Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VIZAG PEOPLE FACING PARKING PROBLEMS AT RAITHU BAJAAR VSJ NJ ABH

Vizag: సీతమ్మధార రైతుబజార్‌ను వేధిస్తోన్న పార్కింగ్‌ ప్రాబ్లమ్‌.! కొనుగోలుదారుల సమస్య తీరేదెప్పుడు!

సీతమ్మదార రైతు బజార్

సీతమ్మదార రైతు బజార్

సీతమ్మధార రైతు బజార్‌కు వచ్చే నగరవాసులకు పార్కింగ్ సమస్య ఎక్కువైంది.. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మార్కెట్‌కు అధిక సంఖ్యలో నగర వాసులు కూరగాయలు కొనేందుకు వస్తూ ఉంటారు. కానీ వాహనాల మీద వచ్చిన వాళ్లకు పార్కింగ్‌కు ప్లేస్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (Setti Jagadesh, News 18, Vizag)

    సీతమ్మధార రైతు బజార్‌కు వచ్చే నగరవాసులకు పార్కింగ్ సమస్య ఎక్కువైంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మార్కెట్‌కు అధిక సంఖ్యలో నగర వాసులు కూరగాయలు కొనేందుకు వస్తూ ఉంటారు. కానీ వాహనాల మీద వచ్చిన వాళ్లకు పార్కింగ్‌కు ప్లేస్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

    విశాఖపట్నం జిల్లా సీతమ్మధార రైతు బజార్‌లో రైతులు పండించిన కూరగాయలను వినియోగదారులకు నేరుగా విక్రయిస్తారు. రైతు బజార్‌లో రైతులకు, వినియోగదారుల నడుమ మధ్యవర్తుల జోక్యం ఉండదు. రైతులు, వినియోగదారులు ఇద్దరూ మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా.. నేరుగా తమకు కావాల్సినవి తాజా కూరగాయలు, పూలు, పళ్లు కొనేందుకు రైతుబజార్‌లు ఏర్పాటు చేసిన పద్ధతి బాగుంటుందని నగరవాసుల అభిప్రాయం.

    పండగలు వచ్చినా, పంక్షన్‌లు వచ్చినా, వీకెండ్స్‌ అయినా సీతమ్మధార రైతుబజార్‌ కిక్కిరిసిపోతుంది. అంత ఫేమస్‌ అయిన ఈ రైతుబజార్‌కు ఇప్పుడు పార్కింగ్‌ సమస్య వేధిస్తోంది.

    విశాఖపట్నంలో బహిరంగ మార్కెట్ కన్నా రైతు బజార్లలలో కూరగాయల ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. దీంతో రైతు బజార్లలకు జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనిలో భాగంగానే విశాఖపట్నంలోని సీతమ్మధార రైతు బజార్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దీంతో మార్కెట్‌కి వచ్చే నగరవాసులకు వాహనాల పార్కింగ్ సమస్య ఎక్కువైంది.

    ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మార్కెట్‌కి అధిక సంఖ్యలో నగరవాసులు వస్తూ ఉంటారు. కానీ వారు వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్‌కి ఎంతమంది వచ్చినా వాహనాలన్నీ రోడ్డుపైనే పెట్టవలసి వస్తుంది దీంతో ఆ మార్గం రాకపోకలు నిలిచి సమస్యగా మారింది.

    వ్యవసాయ ఉత్పత్తులు తాజాగా, తక్కువధరకు రైతుబజార్‌లో అందుబాటులో ఉన్నాయి. రైతులు కూరగాయలను తమ పొలంలో స్వయంగా పండించి విక్రయించటం ద్వారా దళారుల ప్రభావం ఉండదు. దీని వల్ల ఇతర కూరగాయల మార్కెట్లలో ధరల కంటే రైతు బజారులో ధరలు తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఈ రైతు బజార్ విధానం ఇటు పండించే రైతుకు, అటు కొనుగోలు చేసే కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో ఇతర ప్రదేశాల్లో ఎన్ని మార్కెట్లు ఉన్న రైతు బజార్ వైపు విశాఖ నగరవాసులు అంతా మొగ్గు చూపుతూ ఉంటారు.

    పార్కింగ్ లేదు కదా అని రోడ్డు మీద పార్కింగ్ చేస్తే పోలీసులు ఫైన్ వేసి చలనాలు విధిస్తున్నారు. దీంతో ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజారుకి వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సమస్య లేకుండా చేయాలని పలుమార్లు స్థానికులు, ప్రజాసంఘ నాయకులు జీవీఎంసీ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది.

    రైతు బజార్లకు వచ్చే వినియోగదారులకు ఫ్రీ పార్కింగ్ జోన్ ఏర్పాటు చేస్తే ఈ ఇబ్బందులు ఉండవని స్థానికులు అంటున్నారు. ఇలా నగరవాసులకు కొన్ని సౌకర్యాలను అందించడం ద్వారా..అధిక సంఖ్యలో ప్రజలు రైతు బజార్లకి వచ్చి కొనుగోలు చేయడం ద్వారా అటు తమకు ఆర్థికంగా బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు