Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VIZAG POLICE ARRESTED GANJA SUPPLIERS TO SELL GANJA ON CURRY PACKETS NGS VSP

Curry Packet: ఈ కర్రీ ప్యాకెట్ చాలా ఖరీదు వేయి రూపాయలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఈ కర్రీ ప్యాకెట్ ఖరీదు వేయి రూపాయలు

ఈ కర్రీ ప్యాకెట్ ఖరీదు వేయి రూపాయలు

Curry Packet: అక్కడ కర్రీ ప్యాకెట్లు చాలా ఖరీదు.. అది కూడా పదులు.. వందలు కాదు.. వేయి రూపాయలు.. అవును మీరు వింటున్నది నిజమే.. ఏంటి మరీ ఇంతకరీధు అనుకుంటున్నారా..? విషయం తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..? ఎందుకో తెలుసా..?

  P Anand Mohan, News18, Visakhapatnam

  Curry Packet: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఇటీవల మత్తు పదార్దాల స్మగ్లింగ్ జోరుగా పెరిగింది. ముఖ్యంగా విశాఖ కేంద్రగానే దందా సాగుతోంది. అదే స్థాయిలో నిఘా గట్టిగా ఉండడంతో.. మత్తు మాఫియా కూడా రూటు మార్చింది. విశాఖ (Visakha)లో మత్తు ముఠాలు బరితెగిస్తున్నాయి. విద్యార్థులు యువకులు టార్గెట్గా చేసుకుని.. మత్తు సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. నగర పరిధిలో పోలీసు నిగా పెరగడంతో.. వారి కంట పడకుండా ఉండేందుకు.. పుష్పా సినిమా ను మంచిన తెలివి తేటలతో సరికొత్త ఆస్త్రాలను వినియోగిస్తున్నారు. తాజాగా బిర్యానీ ప్యాక్ చేసే కవర్లలోను, కర్రీ పాయింట్లో ఇచ్చే కవర్ల రూపంలోనూ ఆన్లైన్ పార్సల్ మాదిరిగా ప్యాకింగ్ లో పెట్టి.. గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని అమ్మేస్తున్నారు కేటుగాళ్లు.. అది కూడా కాలేజీ విద్యార్థులను గుర్తించి వారికి హ్యాండ్ టు హ్యాండ్ సేల్స్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

  ఓ వైపు విశాఖ నగరం అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఐటీ సైతం అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పుడు నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టిన.. మరింతమంది మీ అరెస్ట్ చేసి జైలుకి పంపించినా నిత్యం ఏదో ఒక చోట మత్తుమాఫియా ఆనవాళ్లు బయట పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువకులు విద్యార్థులు టార్గెట్గా చేసుకొని.. మత్తు ముఠా లు బరితెగిస్తున్నాయి. రోజుకో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. గంజాయిని సప్లై చేసేస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.  తాజాగా విశాఖ నగర పరిధిలో.. డ్రగ్స్ గంజాయి పై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిఘా పెంచడంతో సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు కేటుగాళ్ళు. పోలీసులు, నిఘా వర్గాలకు చిక్కకుండా.. ఆహార పదార్థాలు మాదిరిగా పార్సిల్ చేసి అమ్మేస్తున్నారు. బిర్యానీ కర్రీస్ ప్యాకింగ్ చేసే.. అల్యూమినియం ఫాయిల్ కవర్లను గంజాయి సేల్ కోసం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ నే ఇంట్లో పెట్టుకుని.. ప్యాకెట్లు తయారు చేసేస్తున్నారు.

  ఇదీ చదవండి : ఆ నియోజకవర్గం టీడీపీలో గందరగోళం.. మహనాడు తరువాత స్పీడ్ కు బ్రేక్ లు.. దుబాయ్ పేరుతో రచ్చ?

  గంజాయి రవాణాపై కూపీ లాగిన టాస్క్ పోర్స్ పోలీసులకు.. రెండు వేరు వేరు చోట్ల యువకులు పట్టుబడ్డారు. వారిని విచారిస్తే.. షాపింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంవిపి కాలనీ రైతు బజార్ ప్రాంతంలో.. గంజాయి అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేశారు. కటారి చెన్నకేశవ, గాలి విష్ణువర్ధన్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఓ ఇంట్లో.. సోదాలు చేసేసరికి అల్యూమినియం ఫాయిల్ కవర్లలో ప్యాక్ చేసిన 113 ప్యాకెట్లు గుర్తించారు. వాటిలో 60 నుంచి 70 గ్రాములు చొప్పున గంజాయిని ప్యాక్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వాటితోపాటు తూనిక మిషన్, ప్యాకింగ్ చేసే మరో మెషిన్ తో పాటు కర్రీస్ బిర్యానీ ప్యాకింగ్ చేసే అల్యూమినియం ఫాయిల్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.

  ఇదీ చదవండి : అధికార వైసీపీలో ఆగని రాజకీయ రచ్చ.. రాజోలులో బొంతు వర్సెస్ రాపాకలో నెగ్గేదెవరు? అధిష్టానం ఓటెవరికి?

  ఆ మరుసటి రోజే మద్దిల పాలెం చైతన్య నగర్ లో.. గుర్రం నాగేశ్వరరావు రాయుడు అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించారు. దీంతో ఆన్లైన్ ప్యాకింగ్ తరహాలో గంజాయిని ప్యాక్ చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. నాగేశ్వరావు రాయుడు గంజాయి ప్యాకెట్ల అమ్మకాల కోసం ఏకంగా ఓ కుటిర పరిశ్రమలా పెట్టుకున్నాడు. ఆన్లైన్ లో వాక్యూమ్ సీలింగ్ మిషన్ ను కొనుగోలు చేసి, బాబు రాపర్స్ ఎన్విలప్స్ సిద్ధం చేసుకున్నాడు. ట్రాన్స్పరెంట్ కావాలని కూడా వినియోగించి ఆన్లైన్ ప్యాకింగ్ లో తరహాలో పెట్టి గంజాయిని అమ్మేస్తున్నాడు. గంజాయి వాసన రాకుండా ఉండేందుకు.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్యాకింగ్ లో ఉన్న గాలిని ప్రత్యేక యంత్రం ద్వారా తీసేస్తున్నాడు.

  ఇదీ చదవండి: ఏపీ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై ఎంపీ రఘురామ అనుచరల దాడి.. ఐదుగురిపై కేసు నమోదు

  ఇలా వాసన, అనుమానం రాకుండా ప్యాక్ చేసిన గంజాయిని.. నగరంలోని యువకులు విద్యార్థులు టార్గెట్గా చేసుకొని అమ్మేస్తున్నారు ఈ కేటుగాళ్లు. గతంలో కాలేజీ చదువుకున్న విద్యార్థులు కస్టమర్లు గా.. స్నేహితులే అమ్మకందారులుగా ఉంటూ మొత్తం నెట్వర్క్ నడిపించేస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ వెయ్యి రూపాయలు చొప్పున అమ్మేస్తున్నారు. కిలో గంజాయిని 3 నుంచి ఐదు వేలకు కొనుగోలు చేసి.. వాడిని ప్యాకెట్ల రూపంలో మార్చి 15 నుంచి 20వేలకు అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నమ్మకం పరిచయం ఉన్నవారికి మాత్రమే గంజాయి సప్లై చేస్తున్న ఈ కేటుగాళ్లు.. వారి ద్వారానే కొత్త వారి కూడా నెట్వర్క్ లో లాగుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు