ వాటర్‌ వరల్డ్‌కు వెళ్లాలంటే డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి. మీరు రెగ్యులర్‌గా ధరించే చీరలు, సల్వార్లు, బుర్ఖా, షాల్స్, కార్గోస్‌, జీన్స్‌ షర్ట్‌లు, కండువాలు, స్కూల్ యూనిఫారాలు అనుమతించరు. అక్కడకు కేవలం స్విమ్‌ షూట్‌ (swim suits), బాడీ సూట్‌ (body suit), త్రి ఫోర్త్‌ (Three-Fourths), షార్ట్స్‌ (shorts), టీషర్ట్స్‌ (Tshirts), బికిని (Burkini) మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ మీరు ఈ డ్రెస్‌ కోడ్‌లో రాకపోయినా..అవి తెచ్చుకోకపోయినా డోంట్ వర్రీ. వాళ్ల దగ్గరే నామమాత్రపు ధరకు అందుబాటులో ఉంటాయి. మనం కొనుగోలు చేయోచ్చు. దుస్తులు మార్చుకునే గది మరియు లాకర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న పార్క్‌ లోని స్టోర్‌లలో ఈ దుస్తులు కొనుక్కోవచ్చు.

  ఇది చదవండి: అక్కడ ఇంటింటికీ ఆర్గానిక్ మద్యం.. పైసా ఇవ్వనక్కర్లేదు.. అంతా ఫ్రీ..! హెల్త్ బెనిఫిట్స్ కూడా..


  వాటర్ వరల్డ్ టైమింగ్స్‌: ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రం ఉంటుంది.

  టికెట్ ధర : పెద్దలకు రూ. 600/-, మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకు రూ. 450/-

  వెబ్‌సైట్‌: ఆన్‌లైన్ ద్వారా టికెట్‌ కొనుగోలు చేయాలనుకుంటే..,  http://www.vizagwaterworld.com వెబ్‌ సైట్‌ ను సందర్శించండి.

  ఇది చదవండి: ఏపీలో జపాన్ మామిడి.. ఒక్కపండు ధర రూ.లక్ష.. సాగుచేస్తే కోటీశ్వరులే..!


  వాటర్‌ వరల్డ్‌ టీమ్‌ను మీరు ఫోన్‌లో కానీ, మెయిల్‌ ద్వారా కానీ సంప్రదించవచ్చు.

  ఫోన్‌ నంబర్స్: 91 9640616999 91 9640676999

  మెయిల్‌ ఐడి: vizagwaterworld@gmail.com

  అడ్రస్‌: 193/1, చిక్కలపేట, సరిపల్లి గ్రామం, పెందుర్తి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌, 531173

  Vizag Water World

  ఎలా వెళ్లాలి.?

  విమాన మార్గం ద్వారా అంటే వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ కు వెళ్లొచ్చు. అక్కడ నుంచి క్యాబ్‌లో ఈ వాటర్‌ వరల్డ్‌ కు వెళ్లొచ్చు. బస్సు ద్వారా అంటే విశాఖ బస్టాండ్‌ నుంచి పెందుర్తి, కొత్తవలస వెళ్లే 28k, 68k బస్సులు ఎక్కితే.. ఈ వాటర్‌ వరల్ట్‌ దగ్గర దిగొచ్చు. ఆటో, క్యాబ్‌ సర్వీస్‌లు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు