VISAKHAPATNAM VISAKHAPATNAM FISHING HARBOUR NOW FILLED WITH VERITIES OF SEA FOOD AFTER BAN PERIOD FULL DETAILS HERE PRN VNL NJ
Visakhapatnam: మీకు సముద్రపు చేపలంటే ఇష్టమా..? ఇక్కడ చూడండి ఎన్నిరకాల చేపలో.. చూస్తే వదిలిపెట్టరు..!
విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలే చేపలు
Visakhapatnam: గంగమ్మ తల్లిపై ఆధారపడి జీవించే బ్రతుకులువారివి. గంగమ్మ ప్రసాదించే మత్స్యసంపదే వారికి జీవనాధారం. వేట నిషేధం సందర్భంగా గంగపుత్రుల్లో ఒకింత నిస్తేజం నెలకొంటుంది. ఐతే సముద్రంలో చేపల వేటపై పరిమితకాల నిషేధం సత్ఫలితాలనిస్తోంది.
గంగమ్మ తల్లిపై ఆధారపడి జీవించే బ్రతుకులువారివి. గంగమ్మ ప్రసాదించే మత్స్యసంపదే వారికి జీవనాధారం. వేట నిషేధం సందర్భంగా గంగపుత్రుల్లో ఒకింత నిస్తేజం నెలకొంటుంది. ఐతే సముద్రంలో చేపల వేటపై పరిమితకాల నిషేధం సత్ఫలితాలనిస్తోంది. ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో మత్స్యకారులు ఆ 61 రోజుల పాటు వేటను కొనసాగించలేదు. ఈ వేట నిషేధకాలంలో సముద్రంలోని చేపలు పెట్టే గుడ్లు.. పిల్లలుగా మారి పెద్దవవుతున్నాయి. విరామం తర్వాత వేటకు వెళ్లిన విశాఖపట్నం (Visakhapatnam) మత్స్యకారుల వలల్లో రొయ్యలు, టైగర్ రొయ్యలు, కొమ్ము కోనాం చేపలు, పీతలు వంటి పలు రకాల చేపలు పడుతున్నాయి. మత్స్యకారుల వలలకు రకరకాల చేపలు భారీగా లభ్యమవుతుండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
డీజిల్ రేట్ల పెరుగుదలతో అయోమయం
డీజిల్ రేట్లు పెరగడంతో మత్స్యకారులు వేటకు సముద్రంలోకి ఎక్కువరోజులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో చాలా రోజులు వెళ్లి సముద్రంలో ఉండలేకపోతున్నారు. అందుకే వారు వేట కోసం ఒక నిర్దిష్ట దూరాన్ని మాత్రమే ప్లాన్ చేసుకున్నట్లు మత్య్సకారుడు శ్రీనివాస్ తెలిపారు. గత ఏడాది మత్స్యకారులు చాలా నష్టపోయారు. ఈ ఏడాది నష్టాన్ని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అతను వలలో ఎక్కువగా రొయ్యలు మరియు చాలా చిన్న చేపలు పడినట్లు తెలిపారు.
గిట్టుబాధ లేకపోవడంతో డీలా పడుతున్న ఆపరేటర్లు
సముద్ర ఉత్పత్తుల దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ధర లేకపోవడంతో ఆపరేటర్లు డీలా పడుతున్నారు. సముద్ర జలాల్లో వడి తీవ్రత అంతగా లేకపోవడం, వాతావరణం చల్లబడటంతో రొయ్యలు, చేపల ఉత్పత్తుల లభ్యత బాగుంది. వలలు నిండాయన్న ఆనందంతో ఒడ్డుకు సరకు తెచ్చి విక్రయిస్తే ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయని మత్య్సకారులు ఆవేదన చెందుతున్నారు. గత సీజన్ ముగింపు ధరతో పోల్చితే రొయ్యలు రకాలను బట్టి కిలోకు రూ.100 నుంచి రూ.200 వరకు తేడా కనిపిస్తోంది. డీజిల్ రాయితీ 1500 లీటర్ల వరకు మాత్రమే ఇవ్వడం వల్ల తొలి విడతతో తక్కువ రోజులకే వేట ముగించుకొని ఒడ్డుకు చేరుతున్నారు.
గత సీజన్ ముగింపు సమయంలో పలికిన ధర ఇప్పుడు ఉంటే గిట్టుబాటు అయ్యేదంటున్నారు మత్స్యకారులు. గత సీజన్ ముగింపులో టైగర్ రకం కిలో రూ.1100, బ్రౌన్ రూ.450, వైట్ రూ.500ల వరకు పలికింది. కానీ ఇప్పుడు మార్కెట్లో టైగర్ కిలో రూ.900, బ్రౌన్ రూ.350ల చొప్పున పలికింది. వైట్ రకం లభ్యత పెద్దగా లేదు. ప్రస్తుతం రొయ్యల లభ్యత అధికంగా ఉండటంతో ఎగుమతిదారులు కొనుగోలు చేసి ధర పెరిగితే గిట్టుబాటు అవుతుందని మత్య్సకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కసారైనా ఫిషింగ్ హార్బర్ చూడాల్సిందే..!
విశాఖపట్నంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలలో ఫిషింగ్ హార్బర్ ఒకటి. అన్ని సమయాలలో రద్దీగా ఉండే ప్రాంతంఇది. 26 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఫిషింగ్ హార్బర్ విస్తరించి ఉంది. 1976లో ప్రారంభించిన ఈ హార్బర్.. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నియంత్రణలో ఉంది. తూర్పు తీరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ భారతదేశంలోని అతిపెద్ద ఫిషింగ్ హార్బర్లలో ఒకటి. ఇక్కడ నుంచి చూస్తే సముద్రం, భూమి, కొండలు ఒకదానితో ఒకటి కలిసినట్లుగా..కనువిందుచేస్తాయి.
ఫ్రెష్‌గా అప్పుడే బోట్ల నుంచి దించే చేపలెన్నో..!
ఈ మార్కెట్లో అనేక రకాల చేపలు అందుబాటులో ఉంటాయి. మీ కుటుంబ సభ్యులకు నోరూరించే వంటకాన్ని సిద్ధం చేయాలనుకుంటే.., ఇతర సముద్రపు ఆహారంతో పాటు కొన్ని చేపలను ఇంటికి తిరిగి తీసుకెళ్లొచ్చు. బయట మార్కెట్లో కన్నా ఇక్కడ ఫ్రెష్‌గా, తక్కువ ధరకే దొరకడం విశేషం. నగరవాసులు, స్థానికులు ఎక్కువగా అక్కడకు వెళ్లే చేపలు, రొయ్యలు, పీతలు కొనుక్కుంటూ ఉంటారు. రొయ్యలు, టైగర్ రొయ్యలు, కొమ్ము కోణం, పీతలు, కోమిట సంచులు మొదలైన అనేక రకాల సముద్ర ఆహారాలు అందుబాటులో ఉన్నాయి.
టైమింగ్స్:
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ప్రతి రోజు ఎప్పుడైనా మీరువెళ్లొచ్చు. గురువారం రోజు మాత్రం ఈ మార్కెట్ జాతరను తలపిస్తుంది.
అడ్రస్: కురుపం మార్కెట్, జాలరి పేట, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, 530001
ఎలా వెళ్లాలి..?
దాదాపు అందరూ తమ సొంత వాహనాల్లోనే అక్కడకు వెళ్తుంటారు. విశాఖపట్నం బస్టాండ్ నుంచి లోకల్ ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.