హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Murder mystery: మహిళను హత్యచేసి డ్రమ్ములోనే కుక్కేసిన నరరూప రాక్షసుడు.. విచారణలో విస్తుపోయే విషయాలు

Murder mystery: మహిళను హత్యచేసి డ్రమ్ములోనే కుక్కేసిన నరరూప రాక్షసుడు.. విచారణలో విస్తుపోయే విషయాలు

విశాఖ హత్యకేసులో సంచనల వాస్తవాలు

విశాఖ హత్యకేసులో సంచనల వాస్తవాలు

Murder Meystory: విశాఖలో శ్రద్ధా తరహాలో జరిగిన అత్యంత క్రూరమైన హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మహిళను చంపిన తరువాత.. డ్రమ్ములో కుక్కేసి.. నీట్ గా ప్యాక్ చేశాడు నరరూపా రాక్షసుడు.. అయితే ఏడాదిన్నరగా ఆ ప్లాస్టిక్ డ్రమ్ములోనే మృతదేహాన్ని ఉంచి.. ఏం తెలియని అమాయకుడిలా.. జనాల్లో తిరిగేస్తున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Murder mystery: మనుషులు రాక్షసులుగా మారుతున్నారు. మానవత్వాన్ని మరిచి.. చిన్న చిన్న కారణాలతో.. నరరూప రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా శ్రద్ధలాంటి ఘటన విశాఖపట్నం (Visakhapatnam) లో కలకలం రేపింది. విశాఖ మహా నగరం లో మధురవాడ (Madhuravada) లోని వికలాంగుల కాలనీలో ప్లాస్టిక్‌ డ్రమ్ము (Plastic Drum) లో పుర్రె, అస్తిపంజరం బయటపడడం కలకలం రేపింది. ఇంటి ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి చిక్కుముడిని విప్పారు. పోలీసుల విచారణలో మృతురాలు శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) మోదంటి వీధికి చెందిన 24 ఏళ్ల బమ్మిడి ధనలక్ష్మి గా గుర్తించారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన దండు రిషివర్ధన్‌ అలియాస్‌ కొప్పిశెట్టి రిషివర్ధన్‌ అలియాస్‌ రిషిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీస్‌ లు చెప్పిన వివరాల ప్రకారం.. కొమ్మాదిలో వెల్డింగ్‌ దుకాణం నడుపుతున్న నండూరి రమేష్‌కు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని తన దగ్గర పనిచేస్తున్న రిషికి 2020 సెప్టెంబర్‌లో అద్దెకు ఇచ్చాడు. అయితే అతడు కొంతకాలంగా అద్దె చెల్లించడం లేదు. ఆ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లును మే 2021 నుంచి చెల్లించకపోవడం, బిల్లు ఎక్కువగా వస్తుండటంతో రమేష్‌ ఆ ఇంటిని చూసేందుకు ఈ నెల 4వ అక్కడు వెళ్లడంతో అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది.

ఇంటి ఓనర్ అక్కడకు వెళ్లే సరికి.. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇంటి వెనుక తలుపు తీసి ఉండటంతో లోపలకు వెళ్లి చూడగా.. ఓ పక్కన ప్లాస్టిక్‌ డ్రమ్ము పీవీసీ టేప్‌తో సీల్‌ చేసి ఉండటం, అక్కడ భరించలేని దుర్వాసన రావటంతో పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి డ్రమ్ము తెరిచిచూడగా.. పుర్రె, అస్థి పంజరం, జుట్టు కనిపించాయి.

ఇదీ చదవండి : నేడు విజయవాడ , నెల్లూరులో సీఎం జగన్ .. బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పనున్నారు.?

అసలు ఏం జరిగింది అంటే..? నిందితుడు రిషివర్ధన్‌ తన భార్యతో కలిసి రమేష్‌ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. భార్య గర్భవతి కావటంతో 2021 జనవరిలో తన అత్తగారి ఊరైన శ్రీకాకుళం బల్లిగూడకు కాన్పు నిమిత్తం పంపించాడు. ఆ తరువాత తరచూ భార్యను చూసేందుకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో 2021 మే 29న శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం వేచి ఉండగా.. 24 ఏళ్ల బమ్మిడి ధనలక్ష్మి అనే మహిళతో పరిచయమైంది. ఇద్దరూ ఫోన్‌ నంబర్లు తీసుకుని.. రోజు ముచ్చట్లు పెట్టుకునే వారు. ఆ పరిచయం వివాహేత సంబంధానికి దారి తీసింది. అలా ఒకరోజు ఇద్దరు కలసి ఆటోలో నాతవరం వరకు ప్రయాణించారు. అదే నెల 30న రిషికి ధనలక్ష్మి పలుమార్లు ఫోన్‌ చేసింది. తన భార్య ఇంటి దగ్గర లేదని రిషి చెప్పటంతో ధనలక్షి ఆ రోజు రాత్రి అతడి ఇంటికెళ్లింది. వేకువజామున 4.30 గంటల సమయంలో ధనలక్ష్మి 2 వేల రూపాయలు కావాలని డిమాండ్‌ చేసింది. తన దగ్గర 100 రూపాయలే ఉన్నాయని రిషి చెప్పగా.. అతడి భార్య దుస్తులు, టీవీ ఇమ్మని అడిగింది.

ఇదీ చదవండి : శ్రీకాళహస్తిలో చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి.. చెలరేగిన మంటలు.. 8మందికి గాయాలు

అందుకు తిరస్కరించిన.. తాను అడిగినవి ఇవ్వకపోతే బయటకు వెళ్లి గొడవ చేస్తానని హెచ్చరించడంతో రిషి కోపంతో ఆమె మెడకు చున్నీ బిగించటంతో ప్రాణం విడిచింది. మృతదేహాన్ని బ్లాంకెట్‌ ప్లాస్టిక్‌ జిప్‌ కవర్‌లో ప్యాక్‌ చేసి.. ఇంట్లోని ప్లాస్టిక్‌ డ్రమ్‌లో దించి మూతను సెల్లో టేప్‌తో మూసివేశాడు. తరువాత ఏం తెలియని అమాయకుడిలా అక్కడ నుంచి వెళ్లిపోయి తన సెల్‌ఫోన్‌ను 13 రోజులు స్విచ్ఛాఫ్‌ చేసి ఉంచాడు. ఆ తరువాత ఇంటిని ఖాళీ చేసిన రిషి వెల్డింగ్‌ షాపులో పని కూడా మానేసి తన అత్తగారింటికి వెళ్లిపోయాడు.

ఇదీ చదవండి : త్వరలో జనసేనలోకి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు..!

ఎలా చిక్కాడు అంటే..?

ఘటనా స్థలంలో మృతురాలు ధనలక్ష్మికి చెందిన బ్యాగ్‌ పోలీసులకు లభించింది. అందులో రిషి ఫోన్‌ నంబర్‌ రాసి ఉన్న ఓ స్లిప్‌ దొరికింది. కాల్‌ లిస్ట్‌ ఆధారంగా ఘటన జరగడానికి ముందు మృతురాలి నంబర్‌ నుంచి అతడి నంబర్‌కు ఫోన్లు రావడాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి మృతురాలి వివరాలతోపాటు నిందితుడిని గుర్తించారు. ధనలక్ష్మికి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు ఎవరూ లేకపోవటంతో ఆమె కనిపించడం లేదని ఎక్కడా మిస్సింగ్‌ కేసు కూడా నమోదు కాలేదు. నిందితుడి ఫోన్‌ నంబర్‌ను ట్రేస్‌ చేయగా.. అతడు 6 నెలలుగా కొమ్మాదిలోని ఒక హాస్టల్‌లో అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakhapatnam

ఉత్తమ కథలు