Vizag: ఆటో డ్రైవర్ కుమారుడు.. ఇప్పుడు ఎయిర్​ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్​

గోపీనాథ్

కష్టపడి చదివించిన తల్లిదండ్రులు గర్వించేలా ఎదిగాడు ఓ కుమారుడు. ఆటో నడుపుతూ తనను ప్రోత్సహించిన తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం సా?

  • Share this:
కష్టపడి చదివించిన తల్లిదండ్రులు గర్వించేలా ఎదిగాడు ఓ కుమారుడు. ఆటో నడుపుతూ తనను ప్రోత్సహించిన తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం సాధిస్తూ భారత వైమానిక దళం (ఐఏఎఫ్​)లో ఉన్నత ఉద్యోగం సాధించాడు. నిరంతరం శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరాడు విశాఖపట్టణానికి చెందిన జి.గోపీనాథ్​. ఎయిర్​ఫోర్స్​లో ఫ్లయింగ్ ఆఫీసర్​గా అతడు నియమితుడయ్యాడు. హైదరాబా​లోని దుండిగల్​ ఎయిర్​ఫోర్స్​ అకాడమీలో జరిగిన గ్రాడుయేషన్ కార్యక్రమంలో అతడు బాధ్యతలు చేపట్టాడు.

గోపీనాథ్ తండ్రి సూరిబాబు 25 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అరిలోవాలోని ఎస్​ఐజీ నగర్​లో వీరు నివాసం ఉంటున్నారు. ఆటో డ్రైవర్​గా పనిచేస్తూ ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా గోపీనాథ్​ను సూరిబాబు బాగా చదివించారు. ఎయిర్​ఫోర్స్​లో చేరాలనుకున్న తన కుమారుడిని ప్రోత్సహించారు. దీంతో ఎంతో కష్టపడిన గోపీనాథ్​ ఎయిర్​ ఫోర్స్​లో ఫ్లయింగ్ ఆఫీసర్​గా ఉన్నత స్థానం సాధించాడు. ఈ ఏడాది ఎయిర్​ఫోర్స్​లో ఫ్లయింగ్ ఆఫీసర్​గా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఒకేఒక్కడిగా గోపీనాథ్ నిలిచాడు. తన తండ్రి ధనవంతుడు కాకపోయినా ఎంతో కష్టపడి తనను ఏ స్థాయికి తీసుకొచ్చారని అతడు అన్నాడు. “తల్లిదండ్రులు నాకోసం ఎంతో చేశారు. వారు గర్వపడేలా చేయాలని నేను చాలా కష్టపడ్డా . వారికి ఏదో ఒకటి చేయాలనేదే నా తపన” అని గోపీనాథ్ చెప్పాడు.

ఇంజినీరింగ్ చదివించేందుకు బ్యాంక్ లోన్ తీసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉందని తండ్రి సూరిబాబు చెప్పినప్పటికీ, గోపీ మాత్రం డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తాతలా సైన్యంలో పని చేయాలనే ఆకాంక్షతో డిగ్రీలో చేరాడు. అందుకోసం తొలుత ఎయిర్​ఫోర్స్​లో ఎయిర్​మ్యాన్​గా చేరాడు. అయితే ఆఫీసర్​ కావాలన్న ఆశను మాత్రం కొనసాగించాడు.

ఐఏఎఫ్​లో చేరాక గోపీనాథ్​ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్​ను ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్​లో పూర్తి చేశాడు. దీంతో గతేడాది క్రిప్టోగ్రాఫర్​గా ప్రమోషన్ పొందాడు. అయితే స్టాఫ్ సెలెక్షన్​ కమిషన్ పరీక్షల్లో అర్హత సాధించాకే అతడి నిజమైన కల నెరవేరింది. ఐఏఎఫ్ ఆఫీసర్​గా ఉద్యోగం సాధించాడు. తన సోదరుడు ఉన్నత ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారని గోపీనాథ్ సోదరి గౌరి చెప్పారు. ఎయిర్​ఫోర్స్ అకాడమీలో జరిగిన కార్యక్రమాన్ని తామంతా లైవ్​లో వీక్షించామని చెప్పారు.

“ఐఏఎఫ్​లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని మా సోదరుడు ముందు నుంచి ఆకాంక్షించేవాడు. పదో తరగతిలో ఉన్నప్పటి నుంచే అతడు ఎయిర్​ఫోర్స్​లోకి వెళ్లాలనుకున్నాడు. ఏదో ఒకరు రోజు ఆఫీసర్ అవుతానన్న నమ్మకంతోనే అతడు మొదట ఎయిర్​మన్​గా చేరాడు. మొత్తానికి లక్ష్యాన్ని సాధించాడు” అని గౌరీ అన్నారు.
First published: