VISAKHAPATNAM VIZAG INFOSYS COMPANY WORKS STARTS FROM THIS AUGUST THIS IS THE UPDATE NGS VSP
Infosys in Visakha: ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఐటీ దిగ్గజం.. విశాఖలో ఇన్ఫోసిస్ ముహూర్తం ఎప్పుడంటే..?
విశాఖ ఇన్ఫోసిస్ డేట్ ఫిక్స్
Infosys in Visakha: విశాఖకు మంచి రోజులు వచ్చాయా.. ప్రముఖ ఐటీ దిగ్గజం అడుగు పెట్టేందుకు వడివడిగా అడుగులేస్తోంది. ఇన్ఫోసిస్ వస్తే.. మిగితా కంపెనీలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది..? అయితే ఇన్ఫోసిస్ కార్యక్రమాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి అంటే..?
Infosys in Visakha: విశాఖపట్నం (Andhra Pradesh) కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యాలయం (Infosys Campus) త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే టైర్-2 నగరాల్లో కార్యలయాలు ప్రారంభించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖ నగరాన్ని సైతం ఎంపిక చేసింది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో తొలి కార్యాలయం ఏర్పాటుకు చర్యలు కూడా మొదలు పెట్టింది. దీనిలో సుమారు750 నుంచి800 మంది ఉద్యోగులు పనిచేసేందుకు అనువుగా ఉండేలా విశాఖలో ఓ ప్రైవేట్ భవనంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక్కడ కేవలం విశాఖ వాసులే కాకుండా.. ఉభయ గోదావరి.. ఉత్తరాంధ్ర కు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు విశాఖ నుంచే పనిచేసే అవకాశం కలుగుతుంది. అయితే ఇన్ఫోసిస్ సంస్థ దేశంలో ఇప్పటి వరకు సొంత నిర్మాణాల్లోనే సేవలు అందిస్తుండగా.. తాజాగా నాలుగు ప్రాంతాల్లో తొలిదశలో ప్లగ్ అండ్ ప్లే ద్వారా సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖలో తొలి ప్లగ్ అండ్ ప్లే కార్యాలం విశాఖలో ప్రారంభిస్తోంది.
మరోవైపు ఇన్ఫోసిస్ సంస్థకు స్థల కేటాయింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. ఆగస్టు నుంచే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇన్ఫోసిస్ ముందుగా కార్యకలాపాలు ప్రారంభించటం ద్వారా భవిష్యత్ రోజుల్లో ఎంఎన్సీ సాఫ్ట్వేర్ సంస్థలు కూడా విశాఖ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధరణంగా ఇప్పటివరకు ఇన్ఫోసిస్ సంస్థ మెట్రో నగరాల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. టైర్–2 నగరాల్లో అన్నింటి కంటే విశాఖే ప్రథమ స్థానంలో ఉండడంతో.. ఇక్కడి నుంచి సేవలు అందించేందుకు ఇన్ఫోసిస్ ఆసక్తి చూపిస్తోంది.
విశాఖలో ఓ ప్రైవేట్ భవనంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. విశాఖలో కార్యాలయం ఏర్పాటు వల్ల రాష్ట్రానికి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి దూర ప్రాంతాలకు వెళ్లనవసరం ఉండదు. పశ్చిమ, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు విశాఖ నుంచే పనిచేసే అవకాశం కలగనుంది. కోవిడ్ కారణంగా ప్రస్తుతం అధిక శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నారు.
కోవిడ్ క్రమంగా తగ్గుతుండడంతో మళ్లీ కార్యాలయాలకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులను మెట్రో నగరాలకు రప్పించే కంటే రాష్ట్రంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇన్ఫోసిస్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. అందుకు అనువైన వాతావరణాన్ని కలిపిస్తామని భరోసా కలిగించింది. దీంతో విశాఖ కేంద్రంగా సంస్థ సేవలు అందించేందుకు సంస్థ ఆసక్తి చూపించింది.
అయితే ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ.. భవిష్యత్తులో సంస్థ సేవలు విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థకు స్థల కేటాయింపులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇన్ఫోసిస్ రాకతో విశాఖలో ఐటీ పునరుత్తేజానికి బాటలు పడతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆగస్టు నుంచే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. మున్ముందు మరిన్ని బహుళ జాతి సాఫ్ట్వేర్ సంస్థలు కూడా విశాఖ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.