హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: చెల్లి చెల్లి అంటూనే ఆ పని చేశాడు? టిక్ టాక్ స్టార్ కేసులో ట్విస్టులు. భార్గవ్ బాధితులు ఎందరో

Andhra Pradesh: చెల్లి చెల్లి అంటూనే ఆ పని చేశాడు? టిక్ టాక్ స్టార్ కేసులో ట్విస్టులు. భార్గవ్ బాధితులు ఎందరో

టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు

టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు

అన్న చెల్లెలి అనుబందం చాలా పవిత్ర బంధం. కొందరు కామాంధులు ఆ బంధానికి అర్థం మార్చేస్తున్నారు. టిక్ టాక్ యాప్ ద్వారా వచ్చిన క్రేజ్ ను తన కోరికలు తీర్చుకునేందుకు వాడుకున్నాడు భార్గవ్. ఇప్పటికే అరెస్ట్ అయిన భార్గవ్ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెసుకున్న దిశా పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. టిక్ టాక్ వీడియోల తో వెలుగులోకి వచ్చిన భార్గవ్.. అదే పేరుతో బాలికపై అత్యాచారం చేసినట్టు ఇటీవల ఫిర్యాదు అందింది. ఈ కేసులో టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు.

  తాజాగా అతడి కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. అతడి బాధితుల లిస్టులో చాలామంది యువతులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. అయితే  చెల్లి చెల్లి అని పిలుస్తూనే 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు భార్గవ్ పై బాలిక తల్లి ఆరోపణలు చేసింది. దీనిపై విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా భార్గవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్.. ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. టిక్ టాక్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

  అలా అతడికి మంచి పేరు వచ్చిన క్రమంలో విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. టిక్ టాక్ వీడియోలపై ఆ బాలికకూ ఆసక్తి ఉండడంతో తరచూ మాట్లాడుకునేవారు. అలా పరిచయం అయిన భార్గవ్ ను బాలిక అన్నయ్య అని పిలిచేది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. చెల్లి అని పిలుస్తుండడంతో భార్గవ్‌తో ఆ బాలిక మరింత స్నేహంగా ఉండేది అంటున్నారు. అదే అదనుగా భావించిన భార్గవ్ ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించాడని ఫిర్యాదు చేశారు.

  భార్గవ్ మాటలను ఆ బాలిక గుడ్డిగా నమ్మింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. పలుమార్లు కలిశారు. ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ క్రమంలో ఇటీవల బాలికలో వస్తున్న మార్పులను గమనించిన ఆమె తల్లి.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో ఆ బాలిక నాలుగు నెలల గర్భిణీ అని తెలిసి షాక్ గురయ్యారు. అసలేం జరిగిందని ఆమె అడగ్గా.. జరిగిన విషయాన్ని తన తల్లికి బాలిక వివరించింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. భార్గవ్ ను రిమాండ్ కు తరలించారు. తాను చేసిన తప్పును భార్గవ్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

  నిందితుడు భార్గవ్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దిశ పోలీసులు అతనిని రిమాండ్‌కు తరలించారు. టిక్ టాక్ స్టార్ హోదాని భార్గవ్ దుర్వినియోగం చేస్తూ అమాయక యువతులను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ బాలిక మాత్రమే కాదు. టిక్ టాక్ పై మోజున్న కొందరు అమ్మాయిలు భార్గవ్ ని ఆశ్రయించారు. వారిపై భార్గవ్ కన్నేశాడు. టిక్ టాక్ లో పెద్ద స్టార్ చేస్తానని, పాపులర్ చేస్తానని నమ్మించి మభ్యపెట్టి యువతులను లోబర్చుకున్నట్టు విచారణలో పోలీస్లు గుర్తించి నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.

  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Tik tok, Visakha, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు