Setti Jagadeesh, News 18, Visakhapatnam
విశాఖపట్నం (Visakhapatnam) లో ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలనాల వసూళ్లకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర తరహాలో వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఎవరిని కూడా వదిలిపెట్టే అవకాశం లేదు. ముక్కుపిండి మరి వసూలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. విశాఖలో ఇప్పటివరకు రూ. 90 కోట్ల పైగా ట్రాఫిక్ చలనాలు పెండింగ్లో ఉన్నాయి. విశాఖలో హైయస్ట్ రికార్డ్ గా ట్రాఫిక్ చాలనాలు పెండింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాటి వసూళ్లకు నేడో రేపో స్పెషల్ రైడ్స్ టీమ్స్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నాయి. పోలీసులు మళ్ళీ ఫోటో గ్రాఫర్ల అవతారం ఎత్తి తమ టార్గెట్లను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఇక నుండి మరింత కఠినం కానున్నట్లు తెలుస్తోంది. ఎంతటి వారైనాసరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు చెబుతున్నారు.
పెండింగ్ చాలనాల పై ఫోకస్ పెట్టిన వాహనదారుల నుండే కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. స్పెషల్ డ్రైవ్తో వసూళ్లు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పెండింగ్ చలానా అధికంగా ఉంటే వాయిదాలుగా కట్టేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హెల్మెట్, సిగ్నెల్స్ జంప్, లైన్ క్రాసింగ్, త్రిబుల్ రైడ్, ఓవర్ స్పీడ్, నో పార్కింగ్ వంటి ద్విచక్ర వాహనాలు కారులు, భారీ వాహనాల పై ఇప్పటివరకు విశాఖలో రూ. 90 కోట్ల పైగా ట్రాఫిక్ చలనాలు పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
ఆ మొత్తాన్ని వాహనదారుల నుంచి నేరుగా కట్టించేందుకు నేడో రేపో ట్రాఫిక్ పోలీసులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వాహనదారులు ఇకపై జాగ్రత్తగా వెళ్లకపోతే ఇక పోలీసులకు చిక్కినట్లే. ఈసారి ఎంతటి వారినైనా సరేఎలాంటి వ్యక్తులైనా సరే వదలకుండా వారి నుంచి పెండింగ్ లో ఉన్న చలానా మొత్తాన్ని కట్టించేందుకు వెనకాడే ప్రసక్తే లేనట్లు తెలుస్తుంది.
ఇక రోడ్లపై ఎక్కడకక్కడ ట్రాఫిక్ పోలీసులు కనిపించడం జరుగుతుంది. ప్రధాన రహదారి కూడళ్ళలోనూ,కీలక ప్రాంతాలలోనూ, తీరం వెంబడి, అలాగే నగరంలోని పలు ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ల పేరిట ట్రాఫిక్ పోలీసులు కనిపించనున్నారు. ఇది వరకట్ల తప్పించుకుని తిరగాలి అంటే అయ్యే పని కాదు. ప్రతి ఒక్క వాహనదారుడు పెండింగ్ లో ఉన్న తమ చలానాలను కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. కాదు కూడదని తప్పించుకుని తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
పెండింగ్లో చలనాలు ఉంటే వాహనదారులు తమంతట తాముగా ఆ చలానాలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే వారిపై కేసులు నమోదు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత ఇక్కడ వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలతో పాటు కారులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాహనాల సంఖ్యం పెరగడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిం అతిక్రమించి వాహనాలు నడుపుతున్నారు. ఈసారి అలా చేస్తే చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Traffic challans, Visakhapatnam