Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM VISAKHPATNAM POLICE ARRESTED THEFT GANG WHO ROBBED BIKE WITH PIN IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

Vizag News: పిన్నిస్ ఉంటే చాలు..? ఎలాంటి బైక్ తాళమైన తుస్సే..? వీళ్లది మాములు టాలెంట్ కాదు..!

విశాఖలో బైక్ దొంగల ముఠా అరెస్ట్

విశాఖలో బైక్ దొంగల ముఠా అరెస్ట్

Visakhapatnam: పిన్సిస్. ఇది చాలా చిన్న వస్తువు. కానీ.. ఇదే వస్తువు దాదాపు 30 బైక్ లు మాయం కావడానికి సహకరించింది. ఇద్దరు దొంగలు పిన్నిస్ లతో బైక్ లు మాయం చేశారు. చోరకళ చూపించి బైక్ లు చోరీ చేశారు.

    P Anand Mohan, News18, Visakhapatnam

    పిన్సిస్. ఇది చాలా చిన్న వస్తువు. కానీ.. ఇదే వస్తువు దాదాపు 30 బైక్ లు మాయం కావడానికి సహకరించింది. ఇద్దరు దొంగలు పిన్నిస్ లతో బైక్ లు మాయం చేశారు. చోరకళ చూపించి బైక్ లు చోరీ చేశారు. గతంలో ఉన్న నేరానుభవం.. జైల్లో సహచర ఖైదీల నుంచీ నేర్చుకున్న చోరీ పాఠాన్ని కరెక్ట్ గా అమలు చేశారు. ఫలితంగా 30 బైక్ లు కొట్టేశారు. ఎంత చేసినా.. పోలీసుల నుంచీ తప్పించుకోలేకపోయారు. చివరికి తాము కొట్టేసిన బైక్ లతో పాటు పోలీసులకు దొరికిపోయారు. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. విశాఖ జిల్లా పాయకరావుపేటలో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. అదేదో ఇంట్రెస్టింగ్ విషయం ఉందన్నారు పోలీసులు.

    ఇందులో ఇంత ఆసక్తికర అంశం ఉంటుందని అక్కడికి వెళ్లేదాకా ఎవరికీ తెలియదు. ఎంత బలమైన, ఖరీదైన బైక్ అయినా సరే పిన్నిస్ తో ఓపెన్ చేసే టెక్నిక్ ఉన్న చోరుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఇక్కడ చిన్న డెమో కూడా ఇచ్చారు. ఇందులో ఇద్దరు నిందితుల్ని చూపించారు. వారిద్దరు చాలా తెలివిగా బైక్ తాళాలు లేకుండా బైక్ లు మాయం చేస్తున్నారు. హ్యాండిల్ లాక్ ను బలంగా చేత్తో తిప్పుతూనే.. తాళాన్ని పిన్నిస్ సాయంతో తొలగిస్తారు. అక్కడ కొన్ని వైర్లు కూడా తెగిపోతాయి. అదే పిన్నిస్ తో వైర్లను కలిపేసి.. బైక్ ను స్టార్ట్ చేస్తారు. ఈ మాత్రం టెక్నిక్ తోనే వాళ్లు బైక్ లు మాయం చేస్తారు.

    ఇది చదవండి: భార్య తరచూ పుట్టింటికి వెళ్తుందని అనుమానించాడు.. అక్కడితో ఆగాడా..!


    నిందితులు.. ఇద్దరూ పాత నేరగాళ్లే. పలు నేరాల్లో జైలు జీవితం గడిపారు కూడా. అదే వీళ్లకి ప్లస్.. మైనస్ కూడా అయ్యింది. వీరితో పాటు ఉన్న సహచర ఖైదీల నుంచీ ఈ పిన్నిస్ టెక్నిక్ నేర్చుకున్నారని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 30 బైక్ లు వీళ్లు మాయం చేశారు. ఇందులో 24 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్ని అరెస్టు చేసి.. తమ స్టైల్లో విచారిస్తే.. మొత్తం వివరాలు బయటకు వచ్చాయి. నిందితులు దాదాపు ఏడాదినుంచీ తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో ఉన్న క్రైం ట్రాక్ ఆధారంగా కూడా కేసు పరిష్కారం అయ్యిందని క్రైం పోలీసులు చెబుతున్నారు.

    ఇది చదవండి: వితంతువుపై కన్నేసిన కీచకుడు.. అతడికే సపోర్ట్ చేసిన తల్లి.. చివరకు ఏమైందంటే..!


    నాతవరంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. బంధువల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తన బైక్ మాయమైనట్లు గుర్తించారు. ఇది దొంగల పనే అని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత విచారణలో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ఈ బైక్ తో పాటు చాలా బైక్ లు ఆ ఇద్దరే మాయం చేశారని అర్ధమైంది. విశాఖకి చెందిన ఉలవల రాజేష్ బాబు, తూర్పుగోదావరికి కి చెందిన ఉండ్రు నాగరాజు ఈ మొత్తం నేరాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. విచారణలో మొత్తం 24 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తొమ్మిది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లే ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ మొత్తం చోరీలు చేశామని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Bike theft, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు