హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విశాఖ పోలీస్ వినూత్న కార్యక్రమం.. ఇకపై నేరుగా ఫోన్ చేయవచ్చు

విశాఖ పోలీస్ వినూత్న కార్యక్రమం.. ఇకపై నేరుగా ఫోన్ చేయవచ్చు

విశాఖ పోలీసుల వినూత్న కార్యక్రమం

విశాఖ పోలీసుల వినూత్న కార్యక్రమం

విశాఖపట్నం (Visakhapatnam) పోలీస్ శాఖలో నూతన ఉరవడిని సృష్టించేందుకు శ్రీకారం చుడుతూ విశాఖ నగర పోలీసు కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ (Vizag Police Commissioner) నిర్ణయం తీసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam | Andhra Pradesh

Setti Jagadeesh, News 18, Visakhapatnam

విశాఖపట్నం (Visakhapatnam) పోలీస్ శాఖలో నూతన ఉరవడిని సృష్టించేందుకు శ్రీకారం చుడుతూ విశాఖ నగర పోలీసు కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ (Vizag Police Commissioner) నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సత్వరమే న్యాయం చేయాలని లక్ష్యంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల అందరి నుంచి మంచి స్పందన వస్తుంది. దీనిలో భాగంగానే సిపి మరో సరికొత్త వ్యూహానికి తెర లేపారు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 3 శుక్రవారం నేటి నుండి డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు ముందుకు పోలీసులు అనే ఈ కార్యక్రమం సిపి సరికొత్త వ్యూహమనే చెప్పొచ్చు. ఈ కార్యక్రమం ద్వారా విశాsఖ ప్రజలకు నేరుగా పోలీసు కమిషనర్ కు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కలుగుతుంది. నేడు ఉదయం 11 నుండి 12 గం.ల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు కమిషనర్ కు ఫోన్ చేసే అవకాశం కలుగుతుంది. డయల్ నెంబర్ 08912523408 కి ఫిర్యాదు చేసే విధంగా ఏర్పాట్లు చేసారు. బాధితులు ఫిర్యాదు మేరకు నేరుగా అధికారులతో అక్కడ నుండే సంబంధిత అధికారులకు ఫోన్ కాల్ ద్వారా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా ప్రజల నుండి సమస్యలు తెలుసుకునేందుకు గంట సేపు సమయాన్ని సిపి శ్రీకాంత్ కేటాయించారు. ఇప్పటికే వాట్సప్ , 100 డయల్ ఫిర్యాదుల ద్వారా అత్యవసర కేసులను పరిష్కరిస్తున్నారు.

ఇది చదవండి: ఆ జిల్లాలో రోడ్డెక్కితే కేసే.. ఒక్కనెలలో ఏకంగా 10వేల కేసులు

సిపి ఈ కార్యక్రమాన్ని చేపడుతుండడంతో పలువురు అధికారుల్లో ఉత్కంఠ పెరిగింది. పిర్యాదుదారులు ఎవరి మీద ఎటువంటి ఫిర్యాదు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు, భూ కబ్జాలు, వేధింపులు, బెదిరింపలు వంటి కేసులకు సంబంధించి బాధితులు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో ఫిర్యాదులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

అవే కాకుండా ఇతర సమస్యలపై కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో పలువురు అధికారులపై కూడా బాధితులు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. చాలా మందికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందనే విషయం స్పష్టమవుతుంది. కానీ కొందరికి మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఏ అధికారి పైన లేదా మరొకరు పైన ఎటువంటి ఫిర్యాదులు వెళ్తాయో అనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమం ప్రతి నెల మొదటి శుక్రవారం గంట పాటు వుంటుంది అని ప్రతి ఒక్కరూ ప్రజలు ఉపయోగించుకోవాలని నగర పోలీసు కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు