Setti Jagadeesh, News 18, Visakhapatnam
విశాఖపట్నం (Visakhapatnam) లో రోజురోజుకీ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఎవరూ లేరని అణువు చూసుకొని దొంగతనాలకు పాల్పడే ముఠాలు ఎక్కువవుతున్నాయి. పక్కా స్కెచ్.. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా కేవలం 15 నిమిషాల్లోనే భారీ చోరీకి పాల్పడ్డారు. 35 తులాల బంగారం వస్తువులు, రెండు కిలోల వెండి దోచుకుపోయారు. సంచలం రేపిన ఈ సం ఘటన పెందుర్తి మండలం వేపగుంట ముత్యమాంబకాలనీలో గురువారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. ముత్యమాంబకాలనీలో దొగ్గ సన్యాసినాయుడు. గంగమ్మ దంపతుల నివాసం ఉంటున్నారు. సన్యాసినా యుడు వేపగుంటలో షాపు అద్దెకు తీసుకుని కొంతకాలం గా సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. గంగమ్మ అంగ నాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. గంగమ్మ ఉదయం 5 గంటల సమయంలో గుడికి వెళ్లింది.
ఉదయం ఆరుగంటల సమయంలో సన్యాసినాయుడు ఇంటికి తాళాలు వేసి ఆ తాళాలను గేటు బయట ఉన్న చెప్పులో పెట్టి షాపునకు వెళ్లాడు. పూజ ముగించుకుని ఉదయం 8.15 గంటల సమయంలో గంగమ్మ ఇంటికి వచ్చిం ది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో కంగారుపడి లోపలికివెళ్లి చూసింది. చివరిగదిలోని బీరువా తెరచి ఉండటం హటాహుటిన భర్తకు ఫోన్ చేసింది.
హుటాహుటిన సన్యాసిరావు ఇంటికి చేరుకున్నాడు. బీరువా లాకర్ లోని బం గారం, వెండి ఉన్న బ్యాగు కనిపించక పోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం ఏసీపీ పెంటారావు, క్రైం సీఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికిచేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. రంగంలోకి దిగిన క్లూ స్టీమ్ వేలిముద్రలు సేకరించింది.
మొత్తం 35 తులాలు బంగారం, రెండు కిలోల వెండి చోరికి గురైందని సన్యాసి నాయుడు పోలీసులకు: ఫిర్యాదు చేశాడు. తాను సిమెంట్ వ్యాపారం చేస్తుండటం తో పలు కంపెనీలు తాను చేసిన టర్నోవరు గుడ్విల్ బంగారు నాణేలు ఇచ్చారని, వాటితో కలుపుకుని 35 తులాలని పోలీసులకు, మీడియాకు చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam