Vizag Steel Plant: ఓ వైపు దేశానికి ఊపిరి పోస్తోంది. ఇక కోవిడ్ కేర్ సెంటర్ గా మారుతోంది. సాహో విశాఖ స్టీల్.

కోవిడ్ కేర్ సెంటర్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్

మొన్నటి వరకు సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదం మారుమోగింది. ఆ నినాదం ఒక్క ఏపీకే పరిమితం అయ్యింది. కానీ ఇప్పుడు జయహో స్టీల్ ప్లాంట్ అంటోంది యావత్ భారతం. అందుకు కారణం కరోనా కష్టకాలంలో లక్షాలది మందికి ఊపిరి అందిస్తోంది. తాజాగా స్టీల్ ప్లాంట్ లో వేయి పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు కానుంది.

 • Share this:
  ఆంధ్రుల హక్కుగా గుర్తింపు పొందిన విశాఖపట్నం స్లీల్ ప్లాంట్ (visakhapatnam steel Plant)ఇప్పుడు దేశం గర్వపడేలా చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయంతో తన ఊపిరి తీసేస్తుంటే.. కరోనా విపత్కర కాలంలో అన్ని రాష్ట్రాలకు ఊపిరి అందిస్తోంది.  ఆక్సిజన్ (oxygen) అందక కరోనా మరణాలు పెరుగుతున్న వేళ.. నేనున్నాను అంటూ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఒక రోజకు దాదాపు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో మరే సంస్థ ఇంత భారీగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఒడిశా, మహారాష్ట్ర లాంటి రాష్టాలకు సైతం ఆక్సిజన్ ను అందిస్తూ అందరినీ అక్కున చేర్చుకుంటోంది.

  నష్టాల సాకు చూపించి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే.. కష్టకాలంలో కేంద్రం కోరినంత ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ దటీజ్ స్టీల్ ప్లాంట్ అనిపించుకుంటోంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి (megastar chiranjeevi) సైతం దీనిపై కేంద్రం తీరును తప్పు పడుతూ ట్వీట్ చేశారు. విపత్కర సమయంలో దేశమంతా ఆక్సీజన్ లభించక కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్న ప్రస్తుత తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిత్యం 100 టన్నుల మెడికల్ ఆక్సీజన్‌ని (Oxygen crisis) ఉత్పత్తి చేస్తోందని ట్వీట్ లో గుర్తు చేశారు. ఓ స్పెషల్ ట్రెయిన్ విశాఖ ఉక్కు కర్మాగారానికి చేరిందని, అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సీజన్‌ని మహారాష్ట్రకు తీసుకెళ్తుందని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచించి ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కేంద్రానికి చురకలంటించారు. మరి తాజా పరిస్థితులు నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యి ఉంటే.. ఇప్పుడు ఆక్సిజన్ కోసం వారు ఎంత రేటుకు అడిగితే అంత ఇవ్వాల్సి వచ్చేది. ప్రభుత్వం రంగం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మనుషుల ప్రాణాలకు రక్షణ ఇస్తోంది. ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేస్తోంది.

  ఇదీ చదవండి : పది, ఇంటర్ పరీక్షల విజయానికి 15 సూత్రాలు. ఫాలో అయితే మీదే గెలుపు

  తాజాగా స్టీల్ ప్లాంట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులను ఆదుకోవడంలో స్టీల్‌ ప్లాంట్‌ మరో ముందడుగు వేసింది. వెయ్యి పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పడకల తయారీకి స్టీల్‌ ప్లాంట్‌ స్వయంగా శ్రీకారం చుట్టింది. స్టీల్‌ ప్లాంట్‌లోని ఇంజనీరింగ్‌ మరమ్మతుల విభాగం పడకల తయారీని కూడా చేపట్టింది. ఉక్కు నగరంలో పలు ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాట్లు చేయాలని, అక్కడే ఉన్న గురజాడ కళాక్షేత్రంలో 50 పడకల సాధారణ పడకలు, 50 పడకల ఆక్సిజన్‌ పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

  ఇదీ చదవండి : టీడీపీ, బీజేపీలకు బిగ్ షాక్. ఉప ఎన్నిక ఫలితానికి లైన్ క్లియర్

  జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో కొవిడ్‌ కేర్‌లో కరోనా బాధితులకు ఆశ్రయం ఇవ్వనుంది స్టీల్‌ప్లాంట్‌. ఇక్కడ అవసరమైన వైద్య సదుపాయాలతో పాటు ఉచితంగా భోజనం అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా బాధితులకు త్వరలో ఈ వెయ్యి పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అందిస్తూ సామర్థ్యాన్ని చాటుకుంటున్న స్టీల్‌ప్లాంట్‌ ఈ కష్టకాలంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ని ఏర్పాటు చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
  Published by:Nagesh Paina
  First published: