హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: విశాఖ రాజధానిగా ఏపీ పరిపాలన.. ఎప్పటి నుంచంటే.. మంత్రి అమర్‌నాథ్ క్లారిటీ

Visakhapatnam: విశాఖ రాజధానిగా ఏపీ పరిపాలన.. ఎప్పటి నుంచంటే.. మంత్రి అమర్‌నాథ్ క్లారిటీ

మంత్రి అమర్‌నాథ్

మంత్రి అమర్‌నాథ్

Visakhapatnam: పరిపాలన వికేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో.. మూడు రాజధానుల నినాదాన్ని వైసీపీ నేతలు బలంగా వినిపిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని.. అంటే సెక్రటేరియెట్ ఏర్పాటువుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

మూడు రాజధానులపై (AP Three Capitals) తగ్గేదే లేదంటోంది ఏపీ ప్రభుత్వం. విశాఖపట్టణం కేంద్రంగానే పరిపాలన కొనసాగిస్తామని పదే పదే స్పష్టం చేస్తోంది. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా.. అమరావతి (Amarnath) రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏపీ పరిపాలన రాజధాని విశాఖే అని.. అక్కడి నుంచే పాలన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వం తెగేసి చెబుతోంది.  తాజాగా ఏపీ ఐటీశాఖ మంత్రి అమర్‌నాథ్ (Minister Amarnath) మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లోనే విశాఖపట్టణం నగరం.. ఏపీ పరిపాలన రాజధాని అవుతుందని అన్నారు. అంతేకాదు పలు టెక్ కంపెనీలు కూడా ఏపీకి రాబోతున్నాయని తెలిపారు.

AP Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.25వేల జీతంతో జాబ్స్ .. అర్హతలివే.

పరిపాలన వికేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో.. మూడు రాజధానుల నినాదాన్ని వైసీపీ నేతలు బలంగా వినిపిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని.. అంటే సెక్రటేరియెట్ ఏర్పాటువుతుంది. అమరావతిని శాసన రాజధానిగా చేస్తారు. అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు.  ఇక కర్నూలులో న్యాయ రాజధాని  చేయాలని చేస్తారు. అంటే ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు  చేయాలని భావిస్తున్నారు. ఇలా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు చేయడం వల్ల.. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది.  ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు.

AP Employess Fight: ఉద్యమబాటలో ఏపీ ఉద్యోగులు.. సంఘాల మధ్య చిచ్చు పెడుతోంది ఎవరు..?

ఐతే ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అమరావతిలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలనే పూర్తి చేయని వారు.. మూడు కొత్త రాజధానులను ఎలా కడతారని విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే.. ఏపీకి రాజధాని లేకుండా కాలయాపన చేస్తున్నారని... ఆరోపిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించి.. ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ , జనసేనతో పాటు బీజేపీ కూడా ఇదే వాదిస్తోంది. ఇటీవలే ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ సైతం అమరావతికే జై కొడుతోంది.

కాగా, ఏపీ మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.  అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  దానిపై విచారించిన సుప్రీంకోర్టు...  కాలపరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై గత నవంబర్‌లో స్టే విధించింది. అంతేకాదు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది.  ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా .? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా ..? అని ప్రశ్నించింది.  అంతేకాదు రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారని ఏపీ ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు