హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: కంపు కొడుతున్న సాగర తీరం.. అధికారులు అలర్ట్‌ అవ్వకపోతే అంతే సంగతులు..!

Vizag: కంపు కొడుతున్న సాగర తీరం.. అధికారులు అలర్ట్‌ అవ్వకపోతే అంతే సంగతులు..!

X
వైజాగ్

వైజాగ్ బీచ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఉన్న అందమైన నగరాల్లో విశాఖపట్నం (Visakhapatnam) ఒకటి. ఈ నగరానికి వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం ఉంది. విశాఖపట్నం వచ్చి ప్రముఖ బీచ్ లను సందర్శించకుండా ఎవ్వరూ నగరం దాటరు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhaptnam

ఒకవైపు పర్యాటకులు బీచ్‌ అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. మరోవైపు డ్రైనేజీ వచ్చి సముద్రంలో చేరుతుంది. ఇంక ఆ ప్లేస్‌లో పర్యాటకులు ఫొటోలు దిగడం ఆపేసి..ఇదేంటి డ్రైనేజీ వాటర్‌ వచ్చి సముద్రంలో కలుస్తోంది...రోజు ఇందులోనేనా మనం స్నానాలు చేసి ఆడుకుంటుంది అనే అనుమానంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదంతా ఎక్కడో కాదు మన ఆర్కే బీచ్‌లో కనిపించిన దృశ్యం..! ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఉన్న అందమైన నగరాల్లో విశాఖపట్నం (Visakhapatnam) ఒకటి. ఈ నగరానికి వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం ఉంది. విశాఖపట్నం వచ్చి ప్రముఖ బీచ్ లను సందర్శించకుండా ఎవ్వరూ నగరం దాటరు. తెల్లవారుజామున వాకింగ్ మొదలుకొని సాయంత్రం వేళ సేద తీరే వరకూ సందర్శించాల్సిన అనేక బీచ్‌లు ఇక్కడ ఉన్నాయి. ఇవి పర్యకులకు వినోదాన్ని పంచడంతో పాటు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అలా నిత్యం పర్యాటకులు సేదతీరే తీరప్రాంతాల్లో ఆర్కే బీచ్‌ (Vizag RK Beach) మొదటి స్థానంలో ఉంటుంది.

విశాఖ ఆర్కే బీచ్ నిత్యం పర్యటకలు వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు.. పర్యాటకులతో కిటకిటలాడే ఆర్కే బీచ్ ఇప్పుడు కంపు కొడుతుంది. దానికి కారణం పర్యాటకులు స్నానం చేసే ప్రాంతంలోనే మురుగు నీరు వచ్చి చేరుతుండటం. విశాఖ ఆర్కే బీచ్ బస్ స్టాప్ నుండి నోవాటెల్‌ హోటల్ మధ్య ఉన్న డ్రైనేజీ కాలవ సముద్రంలోకి రావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీచ్ కొచ్చే పర్యటకులు స్నానాలు చేస్తూ ఉంటే పక్కనే డ్రైనేజీ కాలవ సముద్రంలోకి వచ్చి కలుస్తుంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: A టు Z ఏదైనా.. అతి తక్కువ ధరకే.. ప్రత్యేకంగా నిలుస్తున్న సండే మార్కెట్


స్నానాలు చేసే ప్రదేశంలో మురికి నీరు వస్తే స్నానాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని, ఈ కాలవ విశాఖ ఆర్కే బీచ్‌కు ఉన్న పేరును చెడగొడుతుందని స్థానికులు మండిపడుతున్నారు. పర్యాటకంగా అభివృద్ధి అవుతున్న విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద ఈ డ్రైనేజీ కాలవ సముద్రంలో కలవడంతో పర్యాటకుల తాకిడి అక్కడ తగ్గుతుంది. విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు చొరవ తీసుకొని ఈ కాలువ ద్వారా వస్తున్న డ్రైనేజీకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇతర ప్రదేశానికి వెళ్లే విధంగా చేయాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది చదవండి: మేముసైతం అంటున్న కలెక్టర్ల సతీమణులు..! ఏం చేశారో చూస్తే షాక్ అవుతారు


ఆర్కే బీచ్‌ ప్రాముఖ్యత..!

రామకృష్ణ మఠం ఈ బీచ్‌కు సమీపంలో ఉండడం వలన రామకృష్ణ బీచ్ అనే పేరు వచ్చింది. దీనిని ఆర్.కె.బీచ్ అని కూడా పిలుస్తారు. విశాఖ నగరానికి వచ్చే పర్యాటకులను మొట్ట మొదట ఆకర్షించే బీచ్ ఆర్.కే బీచ్. దీనిని సందర్శించిన తరువాతే పర్యాటకులు విశాఖలో తమ ట్రిప్ మొదలుపెడుతుంటారంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం వేళ జనసందోహంతో ఈ బీచ్ కోలాహలంగా ఉంటుంది. నగరంలో బాగా అభివృద్ధి చెందిన బీచ్‌లలో ఇది ఒకటి.

ఈ బీచ్ చుట్టూ ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ లతో పాటు పార్క్ లు, మ్యూజియంలు వంటి అనేక పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉంటాయి. పొడవైన ఈ బీచ్ రోడ్డులో సైకిల్ రైడ్ చేసే వీలుంది. బీచ్ దృశ్యాలను చూస్తూ రాత్రి బస చేయాలనుకునే పర్యాటకుల కోసం బీచ్ రోడ్డులో అనేక హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇంత పర్యాటక ఆకర్షణ ఉన్న ప్రాంతంలో ఈ మురుగునీటి వల్ల టూరిస్టులు తగ్గితే అది టూరిజంమీదే దెబ్బతీసే అవకాశం ఉంది. సుందరనగరం అని పేరున్న విశాఖకు ఇలాంటి ఘటనల వల్ల చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు ఇప్పటికైనా పటిష్ట చర్యలు చేపట్టి ఆర్కేబీచ్‌ విశిష్టతను కాపాడాలని విశాఖ వాసులు కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam