హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Infosys: ఇన్ఫోసిస్ కు వేగంగా అడుగులు.. త్వరలో విశాఖ నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు

Infosys: ఇన్ఫోసిస్ కు వేగంగా అడుగులు.. త్వరలో విశాఖ నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు

విశాఖలో ఇన్ఫోసిస్ కు వడివడిగా అడుగులు

విశాఖలో ఇన్ఫోసిస్ కు వడివడిగా అడుగులు

Infosys: విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని వైసీపీ కంకణం కట్టుకుంది. కేవలం రాజధానిగా చేయడమే కాదు.. అన్ని విధాలా విశాఖను ముందు స్థానంలో నిలపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ వాసులకు ఇప్పటికే శుభవార్త అందించారు. ఇన్ఫోసిస్ కార్యాలయం విశాఖకు వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Infosys: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ (Infosys) విశాఖ నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. దానికి సంబంధించి అవసరమైన చర్యలను విశాఖ జిల్లా (Visakha District) ప్రభుత్వ యంత్రాంగం చకచకా తీసుకుంటోంది. ఇప్పటికే విశాఖ రుషికొండ (Rushikonda) ఐటీ సెజ్‌ (IT SEZ)లో అక్టోబర్‌ ఒకటిన ఇన్ఫోసిస్‌ శాటిలైట్‌ కార్యాలయం ప్రారంభమైంది కూడా. త్వరలోనే ఈ ఐటీ సెజ్‌ నుంచి ఉద్యోగులు విధులు నిర్వహించడానికి ఇన్ఫోసిస్‌ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టైర్‌-2 నగరాల్లో కార్యలయాలు ప్రారంభించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖ నగరాన్ని సైతం ఎంపిక చేసింది. అందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోంది. ఈ నేపథ్యంలో తమకు అవసరమైన వనరులు, సదుపాయాల గురించి ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు పరిశ్రమల శాఖ, ఆర్టీసీ, పోలీసు, జీవీఎంసీ (GVMC) తదితర అధికారులతో ఇటీవల చర్చించారు. నగరం నుంచి రుషికొండ ఐటీ సెజ్‌కు ఆ సంస్థ ఉద్యోగులు రాకపోకలు సాగించడానికి వీలుగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సాధారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారు. అందువల్ల 24 గంటలూ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. వారి కోరిక, అవసరాలకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించడానికి కూడా తమకు అభ్యంతరం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఐటీ సెజ్‌కు ఎన్ని బస్సుల అవసరం అన్నది ఉద్యోగుల సంఖ్యను బట్టి ఉంటుందని, దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తిగా.. బస్సుల అవసరం ఉంటుందని ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు చెప్పారంటున్నారు. అందుకు కావలసినన్ని బస్సులను నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే భీమిలి వెళ్లే బీచ్‌ రోడ్డు నుంచి ఐటీ సెజ్‌కు వెళ్లే రోడ్డు మరింత మెరుగుపరిచే ప్రయత్నాలు సైతం ముమ్మరం అయ్యాయి. మరమ్మతులు చేపట్టేందుకు జీవీఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అలాగే రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడకుండా ఆ రోడ్డుకు ఇరువైపులా పూర్తి స్థాయిలో వీధి లైట్లను ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి : కళ్లు తెరిచి భక్తులను చూస్తున్న లక్ష్మీదేవి.. కార్తీక మాసాన అమ్మవారి మహిమ అంటూ ప్రత్యేక పూజలు

అలాగే ఐటీ సెజ్‌కు వరకు వెళ్లే దారిలో భద్రత పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను, ఆకతాయిలు, తాగుబోతులు, అల్లరి మూకల ఆగడాలను కట్టడి చేసే చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించారు. ఇప్పటి నుంచే పోలీసులతో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి లోట్లు పాట్లకు అవకాశం లేకుండా..? త్వరలో విశాఖ క్యాంపస్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు కూడా.

First published:

Tags: Andhra Pradesh, AP News, Infosys, Visakhapatnam

ఉత్తమ కథలు