Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VIZAG NEWLY BRIDE DEATH CASE MYSTERY REVEL POLICE SAID MAIN REASON SHE NOT INTERESTED MARRIAGE NGS VSP

Bride Death Case: నవ వధువు మృతి కేసులో వీడిన మిస్టరీ.. విచారణలో సంచలన విషయాలు

నవ వధువు మరణంపై ఎన్నో అనుమానాలు

నవ వధువు మరణంపై ఎన్నో అనుమానాలు

Bride Death Case: పెళ్లి పీటలపై జీలకర్రా బెల్లం పెడుతుండగా? నవ వధువు కుప్పుకూలిన విషాధ ఘటన వెనుక సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి..? ఇంట్లో వాళ్లు చెప్పినవి అన్నీ అవాస్తవాలే అని తేలింది.. మరి ఎందుకు ఆ వధువు తల్లిదండ్రుల ఆ విషయాన్ని పోలీసుల దగ్గర ఎందుకు దాయాల్సి వచ్చింది.. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు.

ఇంకా చదవండి ...
  Bride Death Case: ఇటీవల పెళ్లి పీటలపై నవ వధువు మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనగా మారింది. అది కూడా సరిగ్గా సుముహూర్తానికి.. వరుడు వధువు తలపై జీలకర్రా బెల్లం పెడుతుండగా.. కుప్పకూలింది. దీంతో ఒత్తిడి, అలసట కారణంగా గుండెపోటు (Heart Attack)కు గురై ఉంటుందని అంతా అనుకున్నారు. అప్పటి వరకు నవ్వులు, ముచ్చట్లు, మంగళవాయిద్యాలతో సందడిగా కనిపించిన ఆ పెళ్లిమండపం లో విషాదం నెలకొంది. ఆ షాక్ నుంచి అంతా తేరుకుని ఆస్పత్రికి తరిలించారు.. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు చెప్పడంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడ (Madhuravada)లో చోటు చేసుకుంది. అయితే ఆమె హ్యాండ్ బ్యాగ్ లో గన్నేరు పప్పు ఆనవాళ్లు ఉండడం.. పోస్టుమార్టం నివేదికలో తక్కువ మోతాదులో పాయిజన్ వెళ్లినట్టు రావడంతో.. ఇష్టం లేని పెళ్లి (Marriage) చేయడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి (Suicide Attempt) ఉంటుందని అనుమానించారు. అయితే వధువు తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఆమె ఇష్టం తోనే పెళ్లి చేస్తున్నామని చెప్పారు. ఆమెకు ఎలాంటి ఎఫైర్లు లేవని చెప్పారు.. అయితే ఆమె ఫోన్ డాటా అంతా డీలీట్ చేసి పోలీసులకు ఇవ్వడంతో.. అనుమానాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ ఘటనలో మిస్టరీ వీడింది. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  వధువు సృజన (Srujana) కు వరుడు శివాజీ (Shivaji)తో పెళ్లి ఇష్టం లేదని, పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. సృజన ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. ఆమె ఫోన్ డాటా ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు. సృజన గత ఏడేళ్లుగా పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని పోలీసుల విచారణలో తెలిసింది.

  ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో జనసేనకు మెగా మద్దతు.. అభిమానుల ప్రత్యేక సమావేశం.. ఏం డిసైడ్ అయ్యారంటే

  సృజన మరణం తరువాత విచారణ మొదలు పెట్టిన పోలీసులు.. ఆమె ఫోన్ ను స్వాధీనంచేసుకొని పరిశీలించారు. సృజన ఫోన్ నుంచి కొన్ని నెంబర్లు, మెస్సేజ్ లు కుటుంబ సభ్యులు డిలిట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. కాగా పోలీసుల విచారణలో భాగంగా కాల్ డయల్ రికార్డర్ తో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

  ఇదీ చదవండి : వాహనదారులకు బంపర్ ఆఫర్.. అక్కడ పెట్రోల్ చాలా ఛీప్.. పోటీ పడి మరి డిస్కౌంట్లు.. మన దగ్గరే..!

  తోకాడ మోహన్ అనే వ్యక్తితో సృజన ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. అమ్మాయిని ప్రేమించాడు కాని వివాహం అనేసరికి వెనుకడుగు వేస్తూవచ్చినట్టు గుర్తించారు. ఎందుకంటే తనకు సరైన ఉద్యోగం లేకపోవడంతో మోహన్ పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడని.. అయితే సరియైన ఉద్యోగం చూసుకోగానే పెళ్లిచేసుకుంటానని సృజనకు హామీ ఇచ్చాడని తెలుస్తోంది. కానీ ఇంతలోనే కుటుంబ సభ్యులు సృజనకు పెళ్లి సంబంధం చూడటం, ముహూర్తాలు పెట్టుకోవటం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. ఇటు మోహన్ పెళ్లి వాయిదా వేస్తుండడం.. అటు తల్లిదండ్రుల ఒత్తిడితో.. ఆమె బలవంతంగా పెళ్లికి సిద్ధమైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ పెళ్లి అంటే తనకు ఇష్టం లేదని.. ఎలాగైనా తనను తీసుకుపోవాలని మోహన్ కు సూచించింది.

  ఇదీ చదవండి : ఆయనకు రాజ్యసభ పదవి వెనుక కేసీఆర్ హస్తం.. గుండు గీయుంచుకుంటాను అంటూ ఛాలెంజ్

  రెండేళ్లు ఆగాలని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని, మంచి ఉద్యోగం రాగానే తీసుకెళ్తానని మోహన్ మళ్లీ అదే మాట చెప్పడంతో.. సృజనకు ఏం చేయాలి తెలియలేదు. ఇదే విషయంపై పెళ్లికి మూడు రోజుల ముందు సృజన ప్రియుడితో ఇన్ స్టా గ్రామ్ లో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి సమయం దగ్గరకు రావడంతో పెళ్లిని ఎలాగైనా ఆపాలనుకున్న సృజన.. ఈ నెల 11న పెళ్లిరోజు విష పదార్థం తీసుకుందని పోలీసులు నిర్ధారించారు. దీంతో సృజన ఆరోగ్యం క్షీణించడంతో పెళ్లి పీటలపైనే కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది అన్నారు. ఇక్కడ సృజన కేవలం పెళ్లిని ఆపాలని భావించింది. కానీ తాను చేసిన పనితో ఊహించని రీతిలో ప్రాణాలను కోల్పోయిందని పోలీసులు విచారణలో తేల్చారు. మరి దీంతో ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. బలవంతంగా పెళ్లికి ఒప్పించారని పోలీసులపై చర్యలు తీసుకుంటారా.. లేక ప్రియుడు పెళ్లిని వాయిదా వేస్తూ ఆమె మరణానికి కారణమయ్యాడని చర్యలు తీసుకుంటారో చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు