• Home
 • »
 • News
 • »
 • andhra-pradesh
 • »
 • VISAKHAPATNAM VISAKHAPATNAM DISTRICT CHODAVARMA MANDAL LAXMIPURAM VILLAGE VICE PRESIDENT DEMAND 10 LAKHS FOR PASS BOOK NGS

Andhra Pradesh: పని అవ్వాలంటే 10 లక్షలు ఇవ్వండి. ఓటుకు నోటు తీసుకోలేదా? ఓ నేత డిమాండ్

పాస్ బుక్ ఆన్ లైన్ చేయాలంటే పది లక్షలు కావాలి

ఓటు వేయడం మన బాధ్యత.. కానీ ఓటు వేయడానికి డబ్బులు తీసుకుంటే.. నాయకులను ప్రశ్నించే అవకాశం కోల్పోతాం.. కోరి కష్టాలు తెచ్చుకునే వాళ్లమవుతాం. అలాంటి అనుభవమే ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామస్తులకు ఎదురైంది? ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

 • Share this:
  ఇటీవల ఏపీలో జరిగిన పంచాయతి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగకపోయినా ప్రధాన పార్టీలు తమ మద్దతు దారులను గెలిపించుకోడానికి సర్వశక్తులు ఒడ్డాయి. ఇక అభ్యర్థులైతే ఎన్నికలో గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. కొన్ని గ్రామాల్లో అయితే ఓటుకు ఐదు వేలు దాక పంచిన ఘటనలు ఉన్నాయి. సాధరణంగా ఎన్నికలు జరిగిన ప్రతి గ్రామంలో ఓటుకు వేయి నుంచి రెండు వేల దాకా డిమండ్ ఉండేది. గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో నగదు ఏరులై పారింది.

  కొన్ని గ్రామాల్లో ఆన్ లైన్ లో కూడా నగదు పంపిణీ జరిగింది. నేరుగా చేతికి డబ్బులు ఇస్తే ప్రత్యర్థులు నిఘా ఉంటుందని.. దానికి తోడు ఓటుకు డబ్బులు ఇచ్చామనే ప్రూఫ్ ఏముంటుందని కొంతమంది భావించారు. అందుకు తమ సన్నిహితుల నుంచి గుగుల్ పే , ఫోన్ పే లాంటి వాటి ద్వారా డబ్బులు పంచారు. ఇలా ఎన్నికల సమయంలో భారీగా డబ్బులు పంపిణీ చేసినవారంతా ఇప్పుడు అదే స్థాయిలో ఓట్లేసిన ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు.

  విశాఖపట్నం జిల్లాలోని ఓ ఉప సర్పంచ్ పాసు పుస్తకాలు చేయించడాకి పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే మరి ఎన్నికల్లో చాలా ఖర్చు పెట్టాను.. ఆ ఖర్చు అంతా మీకు ఇచ్చిందే.. మరి రాబట్టుకోవద్దా అంటూ బహరింగంగానే చెబుతున్నాడు.

  చోడవరం మండలం.. లక్ష్మీపురం గ్రామంలో ఈ వింత అనుభవం ఎదురైంది ప్రజలకు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన మురళీదొర అనే వ్యక్తికి దాదాపు ఏడు ఎకరాల పొలం ఉంది. తన పొలానికి ఆన్ లైన్ పాస్ బుక్ చేయించడానికి ఉప సర్పంచ్ గణపతిని ఆశ్రయించాడు. అదెంతపని చిటికెలో చేయిస్తాను అని చెప్పి ఆ పాసుబుక్కు తనదగ్గరే ఉంచుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్నా ఆ మురళీదొర పని పూర్తి అవ్వలేదు. ఎందుకు తన పని ఆలస్యమవుతోంది త్వరగా చేయమని గణపతిని కోరాడు. అందుకు ఉప సర్పంచ్ ఇచ్చిన సమాధానం చూసి షాక్ అయ్యాడు.

  పాస్ బుక్ ఆన్ లైన్ చేయించాలి అంటే 10 లక్షల రూపాయలు అవుతుందని మురళీదొరను డిమాండ్ చేశాడు గణపతి. దీంతో షాక్ గురైన మురళీ తరువాత గ్రామ పెద్దలను పిలిపించి గ్రామంలో పంచాయితీ పెట్టించారు. ఆ పంచాయతీకి హాజరైన ఉప సర్పంచ్ గణపతి గ్రామ పెద్దల సమక్షంలోనే తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఓప్పుకున్నాడు. అలా ఎందుకు చేశాడో కూడా అందరి ముందే వివరించాడు.

  పంచాయతీ ఎన్నికల్లో తనకు చాలా లక్షలు ఖర్చాయ్యాయని.. ఆ డబ్బులు కూడా ఓటర్లకే ఇచ్చాను అంటూ వివరణ ఇచ్చాడు. అందుకే ఊరిలో రెవెన్యూ శాఖ కు సంబంధించి ఏ వ్యవహారం జరిగినా.. ఆ పనులు అన్నీ తాను చూసుకుంటానని.. అప్పుడే తనకు ఎన్నికల్లో ఖర్చైన డబ్బును సంపాదించుకుంటానని బహిరంగంగా చెప్పాడు. అతడు చెప్పిన సమాధానానికి గ్రామ పెద్దలు సైతం షాక్ తిన్నారు. వెంటనే ఉపసర్పంచ్ తన పదవికి రాజీనామా చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు గొడవకు దిగారు. వివాదం పెద్దది కావడంతో పోలీసులు చేరుకుని. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: