S jagadesh, visakhaptnam, News 18
Gold Man: ఈ మధ్య కాలంలో తరుచూ బంగారం బాబు (Gold man)లు గురించి వింటున్నాం.. ఒంటినిండి నిఘనిఘలాడే బంగారం (Gold) ధరిస్తూ సందడి చేస్తుంటారు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.. అబ్బో ఇంత బంగారమా అంటూ చూస్తేనే మురిసిపోతం.. అలాంటి బంగారు బాబు మన దగ్గరా ఉన్నాడని మీకు తెలుసా... ఆ బంగారు బాబును రోడ్డు మీద తొలిసారి చూసిన వారు సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతుంటారు. ఈ రోజుల్లో చైన్ స్నాచర్లు (Chin snatchers ) పెరిగిపోయారు.. ఒక్క హారం మెడలో వేసుకొని బయటకు వెళ్లాలి అంటే భయపడే రోజులు.. మెడలో కానీ.. చేతికి గానీ బంగారు ఆభరణాలు ఉంటే.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఏ భయం లేకుండా.. ఈ బంగారు బాబు ఇలా రోడ్లపై నిత్యం ఇంత బంగారం వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అసలు ఒంటినిండా బంగారం లేనిదే ఇళ్లు దాటి బయటకు ఒక్క అడుగుకూడా వేయరు.. అయితే ఆయన ఇలా వంటి నిండి ఇంత బంగారం ధరించడం వెనుక పెద్ద కథే ఉంది..
ఈయన పేరు ముక్కా శ్రీనివాస్ (Mukka Srinivas).. విశాఖపట్నం (Visakhapatnam)లోని రియల్ ఎస్టేట్ వ్యాపారీ (Real Estate Businessman).. సీతమ్మధార (Seethammadhara)కు చెందిన ముక్క శ్రీనివాస్ అసలు బంగారం లేకుండా ఎవరికీ కనిపించరు. ప్రస్తుతం ఆయన దగ్గర సుమారు ఐదు కిలోలకుపైగా బంగారం ఉంది. ఆ బంగారాన్ని అంతా నిత్యం ధరిస్తూనే అందరికీ దర్శనమిస్తాడు. చూసిన వారు ఆయనకు బంగారం అంటే అంతా పిచ్చా అనుకుంటారు.. కానీ తాను ఇలా బంగారు బాబుగా మారడానికి వేరే కథ ఉంది అంటున్నారు.
చిన్నప్పుడు అతడి అతి కోపిష్టి. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆవేశపడేవాడు. దీంతో అతడి కోపం ఎలాగైనా తగ్గించాలనే ఉద్దేశంతో.. శ్రీవాస్ తల్లి.. ఒక చైను, రెండు ఉంగరాళ్లు ధరించమనేది.. ఈ రెండు శరీరంపై ఉన్నాయని గుర్తిస్తే కోపం తగ్గుతుందని సలహా ఇచ్చేది. ఆ రోజు నుంచి అతడిలో మార్పు కనపడడంతో.. అమ్మ నిత్యం ఇలా బంగారం వేసి.. కొడుకు తయారు చేసేది. అప్పటి నుంచి అతడికి బంగారం ధరించడం అలవాటుగామారింది. అందుకే ఇప్పుడు వైజాగ్ గోల్డ్ మెన్ గా గుర్తింపు పొందాడు. మహిళలు కూడా ఇంత ఎక్కువ బంగారం నిత్యం ధరించరేమో..?
ఇదీ చదవండి : చంద్రబాబుకు సిక్కోలు సెంటిమెంట్.. రేపటి నుంచి జనం బాట.. జిల్లాల పర్యటన వ్యూహం అదేనా?
తనకు బంగారం అంటే చాలా ఇష్టమని.. అమ్మ చెప్పిన మాటతో ఆ ఇష్టం పెరిగిందని.. అందుకే బంగారం కానీ లేకపోతే అన్నిపనులు మానుకుని ఇంట్లో అయినా ఉంటాను కానీ, బయటకు నేరాను అంటున్నారు. నిత్యం బంగారం ధరించి తిరుగుతుండడంతో బంగారం బాబుగా విశాఖ ప్రజలకు ఆయన సుపరిచితం అయ్యారు. అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖను చూసేందుకు వచ్చిన పర్యాటకులు సైతం.. ఎక్కడైనా ఈ గోల్డెన్ బాబు కనిపిస్తే.. అతడిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడతారు. దీంతో శ్రీనివాస్ బాగా ఫేమస్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Gold, VIRAL NEWS, Visakhapatnam, Vizag