హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag News: మరో ట్విస్ట్ ఇచ్చిన సాయి ప్రియాంక.. ప్రియుడితో పెళ్లి.. తండ్రికి మెసేజ్..

Vizag News: మరో ట్విస్ట్ ఇచ్చిన సాయి ప్రియాంక.. ప్రియుడితో పెళ్లి.. తండ్రికి మెసేజ్..

రెండో పెళ్లి చేసుకున్న సాయిప్రియ

రెండో పెళ్లి చేసుకున్న సాయిప్రియ

విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్ (Vizag RK Beach) లో అదృశ్యమైన సాయి ప్రియాంక కేసు అనూహ్యమలుపులు తిరుగుతోంది. పెళ్లి రోజు నాడే భర్తకు మస్కా కొట్టి ప్రియుడితో జంప్ అయిన ప్రియాంక.. అధికారులు, పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.

ఇంకా చదవండి ...

విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్ (Vizag RK Beach) లో అదృశ్యమైన సాయి ప్రియాంక కేసు అనూహ్యమలుపులు తిరుగుతోంది. పెళ్లి రోజు నాడే భర్తకు మస్కా కొట్టి ప్రియుడితో జంప్ అయిన ప్రియాంక.. అధికారులు, పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఐతే సాయంత్రానికే మరో బిగ్ షాకిచ్చింది. వైజాగ్ నుంచి నేరుగా బెంగళూరుకు ప్రియుడు రవితో కలిసి వెళ్లిపోయిన ప్రియాంక.. అక్కడ అతడ్ని పెళ్లాడింది. అంతేకాదు రెండో పెళ్లి చేసుకున్న విషయాన్ని తండ్రికి వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పింది. తనకు పెళ్లయిపోయిందని వెతకవద్దంటూ వాయిస్ మెసేజ్ పంపింది. తన గురించి వెతకొద్దని.. ఇష్టపూర్వకంగానే రవితో వచ్చేశానని మెసేజ్ లో స్పష్టం చేసింది ప్రియాంక.

‘నాన్న.. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. నేను రవితోనే ఉన్నాను. నన్నేం రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. ఇష్టప్రకారమే వచ్చేశాం. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిది. దయచేసి నాకోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావు అయినా బతుకైనా రవితోనే ఉంటాను. ప్లీజ్‌ మమ్మల్ని వెతకద్దు ఒకవేళ నా కోసం వెతికితే చనిపోతా. ఇందులో రవి పేరెంట్స్ కి సంబంధం లేదు వారిని ఏమీ చేయొద్దు’ అంటూ బుధవారం తండ్రికి వాయస్ మెసేజ్ పంపింది.


ఇది చదవండి: భర్త, నలుగురు పిల్లల్ని వదిలేసి  15 ఏళ్ల బాలుడితో జంప్.., గుడివాడ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. 


సాయిప్రియకు శ్రీనివాస్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్‌ (Hyderabad)లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్‌ఏడీ దగ్గర ఓ కాలేజీలో సాయిప్రియ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈనెల 25న తమ పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌, ఆయన భార్య సాయిప్రియ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లారు. ఇక్కడి వరకు అంతా హ్యాపీగా సాగినా.. ఆ తరువాతే అనుకున్న ప్లాన్ ప్రకరామే సాయి ప్రియ భర్తకు ట్విస్ట్ ఇచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మొదట ఈ మిస్సింగ్ కేసులో అందరూ మొదట భర్తను అనుమానించారు. అతడే ఏదో చేసి తప్పుడు కేసు పెట్టాడని అనుమానించారు.. కానీ అసలై మాస్టర్ బ్రెయిన్ సాయి ప్రియదే అని.. భర్తను నమ్మించి మోసం చేసిందని గుర్తించారు.

ఇదిలా ఉంటే సాయి ప్రియాంక సముద్రంలో గల్లంతయిందని ఆమె భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో సోమవారం నుంచి నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. ఇటు జీవీఎంసీ అధికారులు, పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆమె కోసం గాలించారు. ఈ మొత్తం సెర్చ్ ఆపరేషన్ కు కోటి రూపాయలు ఖర్చయింది.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Visakhapatnam

ఉత్తమ కథలు